‘మహా’ ప్రభుత్వంతో వేల కోట్ల ఎంఓయూలు
x

‘మహా’ ప్రభుత్వంతో వేల కోట్ల ఎంఓయూలు

పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చిన తొమ్మిది కంపెనీలు


మహారాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం వివిధ కంపెనీలతో మొత్తం రూ.80,962 కోట్ల పెట్టుబడికి తొమ్మిది అవగాహాన ఒప్పందాలపై సంతకం చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ అవగాహాన ఒప్పందాల కింద ఊమించిన ప్రాజెక్ట్ లు 40,300 కంటే ఎక్కువ ఉద్యోగాలను సృష్టిస్తాయని వారు తెలిపారు.

ముంబైలోని గోరేగావ్ లో ఏఐఎఫ్ఏ నిర్వహించిన స్టీల్ మహాకుంభ్ లో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి, రాష్ట్ర పరిశ్రమల మంత్రి ఉదయ్ సమంత్ సమక్షంలో ఈ ఒప్పందాలు సంతకాలు చేశారు.

గడ్చిరోలి, చంద్రపూర్, నాగ్ పూర్, వార్థా, రాయ్ గఢ్, ఛత్రపతి శంభాజీ నగర్ , సతారా జిల్లాల్లో ఈ ప్రాజెక్ట్ లు వస్తాయని సీఎంఓ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

ప్రధాన పెట్టుబడులలో రష్మీ మెటలర్జీకల్ ఇండస్ట్రీస్ వార్థాలో రూ. 25 వేల కోట్ల మూలధన వ్యయంతో ఇంటిగ్రేటేడ్ స్టీల్ ప్లాంట్ ను ఏర్పాటు చేస్తుంది. దీనిద్వారా 12 వేల ఉద్యోగాలు లభిస్తాయని అంచనా.
రాయ్ గఢ్ లో జిందాల్ స్టెయిన్ లెస్ లిమిటేడ్ రూ. 41,580 కోట్ల విలువైన స్టెయిన్ లెస్ స్టీల్ ప్లాంట్ ను ఏర్పాటు చేస్తుంది. దీని ద్వారా దాదాపు 15,500 ఉద్యోగాలు సృష్టిస్తుందని ప్రకటన తెలిపింది.
ఛత్రపతి శంభాజీ నగర్ లో ఎన్ఎస్పీఎస్ఎప్పీఎల్ అడ్వాన్స్ డ్ మెటీరియల్(అథా గ్రూప్) రూ. 5,440 కోట్ల పెట్టుబడితో ‘క్రిటికల్లీ అడ్వాన్స్ డ్ లిథియం బ్యాటరీ మెటిరీయల్ అండ కార్భన్ కాంప్లెక్స్’ ను ఏర్పాటు చేయనుంది.
ఇది 5 వేలమందికి ఉపాధి కల్పిస్తుందని భావిస్తున్నారు. గడ్చిరోలీ లో సుమేథ్ టూల్స్, హరియోమ్ పైప్ ఇండస్ట్రీస్ సంయుక్త ప్రాజెక్ట్ లు ప్రారంభించబోతున్నారు.
ఇవి రూ. 5,135 కోట్ల పెట్టుబడిని తెస్తాయి. వీటి ద్వారా రూ. 5,500 ఉద్యోగాలు కల్పిస్తాయి. అలాగే చంద్రపూర్ లో ఐకాన్ స్టీల్ ఇండియా ప్రయివేట్ లిమిటెడ్ రూ. 850 కోట్ల స్పాంజ్ ఐరన్ యూనిట్, సతారాలోని వైలో ఫిల్టర్రమ్ ఆటోకాంప్ రూ.100 కోట్ల ఆటోమోటివ్ స్టీల్ పార్ట్స్ యూనిట్, ముల్ లో జీఆర్ కృష్ణ ఫెర్రో అల్లాయ్స్ రూ. 1482 కోట్ల స్పాంజ్ ఐరన్ ప్రాజెక్ట్, నాగపూర్ లో జయదీప్ స్టీల్ వర్క్ ఇండియా రూ. 1375 కోట్ల ఐఎస్పీ ప్రాజెక్ట్ వంటివి ఉన్నాయి.


Read More
Next Story