విద్యావ్యవస్థ గురించి ఐఐటీ మద్రాస్ విద్యార్థులతో రాహుల్ ఏం చెప్పారంటే.
x

విద్యావ్యవస్థ గురించి ఐఐటీ మద్రాస్ విద్యార్థులతో రాహుల్ ఏం చెప్పారంటే.

"ప్రతి ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత పిల్లలకు నాణ్యమైన విద్య అందించడమే. ప్రైవేటీకరణ, ఆర్థిక ప్రోత్సాహకాలతో ఇది సాధ్యం కాదు.’’- రాహుల్ గాంధీ


ప్రైవేటీకరణతో నాణ్యమైన విద్య సాధ్యం కాదని లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ(Rahul Gandhi) స్పష్టం చేశారు. విద్యా రంగానికి (Education) ప్రభుత్వాలు అధిక నిధులు ఖర్చుచేయడంతో పాటు ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేయడం ద్వారానే నాణ్యమైన విద్య సాధ్యమని అభిప్రాయపడ్డారు. ఐఐటీ మద్రాస్ (IIT Madras) విద్యార్థులతో ఆయన ఇటీవల సమావేశమయ్యారు. విద్యా వ్యవస్థ, అంతర్జాతీయ సంబంధాలపై తన అభిప్రాయాలను వారితో పంచుకున్నారు.

కాంగ్రెస్, బీజేపీ మధ్య తేడా గురించి చెబుతూ..

కాంగ్రెస్(Congress), బీజేపీ(BJP) మధ్య తేడా ఏమిటని ఐఐటీ మద్రాస్ విద్యార్థులు అడిగిన ప్రశ్నకు రాహుల్ సమాధానమిస్తూ.. కాంగ్రెస్ పార్టీ, యూపీఏ ప్రభుత్వం వనరుల సమాన పంపిణీ, సమగ్రాభివృద్ధి కోసం కృషి చేస్తాయని చెప్పారు. ఫలితంగా సమాజంలోని అన్ని వర్గాలకు లబ్ధి చేకూరుతుందని అభిప్రాయపడ్డారు.

బీజేపీ అధిక వృద్ధే లక్ష్యంగా పెట్టుకుంటుందని రాహుల్ అన్నారు. ఆర్థిక విధానాల్లో బీజేపీ 'ట్రికిల్ డౌన్' సిద్ధాంతాన్ని నమ్ముతుందని చెప్పారు. దేశంలో కలహాలు తగ్గినప్పుడే అభివృద్ధి జరుగుతుందని నమ్మే వ్యక్తిని నేను," అని వ్యాఖ్యానించారు.

విద్యా వ్యవస్థపై రాహుల్ అభిప్రాయాలు..

రాహుల్ విద్యా వ్యవస్థలో తలెత్తుతున్న సమస్యల గురించి కూడా మాట్లాడారు. ప్రైవేటీకరణ ద్వారా నాణ్యమైన విద్య సాధ్యం కాదని, ప్రభుత్వం ఖర్చు పెంచడం ద్వారా మాత్రమే సమగ్ర విద్యా వ్యవస్థను నిర్మించగలమని తెలిపారు. "ప్రతి ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత ప్రజలకు నాణ్యమైన విద్య అందించడమే. ప్రైవేటీకరణ, ఆర్థిక ప్రోత్సాహకాలతో ఇది సాధ్యం కాదు. విద్యలో పెట్టుబడులు పెంచి ప్రభుత్వ సంస్థలను మరింత బలోపేతం చేయాలి," అని ఆయన పేర్కొన్నారు.

విద్యార్థులకు మార్గనిర్దేశం..

తన వాట్సాప్ ఛానల్ ద్వారా విద్యార్థులతో 'సాంప్రదాయ కెరీర్'లకు మించిన చాలా మార్గాల గురించి రాహుల్ చర్చించారు. తమ అభిరుచులకు అనుగుణంగా కొత్త మార్గాలను అన్వేషించాల్సిన అవసరముందని సూచించారు. " అధ్యాపకులు కూడా విద్యార్థుల ఆలోచలను ప్రోత్సహించాలి. పరిశోధనలకు ప్రాధాన్యం ఇస్తూ, ఉత్పత్తిని పెంచడం ద్వారా దేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపవచ్చు," అని పేర్కొన్నారు.

విద్యా వ్యవస్థలో మార్పులు అవసరం

భారత విద్యా వ్యవస్థ చాలా పరిమితమైందని పేర్కొన్నారు. "మన విద్యా వ్యవస్థ పిల్లల ఊహాశక్తిని పెంచేలా లేదు. ఇది చాలా పరిమిత వ్యవస్థ," అని రాహుల్ అభిప్రాయపడ్డారు. తన భారత్ జోడో యాత్రలో అనేక మంది పిల్లలతో మాట్లాడినప్పుడు.. వారు తనతో లాయర్, డాక్టర్, ఇంజనీర్, ఆర్మీ సైనికుడు కావడమే లక్ష్యమని చెప్పారని రాహుల్ వెల్లడించారు. మన వ్యవస్థ పిల్లలను కొన్ని కెరీర్‌ల వైపే నడిపిస్తోంది. ఇది మారాలి. ప్రతి విద్యార్థి ఆసక్తి, అభిరుచులకు అనుగుణంగా మార్గాన్ని అన్వేషించాలి," అని రాహుల్ స్పష్టం చేశారు.

ఉత్పత్తి రంగంపై దృష్టి పెట్టాలి.

విద్యా వ్యవస్థ ఉత్పత్తి రంగంలో విద్యార్థులను ప్రోత్సహించేలా ఉండాలన్నారు రాహుల్. "నిజమైన ఆవిష్కరణ ఉత్పత్తి రంగంలోనే జరుగుతుంది. పరిశోధన, అభివృద్ధిలో ఎంత పెట్టుబడులు పెట్టినా, ఉత్పత్తి లేకపోతే ఫలితం ఉండదు," అని అభిప్రాయపడ్డారు.

అంతర్జాతీయ సంబంధాలు..

భారత్, చైనా, అమెరికాల మధ్య సమతుల్యాన్ని కాపాడటమే అత్యంత కీలకమని రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. "ఈ రెండు మహా శక్తులు పరస్పరం పోటీ పడుతున్న సమయంలో.. భారత్ సమతుల్య విధానం పాటించాలి. సరైన దిశలో పయనిస్తే, మన దేశానికి అదనపు లాభాలు చేకూరుతాయి," అని రాహుల్ అన్నారు

Read More
Next Story