ముంబైని ‘ ఆదాని’ సిటీగా మారనివ్వం: ఉద్దవ్ ఠాక్రే
ఆసియాలోని అతిపెద్ద మురికివాడల ప్రాంతంగా పేరున్న ధారవిని అభివృద్ది పేరుతో ఆదాని కంపెనీకి కట్టాబెట్టారని మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే ఎన్డీఏ ప్రభుత్వం పై..
మహారాష్ట్రలో తమ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ దక్కించుకున్న ధారావి స్లమ్ రీడెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ టెండర్‌ను రద్దు చేస్తామని శివసేన (యుబిటి) చీఫ్ ఉద్ధవ్ థాకరే తెలిపారు. శనివారం విలేకరుల సమావేశంలో థాకరే మాట్లాడుతూ, ధారవి నివాసితులు, వ్యాపారులకు నష్టం కాకుండా తమ పార్టీ అండగా ఉంటుందని, అక్కడ నివసించే ప్రజలకు తప్పనిసరిగా 500 చదరపు అడుగుల ఇళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
“మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ధారవి స్లమ్ రీడెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ టెండర్‌ను రద్దు చేస్తాము. ఇప్పుడే ఎందుకు రద్దు చేయకూడదో ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. ముంబైని 'అదానీ సిటీ'గా మార్చడానికి మేము అనుమతించము, ” అని మాజీ ముఖ్యమంత్రి అన్నారు.
"అదానీకి అదనపు రాయితీలు"
ప్రపంచంలోని అత్యంత రద్దీగల పట్టణాలలో ముంబై ఒకటి. ఇక్కడ ఉన్న ధారవి ప్రాంతం ఆసియాలోనే అతిపెద్ద మురికివాడల ఏరియాగా పేరు పొందింది. దీనిని అభివృద్ధి చేసేందుకు వేసిన టెండర్ ను అదానీ గ్రూపు దక్కించుకుంది. అయితే దీనికోసం అదనపు రాయితీలను ప్రభుత్వం అదానీ గ్రూపుకు ప్రభుత్వం ఇస్తోందని థాకరే ఆరోపించారు.“మేము అదనపు రాయితీలు ఇవ్వము. ధారవి వాసులకు ఏది మేలు చేస్తుందో అదే మేము చేస్తాము. అవసరమైతే, మేము పాత టెండర్ ను రద్దుచేసి కొత్త టెండర్ ను జారీ చేస్తాం” అని ఆయన నొక్కి చెప్పారు.
మహిళలకు నెలకు రూ. 1,500 ఇచ్చే లక్ష్యంతో ముఖ్యమంత్రి లడ్కీ బహిన్ యోజన తరహాలో 'లడ్కా మిత్ర' (ప్రియమైన స్నేహితుడు) పథకాన్ని ప్రారంభిస్తారా అని థాకరే ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
ఎన్నికల్లో ఇదే హాట్ టాపిక్
శివసేన (UBT), కాంగ్రెస్ లు రెండు కూడా 2024 లోక్‌సభ ఎన్నికలలో ధారావి పునరాభివృద్ధి ప్రాజెక్ట్‌ను ప్రధాన పోల్ ఇష్యూగా మార్చాయి. ధారవి అసెంబ్లీ సెగ్మెంట్‌తో కూడిన ముంబై సౌత్ సెంట్రల్ స్థానం నుంచి శివసేన (యుబిటి) అభ్యర్థి అనిల్ దేశాయ్ 53,384 ఓట్ల తేడాతో శివసేన సిట్టింగ్ ఎంపీ రాహుల్ షెవాలేపై విజయం సాధించారు.
ప్రతి ఇంటికి ఒక నంబర్ ఇస్తున్నారని, ప్రభుత్వం ధారవి నివాసితులను అర్హత, అనర్హుల ఉచ్చులో పడేయాలని కోరుకుంటోందని తరువాత మిగిలిన వారిని తరిమికొట్టాలని అనుకుంటోందని ఆరోపించారు. ధారవి వాసులకు పునరావాసం కల్పించేందుకు ప్రభుత్వం మురికివాడల పునరావాస పథకం కింద భూమిని సేకరించేందుకు ప్రయత్నిస్తోందని థాకరే పేర్కొన్నారు.
అసమతుల్యతను సృష్టిస్తుంది
నగరంలో మౌలిక సదుపాయాల పనులు లేదా అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికల కోసం ఉద్దేశించిన 20 ప్లాట్లను ప్రభుత్వం సేకరించే ప్రక్రియను ప్రారంభించిందని మాజీ ముఖ్యమంత్రి విమర్శించారు. ఇది నగరంలో అసమతుల్యతకు దారి తీస్తుంది. ఇందుకోసం ఇక్కడ ఉన్న ప్రజలను అనేక ప్రదేశాలకు తరలించాలి.
అయితే ప్రజలకు తరలించడానికి అనేక ప్రదేశాలు ఇప్పటికే మౌలిక సదుపాయాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయని మాజీ ముఖ్యమంత్రి అన్నారు. ముంబై లోని భారీ మురికి వాడలను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం నడుంబిగించింది. ఇక్కడ నుంచి ఏటా 20 వేల కోట్ల రూపాయల ఆదాయం లభిస్తోంది. పోటీ బిడ్డింగ్ తర్వాత నవంబర్ 2022లో అదానీ ప్రాపర్టీస్‌కు టెండర్‌ను కేటాయించారు. ఇందులో రియల్టీ మేజర్ DLF మరియు నమన్ డెవలపర్లు కూడా పాల్గొన్నారు.
Next Story