నా విధి ఇక్కడే రాయబడింది: ప్రధాని నరేంద్ర మోదీ
x

నా విధి ఇక్కడే రాయబడింది: ప్రధాని నరేంద్ర మోదీ

"నా టర్నింగ్ పాయింట్లన్నీ గోవాలోనే జరిగాయి. నన్ను ప్రధానిని చేయాలనే పార్టీ (బిజెపి) నిర్ణయం కూడా గోవాలోనే జరిగింది" అని ప్రధాని అన్నారు.


గోవా తన రాజకీయ జీవితంలో ఎన్నో మలుపులకు సాక్షిగా నిలిచిందని, తన విధి ఇక్కడే రాయబడిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా గోవాలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు.

ఈ సభలో కాంగ్రెస్ పై విమర్శల వర్షం కురపించారు. ఇన్నాళ్లు ఈవీఎంలపై తప్పుడు వార్తలు ప్రచారం చేశారని, ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు తరువాత వారంతా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈవీఎంలు భారత దేశ ప్రజాస్వామ్యాన్నిబలోపేతం చేస్తున్నాయని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన తరువాత అయినా అబద్దాలు ప్రచారం చేసిన విపక్షాలన్నీ భారత ప్రజలకు క్షమాపణ చెప్పాలని అన్నారు.

