జైలులో ఆత్మహత్య చేసుకున్న థానే అత్యాచార నిందితుడు
x

జైలులో ఆత్మహత్య చేసుకున్న థానే అత్యాచార నిందితుడు

మైనర్ బాలికను అత్యాచారం చేసి, హత్య చేసిన విశాల్ గావ్లీ, అతడికి సహకరించిన భార్య


థానేలోని కళ్యాణ్ పట్టణంలో మైనర్ బాలికపై అత్యాచారం, హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొని ప్రస్తుతం జైలులో ఉన్న వ్యక్తి ఆత్యహత్య చేసుకున్నాడు. నవీ ముంబైలోని తలోజా సెంట్రల్ జైలులో ఆదివారం ఉదయం ఆత్మహత్య చేసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు.

నిందితుడు విశాల్ గావ్లీ (35) తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో జైలు టాయిలెట్ లో ఉరివేసుకుని కనిపించాడని ఒక అధికారి తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ముంబైలోని జేజే ఆస్పత్రికి తరలించామని ఖర్ఘర్ పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు.
థానేలోని బద్దాపూర్ లో ఒక పాఠశాలలో పారిశుద్ద్య కార్మికుడు ఇద్దరు మైనర్ బాలికలపై లైంగిక దాడికి పాల్పడిన కేసు నమోదైన కొన్నినెలల వ్యవధిలోనే ఈ అత్యాచారం, హత్య కేసు నమోదైంది. ఇది గత ఏడాది ఆగష్టులో భారీ నిరసనలకు దారితీసింది. ఈ కేసులో నిందితుడిని చివరికి పోలీసులు ఎన్ కౌంటర్ లో హతమార్చారు.
ఎందుకు జరిగింది...
జైలు అధికారులు ప్రకారం.. గావ్లీ ఆదివారం తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ‘‘అటాచ్డ్ బాత్రూమ్ లో ఉన్న బారక్ లో 30-35 మంది ఖైదీలు ఉన్నారు. మిగతా వారందరూ నిద్రపోతుండగా, గావ్లీ ఉదయం మేల్కొని వాష్ రూమ్ లోని వెళ్లి టవల్ ఉపయోగించి ఉరివేసుకున్నాడు’’ అని ఒక అధికారి తెలిపారు.
తెల్లవారుజామున మరో ఖైదీ టాయిలెట్ లోకి వెళ్లి మృతదేహాన్ని చూసి కేకలు వేయడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆ తరువాత జైలు అధికారులు బ్యారక్ కు చేరుకున్నారు. ఆ తరువాత ఆసుపత్రికి అధికారులకు ఖార్ఘర్ పోలీస్ స్టేషన్ అధికారులకు సమాచారం అందించారు. వైద్యులు వచ్చి పరిశీలించిన అప్పటికే మరణించారని వైద్యులు ప్రకటించారు.
ఒక జైలు అధికారి ప్రకారం.. నిందితుడు చేసిన హేయమైన పని వల్ల స్నేహితులు, కుటుంబ సభ్యులు అతనితో అన్ని సంబంధాలను తెంచుకున్నారని తరుచుగా ఇతర ఖైదీలతో చెబుతుండేవాడని తెలిసింది. ఎవరూ తనను కలవడానికి రాలేదని, తాను బతికి ఉండి ప్రయోజనం రాలేదని అంటుండనేవాడని, ప్రస్తుతం జైలులో ఏదైన సూసైడ్ నోట్ వదిలిపెట్టాడా లేదా అని తెలుసుకుంటున్నామని జైలు అధికారులు తెలిపారు.
బంధువుల అనుమానం..
గావ్లీ న్యాయవాదీ సంజయ్ ధకానే మాట్లాడుతూ.. అతను బంధువులు ఈ విషయంలో అనుమానం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు.
‘‘విశాల్ ఆత్మహత్య చేసుకోలేదని అతని కుటుంబం నమ్ముతోంది. బద్లాపూర్ పాఠశాల కేసులో నిందితుడు అక్షయ్ షిండే ఎన్ కౌంటర్ లో గత సంవత్సరం మరణించిన తరువాత ఆ పరిస్థితే గావ్లేకు పడుతుందని వారు భయపడుతున్నారు. విశాల్ ప్రాణాలకు ముప్పు ఉందని తెలిసి మేము గతంలో అతనికి భద్రత కల్పించాలని కోరాము. అతని మరణంపై వివరణాత్మక విచారణ అవసరం’’ అని ధకానే అన్నారు.
గావ్లీ పై తీవ్ర ఆరోపణలు..
2024 డిసెంబర్ లో కళ్యాణ్ లో 12 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు గావ్లీపై ఆరోపణలు ఉన్నాయి. డిసెంబర్ 24న కోల్సేవాడీ ప్రాంతం నుంచి ఆ చిన్నారి ఆ చిన్నారి అదృశ్యమైంది. తరువాత చిన్నారి మృతదేహం థానే గ్రామీణ ప్రాంతమైన పద్ఘాలోని బాప్గావ్ గ్రామంలో దొరికింది.
భార్య సహ నిందితురాలు..
కోల్సేవాడీ పోలీసులు జరిపిన ప్రాథమిక దర్యాప్తులో గావ్లీ, అతని భార్య సాక్షిలను భారతీయ న్యాయ సంహిత, పోస్కో చట్టం ప్రకారం కిడ్నాప్, అత్యాచారం, హత్య, సాక్ష్యాలను మాయం చేయడం వంటి నేరాల కింద అరెస్ట్ చేశారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో పోలీసులు భార్యాభర్తలపై 948 పేజీల చార్జిషీట్ దాఖలు చేశారు. పోలీసుల ప్రకారం.. విశాల్ గావ్లీ బాలికపై అత్యాచారం చేసి హత్య చేయగా, సాక్షి మృతదేహాన్ని బాప్ గావ్ లో పడేయడానికి సహకరించింది. ఈ కేసుకు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రఖ్యాత న్యాయవాదీ ఉజ్వల్ నికమ్ ను ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా నియమించారు.
సహజ న్యాయం జరిగింది: ఎమ్మెల్యేలు
గావ్లీ ఆత్మహత్య గురించి కళ్యాన్ తూర్పు బీజేపీ ఎమ్మెల్యే సులభ గైక్వాడ్ మాట్లాడుతూ.. బాధితురాలి కుటుంబానికి న్యాయం జరిగిందని అన్నారు.
‘‘ విశాల్ గావ్లీకి అత్యంత కఠినమైన శిక్ష విధించాలి. చట్ట అమలు సంస్థలు, న్యాయవ్యవస్థ దానిపై పనిచేస్తుండగా, దేవుడు తీర్పు ఇచ్చాడు. బాధితురాలికి న్యాయం జరిగింది.’’ అని ఆమె అన్నారు. కళ్యాణ్ వెస్ట్ నుంచి శివసేన(షిండే) ఎమ్మెల్యే విశ్వనాథ్ భోయిర్ మాట్లాడుతూ.. గావ్లిని చట్టం ప్రకారం శిక్షించాల్సింది కానీ ఇది కూడా సహజ న్యాయం అని అన్నారు.
(ఆత్యహత్యలు నివారించవచ్చును. సాయం కోసం దయచేసి ఆత్మహత్య నివారణ కోసం హెల్ప్ లైన్ లకు కాల్ చేయండి. నేహా ఆత్మహత్య నివారణ కేంద్రం- 044- 246640050, ఆసరా హెల్ప్ లైన్ - +982046726)
Read More
Next Story