
రాహుల్ చెప్పిన ఆ ఓట్ల దొంగలెవరు?
బీహార్ ‘‘ఓటర్ అధికార్ యాత్ర’’లో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్, ఈసీపై కాంగ్రెస్ అగ్రనేత ఆరోపణలు..
బీజేపీ(BJP), ఆర్‌ఎస్‌ఎస్(RSS), ఈసీ(EC) దేశంలో ఓటు దొంగతనానికి పాల్పడుతున్నాయని కాంగ్రెస్(Congress) అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఆరోపించారు. బీహార్ నుంచి ప్రారంభమైన ‘‘ఓటర్ అధికార్ యాత్ర’’(Voter Adhikar Yatra) ఓట్ల దొంగతనానికి వ్యతిరేకంగా దేశవ్యాప్త ఉద్యమంగా మారుతుందని పేర్కొన్నారు. ఈసీ చేపట్టిన ఓటరు జాబితా సవరణకు వ్యతిరేకంగా లోక్‌సభా ప్రతిపక్ష నేత త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బీహార్‌లో ‘‘ఓటర్ అధికార్ యాత్ర’’ చేపట్టిన విషయం తెలిసిందే. ఆరాలో శనివారం జరిగిన బహిరంగ ర్యాలీలో రాహుల్ ప్రసంగించారు. ఓటరు జాబితా సవరణను "రాజ్యాంగం, ప్రజాస్వామ్య వ్యవస్థపై దాడి"గా అభివర్ణించారు.
'ఇకముందు అలా జరగనివ్వను'
"మహారాష్ట్ర, దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఓట్లను దొంగిలించడం ద్వారా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కానీ బీహార్‌లో బీజేపీ, ఎన్నికల కమిషన్ ఒక్క ఓటును కూడా దొంగిలించడానికి మేం అనుమతించం" అని అన్నారు రాహుల్.
రాహుల్ 'ఓటర్ అధికార్ యాత్ర' బీహార్‌లో 16 రోజుల పాటు సాగనుంది. సుమారు 20 జిల్లాలను కవర్ చేస్తూ సాగే ఈ యాత్ర సెప్టెంబర్ 1న పాట్నాలో మేగా ర్యాలీతో ముగుస్తుంది.