‘మహాయుతి 2.0, పులి మీద స్వారీనేనా’
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి పక్షం ఘన విజయం సాధించింది. ముఖ్యమంత్రిగా నేడు దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.
చాలా రోజుల సస్పెన్స్ తరువాత మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ఈరోజు లాంఛనంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. నిన్న ముంబైలో సమావేశమైన బీజేపీ ఎమ్మెల్యేలు తమ శాసనసభ పక్షం నాయకుడిగా ఫడ్నవీస్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ముఖ్యమంత్రి పీఠం పై ఆశలు పెట్టుకున్న శివసేన( షిండే వర్గం) నాయకుడిని కమల దళం విజయవంతంగా నిలువరించింది. అయితే మూడు పార్టీల మహాయుతి కూటమి సమన్వయం మాత్రం పులి మీద స్వారీ వంటిదే అని చెప్పాలి.
శాసన సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి విజయానికి తోడ్పడింది నిస్సందేహాంగా మహిళలలే అని చెప్పాలి. ముఖ్యంగా లోక్ సభ ఎన్నికల ఫలితాల తరువాత నాయకులు, కార్యకర్తలు తమ లోపాలపై దృష్టి పెట్టి ప్రజల మద్ధతును పొందడానికి ప్రణాళికలు రచించారు. అందులో భాగంగా కొత్త సమీకరణం రూపొందించుకుని మహిళా ఓటర్లను ఆకర్షించారు. ముఖ్యంగా మహిళల సంక్షేమం కోసం అమలు చేసిన లాడ్లీ బెహనా యోజన కూటమిపై ఓట్ల వర్షం కురిపించింది.
ప్రభుత్వ ఎజెండా
'మహారాష్ట్రలో ఎన్డీయే మళ్లీ అధికారంలోకి రావడం సంతోషకరమైన విషయం. 137 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నందున ముఖ్యమంత్రి పదవి బీజేపీకి దక్కుతుందని స్పష్టమైంది. ప్రభుత్వ ఎజెండాను ముఖ్యమంత్రి నిర్ణయించాల్సి ఉంటుంది, అయితే కూటమికి మద్దతిచ్చిన మహిళల కోసం ఎన్‌డిఎ ఖచ్చితంగా పని చేస్తుంది” అని ఎన్‌సిపి ఎంపి నిఖిల్ లక్ష్మణ్‌రావ్ జాదవ్ పాటిల్ ది ఫెడరల్‌తో అన్నారు.
లోక్‌సభ - రాష్ట్రాల ఎన్నికల మధ్య, లాడ్లీ బెహనా యోజన అతిపెద్ద గేమ్‌ఛేంజర్‌గా నిలిచింది. లోక్ సభ ఎన్నికల కంటే ప్రస్తుత శాసన సభ ఎన్నికల్లో NDAకి మహిళల ఓట్ల శాతం 5 శాతానికి పైగా పెరిగింది. లోక్‌సభ పోరులో ఎన్‌డిఎకు నష్టం కలిగించిన కలిగించిన రైతులు, ముఖ్యంగా ఉల్లి, సోయాబీన్, పత్తి, వరి రైతుల అంచనాలను అందుకోవడం కొత్త ప్రభుత్వానికి ఓ సవాల్.
గ్రామీణ పరిస్థితుల్లో మార్పు..
శాసన సభ ఎన్నికల సమయంలో బీజేపీ, గ్రామీణ రైతుల దుస్థితి తన మీద పడకుండా జాగ్రత్త పడింది. అయితే మున్ముందు పరిపాలన కాలంలో రైతులతో వ్యవహరాలు నిర్వహించడం ఓ సవాల్ గా నిలుస్తుందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తులకు మద్ధతు ధరలు సాధించడానికి తిరిగి రైతుల రోడ్లు ఎక్కే పరిస్థితి వస్తుందని బీజేపీ సీనియర్ నాయకులు కూడా అంచనా వేస్తున్నారు.