దక్షిణ గోవా లోక్‌సభ నియోజకవర్గంలోని వాస్కోలో జరిగిన ఎన్నికల ర్యాలీలో మోదీ మాట్లాడుతూ, అభివృద్ధి, సంక్షేమానికి సంబంధించి తమ పార్టీ గోవాలో అనుసరించిన విధానం ఒక నమూనా అని చెప్పారు.
ఈవీఎంలపై కాంగ్రెస్ అబద్ధాలు ప్రచారం చేస్తోంది: ప్రధాని
పేపర్ బ్యాలెట్‌లను పునరుద్ధరించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌లను సుప్రీంకోర్టు ఇటీవల తిరస్కరించడం, ఈవీఎంల ట్యాంపరింగ్‌పై అనుమానాలు నిరాధారమైనవని తేల్చిచెప్పడాన్ని ప్రస్తావిస్తూ, కాంగ్రెస్ అసత్యాలను ప్రచారం చేస్తోందని మోదీ ఆరోపించారు.
‘‘ఎన్నికల్లో ఓడిపోయినప్పుడల్లా ఈవీఎంలపై నిందలు వేస్తారు. ఈవీఎంలపై అనుమానాలు సృష్టించేందుకు ప్రయత్నించారు' అని ఆయన అన్నారు. “ఈవీఎంలు బాగున్నాయని, ఈవీఎంల ద్వారా ఎన్నికలు పారదర్శకంగా జరుగుతున్నాయని సుప్రీంకోర్టు స్పష్టంగా పేర్కొంది, ఇది ప్రజాస్వామ్యాన్ని పటిష్టం చేసింది,” అని ప్రధాన మంత్రి అన్నారు.
ఈ సమస్యపై కాంగ్రెస్ “క్షమాపణ చెప్పాలా వద్దా” అశేష జనవాహిని ఉద్దేశించి అడిగారు. అయితే వాళ్లు క్షమాపణలు చెప్పరు. మోదీ పరువు తీయడమే వాళ్ల లక్ష్యం. దానికోసం ఎంతకైనా వాళ్లు తెగిస్తారు. అహంకారంతో వాళ్లు ఏడో స్వర్గంలో ఉన్నారని విమర్శించారు.
'ఆకాంక్షలు, స్వార్థ ప్రయోజనాల మధ్య ఎన్నికలు'
రెండు దశల ఎన్నికలు పూర్తయిన నేపథ్యంలో మరోసారి ఎన్డీయే అధికారంలోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. దేశ పౌరుల ఆకాంక్షలను నెరవేర్చడానికి కృషి చేస్తున్న బీజేపీకి, స్వార్థ ప్రయోజనాల కుటుంబాల కోసం పని చేసే ఇండి కూటమికి మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని అన్నారు.
సంతృప్త నమూనా
"సంతృప్త విధానం అంటే 'సబ్ కా సాథ్, సబ్ కా వికాస్', సంతృప్త విధానం అంటే ఎటువంటి వివక్ష లేకుండా ప్రభుత్వ పథకాల ప్రయోజనం అందరికీ అందించాలి, సంతృప్త విధానానికి గోవా సరైన నమూనా అని ఆయన అన్నారు. గత 10 ఏళ్లలో తమ ప్రభుత్వం గొప్ప ప్రగతిని సాధించినప్పటికీ, సాధించిన విజయాలు తనకు సంతృప్తిని కలిగించలేదని అన్నారు.
ఇవన్నీ రాబోయే కాలానికి ట్రైలర్ మాత్రమే అని అన్నారు. గత పదేళ్లలో తమ ప్రభుత్వ హయాంలో ఎన్నో జరిగాయని పేర్కొన్న మోదీ, ఏదీ తనకు విశ్రాంతినివ్వడం లేదన్నారు. “మోదీ విశ్రాంతి తీసుకుని ఆనందించడానికి పుట్టలేదు. మోదీ పగలు రాత్రి పని చేస్తున్నారు. మోదీ మీ కలలను నెరవేరుస్తాడు.
మీ కలలు మోదీ ‘సంకల్ప్’ ’’ అని ఆయన అన్నారు. 'మోదీ కి గ్యారంటీ'ని మీరు గమనించండి, వచ్చే ఏడాదిలో పేదలకు మూడు కోట్ల కొత్త పక్కా ఇళ్లు నిర్మిస్తామని, ఇంకా సొంత ఇల్లు లేని వారిని బీజేపీ కార్యకర్తలు గుర్తించి వారికి భరోసా ఇవ్వాలని ఆయన అన్నారు. జూన్ 4 (ఎన్నికల ఫలితాలు వెలువడే రోజు) తర్వాత వారికి ఇల్లు లభిస్తుంది.
మోదీ వాగ్దానాలు
పట్టణాల్లో అద్దె ఇళ్లలో నివసిస్తున్న మధ్యతరగతి కుటుంబాలకు కూడా సొంత ఇల్లు నిర్మించుకునేందుకు సాయం అందజేస్తామని చెప్పారు. 70 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఉచిత వైద్యం అందించనున్నట్లు తెలిపారు. మత్స్యకారుల గురించి కాంగ్రెస్ ఏనాడూ ఆలోచించలేదని, మత్స్యశాఖకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి నిధులు కేటాయించింది తమ ప్రభుత్వమేనని మోదీ అన్నారు.
"మేము మత్స్యకారులకు కిసాన్ క్రెడిట్ కార్డులు ఇచ్చాము.. మత్స్యకారులకు బీమా కవరేజీని పెంచుతాము," అని ఆయన వాగ్ధానం చేశారు. వారి ఆదాయానికి అనుబంధంగా సేంద్రీయ సీవీడ్ సాగును ప్రోత్సహిస్తామని చెప్పారు. కరోనా కాలంలో ప్రభుత్వం టీకాలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చిందని అన్నారు. సాధారణంగా పెద్ద రాష్ట్రానికి ఇలాంటి ప్రాధాన్యం ఇస్తుందని, కానీ రెండు సీట్లున్న గోవా కు తమ ప్రభుత్వం సమప్రాధాన్యం ఇచ్చిందని అన్నారు.
ప్రభుత్వం యొక్క కొత్త మిషన్ "వెడ్ ఇన్ ఇండియా" ముఖ్యంగా గోవా దాని సుందరమైన ప్రకృతి దృశ్యం కారణంగా ప్రయోజనం పొందుతుందని ఆయన అన్నారు.
రాజ్యాంగాన్ని అవమానించిన కాంగ్రెస్‌
‘‘కాంగ్రెస్ రాజ్యాంగాన్ని అవమానిస్తోంది. దాని గోవా అభ్యర్థి దీనిని బహిర్గతం చేసారు, ఇది కాంగ్రెస్ వాస్తవికత. భారత రాజ్యాంగం గురించి తమకు ఇబ్బంది లేదని దాని రహస్య ఎజెండాను బట్టబయలు చేసింది. పోర్చుగీస్ పాలన నుంచి విముక్తి పొందిన తర్వాత గోవాపై రాజ్యాంగాన్ని రుద్దారని కాంగ్రెస్‌కు చెందిన దక్షిణ గోవా అభ్యర్థి విరియాటో ఫెర్నాండెజ్ చేసిన ప్రకటనను ప్రస్తావిస్తూ ఇది దేశానికి వ్యతిరేకంగా చేస్తున్న కుట్ర’’ అని మోదీ అన్నారు.
జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 ఈ మనస్తత్వం కారణంగానే ఎక్కువ కాలం కొనసాగిందని ఆయన విమర్శించారు. ఆర్టికల్ 370ని తిరిగి తీసుకురావడం గురించి ఇండి కూటమి మాట్లాడుతోంది. ఆర్టికల్ 370ని తిరిగి తీసుకురావడానికి అనుమతిస్తామా? కాంగ్రెస్ తన ఓటు బ్యాంకును ప్రసన్నం చేసుకునేందుకు ప్రమాదకరమైన ఆటలకు పాల్పడుతోంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లలో కొంత భాగాన్ని తమ ఓటు బ్యాంకుకు ఇవ్వాలని కాంగ్రెస్ కోరుతోంది. వాళ్లు కర్ణాటకలో పని మొదలుపెట్టారు’’ అని మోదీ నిప్పులు చెరిగారు. ప్రజల సంపదపై 55 శాతం పన్ను విధించాలని ప్రతిపక్షాలు భావిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, గోవా బీజేపీ చీఫ్ సదానంద్ షెట్ తనవాడే, ఆ పార్టీ అభ్యర్థులు శ్రీపాద్ నాయక్ (ఉత్తర గోవా), పల్లవి డెంపో (సౌత్ గోవా) బహిరంగ సభకు హాజరయ్యారు.
Read More
Next Story