ఇక్కడ కూడా ‘సర్’ లాంటి ప్రక్రియ ఎందుకు చేపట్టరు?
x
మహారాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని కలిసిన విపక్ష నాయకులు

ఇక్కడ కూడా ‘సర్’ లాంటి ప్రక్రియ ఎందుకు చేపట్టరు?

రాష్ట్ర ఎన్నికల అధికారిని కోరిన విపక్షాలు


ఇన్నాళ్లు బీహార్ లో ఎన్నికల సంఘం నిర్వహించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) ను తప్పు పట్టిన విపక్షాలు మహారాష్ట్రలో మాత్రం ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయి. త్వరలో ఇక్కడ జరగబోతున్న స్థానిక సంస్థల ఎన్నికల ముందు ‘సర్’ ఎందుకు చేపట్టడం లేదని ప్రశ్నిస్తున్నాయి. అలాగే స్థానిక ఎన్నికలలో కూడా వీవీప్యాట్ ను కూడా ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తున్నాయి.

కలిసిన థాకరే సోదరులు..
మహారాష్ట్ర నవ నిర్మాణ సేన(MNS) చీఫ్ రాజ్ థాకరే, ఎన్సీపీ(NCP) అధినేత శరద్ పవార్, శివసేన(UBT) చీఫ్ ఉద్దవ్ థాకరే సహ ప్రతిపక్ష నాయకులంతా కలిసి మహారాష్ట్ర ఎన్నికల ప్రధాన ఎన్నికల అధికారి ఎస్. చొక్కలింగంను కలిశారు. మహారాష్ట్ర ఓటర్ల జాబితాతో సహ ఎన్నికల ప్రక్రియలో అవకతవకలు జరుగుతున్నాయని ఫిర్యాదు చేశారు.
థాకరే సోదరులు కలిసి ఎన్నికల అధికారిని కలవడంతో స్థానిక సంస్థల ఎన్నికలలో పొత్తులు కుదురబోతున్నాయమనే పుకార్లు జోరందుకున్నాయి. వీరు ఎన్నికల సీఈఓను కలవడానికి ముందు థాకరే సోదరులు పవార్ నారిమన్ పాయింట్ ప్రాంతంలోని ‘శివాలయ్’ సేన కార్యాలయంలో సమావేశం అయ్యారు. రాజ్ థాకరే కూడా ఈ ఆందోళనలలో పాల్గొనడంతో ప్రతిపక్ష కూటమిలో చేరడం దాదాపు ఖరారు అయినట్లే తెలుస్తోంది.
ఓటర్ల జాబితాలో అక్రమాలు..
కాంగ్రెస్, వామపక్ష పార్టీలు, రైతు కార్మికుల పార్టీ, సమాజ్ వాదీ పార్టీ నాయకుల ప్రతినిధి బృందం మంత్రాలయ(సెక్రటేరియట్) లో చొక్కలింగం కలిసి స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితాలోని లోపాలను సరిచేయాలని డిమాండ్ చేశాయి.
‘‘బీహర్ లో లాగా మహారాష్ట్రలో కూడా ఎన్నికల సంఘం సర్ లాంటి ప్రక్రియ చేస్తుందా లేదా?’’ అని నాయకులు ఎన్నికల అధికారికి ఇచ్చిన మెమోరాండంలో పేర్కొన్నారు. ముంబై, థానే, కళ్యాణ్, దొంబివిలి, నాసిక్, పూణేలలో పెద్ద సంఖ్యలో స్థిరపడిన ఇతర ప్రాంతాల వారు రాష్ట్రంతో పాటు స్థానికంగా వారి స్వంత రాష్ట్రాలలో కూడా ఓటర్లుగా ఉన్నారని ప్రతినిధి బృందం ఆరోపించింది. వెంటనే వీటిని తొలగించాలని ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేసింది.
బ్యాలెట్ పత్రాలు పెట్టాలి
రాబోయో రెండు నెలల్లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలలో వీవీప్యాట్ వ్యవస్థను అనుమతించాలని కూడా ప్రతిపక్ష నాయకులు డిమాండ్ చేశారు.
బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్(BMC) ఎన్నికలకు ఎన్నికల సంఘం వీవీప్యాట్ లను అనుమతించకపోతే బ్యాలెట్ పత్రాలపై ఎన్నికలు నిర్వహించాలని మెమోరాండం పార్టీలు డిమాండ్ చేశాయి.
ముంబై కాంగ్రెస్ అధ్యక్షురాలు వర్ష గైక్వాడ్, శివసేన నాయకులు అంబదాస్ దన్వే, అరవింద్ సావంత్ లతో కూడిన మరో ప్రతినిధి బృందం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ దినేశ్ వాగ్మారేతో జరిగిన సమావేశంలో పలు డిమాండ్లను లేవనెత్తింది.
అక్టోబర్ 2024 నుంచి జూలై 2025 మధ్య కొత్త ఓటర్లను జాబితాలో చేర్చారని ప్రతిపక్ష మెమోరాండం పేర్కొంది. జూలై 2025 తరువాత 18 ఏళ్లు నిండిన యువ ఓటర్ల పేర్లను ఎందుకు చేర్చలేదని, పోల్ బాడీ ఓటర్ జాబితాను ఎందుకు బహిరంగపరచలేదని నాయకులు ప్రశ్నించారు.
నకిలీ ఓటర్లు..
‘‘రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో ఓటర్ల జాబితాలోని అవకతవకలను చూపించడానికి మేము ఎస్. చొక్కలింగం ను కలిశాము. ఇప్పుడు చాలా అవకతవకలు జరుగుతున్నాయని స్పష్టంగా కనిపిస్తోంది. ఇది వివిధ నియోజకవర్గాలలో కనిపిస్తోంది.’’ అని ఎన్సీపీ(ఎస్పీ) నాయకుడు జయంత్ పాటిల్ విలేకరులతో అన్నారు.
ఓటర్ల జాబితా సరిచేయకపోతే రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికలను కొనసాగిస్తే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా ఇదే గందరగోళం కొనసాగుతుందని ఆయన అన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను కలిసి సమస్యలను వివరించామని, వారు సానుకూలంగా స్పందించారని తెలిపారు.
‘‘ఒకే సందర్భంలో ఒకే ఇంట్లో 170 మంది నమోదిత ఓటర్లు ఉన్నారు’’ అని ఆయన ఆరోపించారు. ఎన్నికలు నిర్వహించే ముందు ఓటర్ల జాబితాలోని లోపాలను సరిదిద్దాలని డిమాండ్ చేశారు.


Read More
Next Story