బంగ్లాదేశీయుల కోసం మూల్యం చెల్లించుకుంటున్న భారత ముస్లింలు?
x

బంగ్లాదేశీయుల కోసం మూల్యం చెల్లించుకుంటున్న భారత ముస్లింలు?

గుజరాత్ లో 12 వందల ఇళ్లను కూల్చివేసిన ప్రభుత్వం, నిర్వాసితులైన వందలాది మంది


(మూలం.. దమయంతి ధర్)

జాతీయ భద్రత పేరుతో గుజరాత్ ప్రభుత్వం అహ్మదాబాద్ లో దాదాపు 1200 మంది ముస్లింల ఇళ్లను కూల్చివేశారు. రెండు రోజుల తరువాత ఏప్రిల్ 30న కొంతమంది సామాజిక కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా కోర్టులలో 11 పిటిషన్లను దాఖలు చేశారు. మీడియాను ఈ కూల్చివేతల సందర్భంగా దూరంగా ఉంచారు. అయితే హైకోర్టు వీటిని నిషేధించింది.
‘‘ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడుల నేపథ్యంలో సున్నితమైన సమాచారం ఆధారంగా జాతీయ భద్రతకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తూ ఈ కూల్చివేతలు జరిగాయి. ఇవి సాధారణ కూల్చివేత కార్యక్రమం కాదు’’ అని రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఈ కార్యక్రమాన్ని ‘ఆపరేషన్ సఫాయ్’ అని పిలిచేవారు.
భారీ డ్రైవ్..
కాశ్మీర్ లో జరిగిన భారీ ఉగ్రవాద దాడి తరువాత అహ్మాదాబాద్, సూరత్, వడోదరలలో అక్రమ బంగ్లాదేశ్ వలసదారులపై భారీ పోలీస్ సెర్చ్ ఆపరేషన్ జరిగింది.
గుజరాత్ పోలీసులు, అమ్దాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తో కలిసి రాజధానిలోని చందోలా సరస్సు ప్రాంతంలో ఈ ఆపరేషన్ నిర్వహించారు. అక్కడ మొదటి రోజు అహ్మాదాబాద్ నగర పోలీసులు దాదాపు 890 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 214 మంది మైనర్లు ఉన్నారు.
‘‘తెల్లవారుజామున 3 గంటలకు పౌర అధికారులతో కలిసి 2 వేల మంది పోలీసులు అహ్మాదాబాద్ లో ‘ఆపరేషన్ సఫాయిని’ విజయవంతంగా నిర్వహించారు. అక్రమ వలసదారులను ముఖ్యంగా అనుమానిత బంగ్లాదేశ్ జాతీయులను లక్ష్యంగా చేసుకుని రాష్ట్రవ్యాప్త ఆపరేషన్ లో ఈ డ్రైవ్ భాగం’’ అని గుజరాత్ డీజీపీ వికాస్ సహాయ్ అన్నారు.
తాత్కాలిక పద్దతి..
ఈ దాడులన్నీ తాత్కాలిక పద్దతిలోనే జరుగుతున్నాయని సామాజిక కార్యకర్తలు ఆరోపించారు. గుర్తింపులను జాగ్రత్తగా తనిఖీ చేయలేదు. ప్రజలను అదుపులోకి తీసుకున్నారు. బలహీన కారణాలతో వారి ఇళ్లు కూల్చివేశారు. అటువంటి హింసకు గురైన చాలామంది ముస్లింలు తరువాత భారతీయులే అని అక్రమ వలసదారులు కాదని తేలింది.
‘‘ఈ ప్రాంత నివాసితులలో బంగ్లాదేశ్ జాతీయులు ఉండవచ్చు. ఎవరూ దానిని ఖండించడం లేదు. కానీ ఈ వలసదారులను చట్ట ప్రక్రియ ప్రకారం.. విదేశీయులు ట్రిబ్యూనల్ ఆదేశాలతో గౌరవంగా తిరిగి పంపించే బదులు వారిని నగరం గుండా ఊరేగిస్తున్నారు. ఇది చట్టవిరుద్దం’’ అని స్థానిక నివాసి పులిజాహా నూర్మహమ్మద్ షేక్ తరఫున వాదించిన ఆనంద్ యాగ్నిక్ ