
బీహార్‌లో I.N.D.I.A, NDA కూటముల బలాలు, బలహీనతలేంటి?
షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం..
బీహార్(Bihar) అసెంబ్లీ ఎన్నికల(Assembly polls) షెడ్యూల్ విడుదలైంది. నవంబర్ 6, 11 తేదీలలో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. నవంబర్ 14న ఫలితాలు వెలవడతాయని ఎన్నికల సంఘం(EC) అధికారికంగా ప్రకటించింది. దీంతో అధికార NDA, ప్రతిపక్ష I.N.D.I.A కూటమి హోరాహోరీగా తలపడనున్నాయి.
NDAలో JD(U), BJP, మిత్రపక్షాలు ఉన్నాయి. నితీష్ కుమార్ మరోమారు ముఖ్యమంత్రిగా కొనసాగాలని ఆశపడుతున్నారు. RJDకి చెందిన తేజస్వి యాదవ్ నేతృత్వంలోని I.N.D.I.A బ్లాక్, కాంగ్రెస్, ఇతర భాగస్వాములతో కలిసి బీహార్‌లో NDA సుదీర్ఘ పాలనకు చెక్ పెట్టాలని చూస్తోంది.
భారత కూటమి బలం..
బీహార్‌లో ముస్లిం-యాదవ్ ఓట్లరు దాదాపు 30 శాతం మంది ఉన్నారు. వీరంతా తమ వైపు ఉన్నారని భారత కూటమి భావిస్తోంది. ప్రత్యేక ఓటరు జాబితా (S.I.R) ప్రక్రియను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, లాలూ ప్రసాద్ కుమారుడు తేజస్వి యాదవ్ రాష్ట్రంలో ‘‘ ఓటర్ అధికర్ యాత్ర’’ చేపట్టిన విషయం తెలిసిందే. వీరి పర్యటన యువతను ఉత్తేజపర్చినా.. అంతర్గతంగా భారత కూటమి కొన్ని సవాళ్లను ఎదుర్కొంటుంది. ఆర్జేడీలో యాదవ్ కుటుంబం ఆధిపత్యం చెలాయిస్తోంది. చాలా మంది భూమి-ఉద్యోగాల కుంభకోణం కేసుల్లో ఇరుకున్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడం, శాంతిభద్రతల పరిరక్షణ తన బాధ్యత అని ఈ మధ్య కాలంలో తేజస్వీ ఇటీవల చెబుతూ వస్తున్నారు. తక్కువ ప్రాతినిధ్య వర్గాలను ఆకర్షించడానికి కాంగ్రెస్, CPI(ML) లిబరేషన్ వంటి భాగస్వాములతో కలిసి భారత కూటమి పనిచేస్తుంది.
NDA అంచనాలేంటి?
నితీష్ కుమార్ ప్రజాకర్షక పాలన, వ్యూహాత్మక పొత్తులలో NDA.. మరోసారి అధికారంలోకి రావడానికి వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే మహిళల ఖాతాలో రూ. 10 వేలు నగదు జమచేశారు. పాత పథకాలు అలాగే కొనసాగుతున్నాయి.