
ఆర్‌ఎస్‌ఎస్ భగవత్ వ్యాఖ్యలకు ఎస్పీ అఖిలేష్ యాదవ్ కౌంటర్ ఏమిటి?
'ఓటర్ అధికార్ యాత్ర'లో రాహుల్‌కు మద్దతు తెలిపేందుకు బీహార్‌కు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి..
సమాజ్‌వాదీ(SP) పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్(Akhilesh Yadav) ఆర్‌ఎస్‌ఎస్ (RSS) చీఫ్ మోహన్ భగవత్(Bhagwat) వ్యాఖ్యలకు వ్యంగంగా కౌంటర్ ఇచ్చారు. భారతదేశం "40వేల ఏళ్లుగా ఒకే DNA" కలిగి ఉందని RSS చీఫ్ మోహన్ భగవత్ ఇటీవల అన్నారు. ఆయన వ్యాఖ్యలను తప్పుబడుతూ.."సామాజిక న్యాయం కోసం మా పోరాటం 5వేల ఏళ్ల నాటిదని, కానీ అది ఇప్పుడు 40వేల ఏళ్ల నాటిదని మాకు చెబుతున్నారు." అని పేర్కొన్నారు. SIRకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ(Rahul Gandhi) బీహార్(Bihar)లో నిర్వహిస్తున్న 'ఓటర్ అధికార్ యాత్ర'కు మద్దతు తెలిపేందుకు ఆయన శనివారం అరాలో నిర్వహించిన ర్యాలీలో ప్రసంగించారు.
ఈసీ(EC)పై అఖిలేష్ విమర్శలు
ఎన్నికలు జరగనున్న బీహార్‌లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) నిర్వహించిన భారత ఎన్నికల సంఘాన్ని (ECI) అఖిలేష్ యాదవ్ తీవ్రంగా విమర్శించారు. ఎన్నికల సంఘం బీజేపీకి "జుగాద్ కమిషన్"లా పనిచేస్తుందని ఆరోపించారు.
"ఓటర్ అధికార్ యాత్రలో పాల్గొనడానికి, బీహార్ ప్రజల మద్దతును అభినందించడానికి నేను వచ్చాను. దేశవ్యాప్తంగా బీహార్ స్వరం వినిపిస్తోంది. ఈసారి రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాలరాసినందున, బీహార్‌లో బీజేపీ తుడిచిపెట్టుకుపోతుంది" అని ఆయన పాట్నాలో విలేఖరులతో అన్నారు.
ఈసీఐను విమర్శిస్తూ.. బీహార్ ప్రజలు "ఎన్నికల కమిషన్ సర్" ను అమలు చేయాలని నిర్ణయించుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
బీహార్ ప్రజలు గతంలో ఉద్యోగాలు లేక ఎలా వలస వెళ్ళేవారో చూశానని, వారికి ఉద్యోగాలు, ఉపాధి కల్పించారని ఆర్‌జేడీ నేత తేజస్విని ప్రశంసించారు. ఈసారి తేజస్వి అధికారంలోకి వస్తే నిరుద్యోగుల వలసలు ఉండవని, బదులుగా వెళ్లాల్సి వెళ్లేది బీజేపీయేనని విమర్శించారు.
"ఈ ఉదయం, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సరన్‌లో జరిగిన ఓటరు అధికార్ యాత్రలో పాల్గొన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఆయన మద్దతు ఇవ్వడాన్ని నేను స్వాగతిస్తున్నా. బీజేపీ ప్రజాస్వామ్య విధ్వంసానికి వ్యతిరేకంగా జరుగుతోన్న పోరాటలో ఆయన మాకు పూర్తి మద్దతు ఇచ్చే మిత్రుడు కూడా," అని వేణుగోపాల్ సోషల్ మీడియా వేదికగా పేర్కొ్న్నారు.
14వ రోజు యాత్ర సరన్ నుంచి భోజ్‌పూర్ వైపు కదిలింది. రాహుల్‌ను చూసేందుకు దారి పొడవునా పెద్ద సంఖ్యలో జనం గుమిగూడారు. సరన్‌లో ఓపెన్-టాప్ వాహనంలో రాహుల్ గాంధీతో పాటు అఖిలేష్, తేజస్వి, తేజస్వి సోదరి రోహిణి, భారత కూటమి ప్రతినిధులు జనాలకు చేయి ఊపుతూ కనిపించారు.
బీహార్‌లో SIRకు వ్యతిరేకిస్తూ రాహుల్ ఆగస్టు 17న రోహ్తాస్‌లోని ససారాం నుంచి కాంగ్రెస్ 'ఓటర్ అధికార్ యాత్ర'ను ప్రారంభించారు. 20 జిల్లాల్లో 1,300 కి.మీ.లకు పైగా సాగే ఈ పాదయాత్ర సెప్టెంబర్ 1న పాట్నాలో ముగుస్తుంది.
ఇప్పటివరకు యాత్ర గయా, నవాడా, షేక్‌పురా, లఖిసరాయ్, ముంగేర్, కతిహార్, దర్భంగా, మధుబని, సీతామర్హి, ముజఫర్‌పూర్, పూర్నియా, పశ్చిమ చంపారన్, గోపాల్‌గంజ్, తూర్పు చంపారన్, సివాన్‌తో సహా జిల్లాల గుండా సాగింది. ఇప్పుడు పాట్నా చేరుకోవడానికి ముందు భోజ్‌పూర్ మీదుగా సాగుతోంది.