
ఉద్దవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే
ఠాక్రే పార్టీలు స్థానిక ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాయి: సంజయ్ రౌత్
ఉద్దవ్ కు ఎన్నికల సమయంలోనే మరాఠాలు గుర్తుకు వస్తారన్నా బీజేపీ
ముంబై సహ ఇతర ప్రాంతాలలో జరిగే పౌర ఎన్నికల్లో తమ పార్టీ, రాజ్ ఠాక్రే నేతృత్వంలో మహారాష్ట్ర నవనిర్మాణ సేన కలిసి పోటీ చేస్తాయని శివసేన(యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ శుక్రవారం తెలిపారు.
‘‘ఠాక్రే సోదరులు ఉద్దవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే ముంబై, థానే, నాసిక్, కల్యాణ్, డోంబివలి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కలిసి పోటీ చేసి గెలుస్తారు. రాజ్, ఉద్దవ్ థాకరేల బలం మరాఠీ మాట్లాడేవారి ఐక్యతే. మరాఠీ మనుస్ ఉక్కు పిడికిలిని ఇప్పుడు ఏ శక్తి విచ్చిన్నం చేయలేదని రౌత్ విలేకరులతో అన్నారు.
కూటమి ఏర్పాటు కోసం ఎంఎన్ఎస్ తో చర్చలు జరుగుతున్నాయని రౌత్ చెప్పారు. అయితే బీజేపీ ఆయన ప్రకటనను తోసిపుచ్చింది. రాష్ట్ర బీజేపీ శాసనసభ్యుడు ప్రవీణ్ దారేకర్ మాట్లాడుతూ.. థాకరే బంధువులిద్దరూ ఏమైనా చర్చలు జరిపారా లేదా ఇదంతా రౌత్ ఊహగానాలే అని కొట్టిపారేశారు.
‘‘గతం 20 సంవత్సరాలుగా తన సొంత బంధువు అయిన మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన్ చీఫ్ రాజ్ ఠాక్రేను గుర్తు చేసుకోని ఉద్దవ్ ఠాక్రే ఇంత నిస్సహాయ స్థితిలోకి దిగజారిపోయాడో ఈ ప్రకటన చూస్తే అర్థం అవుతోంది’’ అని ఆయన ఎద్దేవా చేశారు.
ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలోనే శివసేనకు మరాఠీ వారు గుర్తుకు వస్తారని మంత్రి, బీజేపీ నాయకుడు గిరీష్ మహాజన్ అన్నారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మరాఠీ ఓటర్ల నుంచి బీజేపీకి భారీగా మద్దతు లభించిందని, వారిని తప్పుదారి పట్టించే ప్రయత్నం ఫలించలేదని ఆయన అన్నారు.
గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. 288 స్థానాలున్నా మహా అసెంబ్లీలో 234 స్థానాలు కూటమి గెలుచుకుని అధికారం చేపట్టింది. ప్రతిపక్షానికి కేవలం 66 స్థానాలు మాత్రమే దక్కాయి. దీనితో అక్కడ రాజకీయ పునరేకీకరణ బలంగా జరగుతోంది.
Next Story