"సామాజిక భద్రత ప్రభుత్వ ఇతివృత్తంగా ఉండబోతోంది" అని ముంబైకి చెందిన ఒక బిజెపి నాయకుడు ది ఫెడరల్‌తో అన్నారు. "గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి, MSP (కనీస మద్దతు ధర) పెరుగుదలపై దృష్టి కేంద్రీకరిస్తారు. సామాజిక భద్రత అంటే ఆర్థికంగా బలహీన వర్గాల సంక్షేమం మాత్రమే కాదు, రైతులకు మంచి ధరలు, మహిళల ఆదాయాన్ని పెంచడం కూడా దీని అర్థమని చెప్పారు.
స్థానిక సంస్థల ఎన్నికలు 2025 ప్రారంభంలో జరిగే అవకాశం ఉన్నందున, పట్టణ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంపై ప్రభుత్వం దృష్టి సారించాలని కూటమి నాయకులు భావిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ప్రభుత్వ పనితీరులో కీలకపాత్ర పోషిస్తాయని, ఈ విజయం ఎన్డీయేను మరింత బలోపేతం చేస్తుందని బీజేపీ భావిస్తోంది.
శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే ఇద్దరూ మళ్లీ ఎన్డీయేను ఓడించేందుకు ప్రయత్నిస్తారు. ప్రజాభిప్రాయాన్ని ఏర్పరచడంలో స్థానిక సంస్థల ఎన్నికలు కీలక పాత్ర పోషిస్తాయి” అని నాగ్‌పూర్‌కు చెందిన రచయిత, RSS పరిశీలకుడు దిలీప్ దేవధర్ ది ఫెడరల్‌తో అన్నారు.
మరాఠా ఆందోళన
మహారాష్ట్రలో ఎన్డీఏ సాధించిన అఖండ విజయం, మరాఠాల రిజర్వేషన్ ఉద్యమానికి పెద్ద అవరోధమనే చెప్పాలి. ఈ అంశాన్ని ఎదుర్కోవడంలో పాలక కూటమి స్పష్టమైన సందేశం ఆ వర్గం నేతలకు పంపినట్లు అయింది.
ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్‌లతో పాటు బీజేపీకి చెందిన కొందరు ప్రముఖ మరాఠా నేతలు కూడా ప్రభుత్వంలో ఉండడంతో మరాఠా ఆందోళనను అదుపు చేయగలరని సీనియర్ నేతలు భావిస్తున్నారు. రిజర్వేషన్ల కోసం మరాఠా సమాజం చేస్తున్న ఆందోళనలు ఎప్పటికీ ఆగవు.
కానీ బిజెపి-ఎన్‌డిఎ ఆందోళనకు చెక్‌మేట్ చేసిందని మేము ఖచ్చితంగా చెప్పగలం. ఎన్నికల విజయం మరాఠా ఆందోళనలు, రైతు ఆందోళనల ప్రభావాన్ని ఎదుర్కోవడానికి బిజెపికి కచ్చితంగా సాయం చేస్తుంది" అని ముంబైకి చెందిన బిజెపి నాయకుడు ది ఫెడరల్‌తో అన్నారు.
మోదీ మ్యాజిక్..
వివిధ వర్గాల రిజర్వేషన్ల డిమాండ్ కారణంగా మహారాష్ట్ర రాజకీయాలు కొన్నేళ్లుగా కులం బురదను పూసుకున్నాయి. ఇది ఏ ఒక్క పార్టీకో పరిమితం కాలేదు. కానీ ఈ ఎన్నికల్లో ఎన్డీఏ తీసుకొచ్చిన నినాదం.. ఏక్ హై టూ సేఫ్ హై' (యునైటెడ్‌గా ఉండండి, సురక్షితంగా ఉండండి) సాధారణ ఓటర్లపై ప్రభావం చూపింది. భవిష్యత్ లో ఎన్డీఏ ఈ నినాదాన్ని అన్ని రాష్ట్రాల్లోనూ వినిపిస్తుందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. నినాదానికి సంబంధించినంత వరకు బీజేపీ, శివసేన రెండూ ఒకే పేజీలో ఉన్నాయని దేవధర్ అన్నారు.
Next Story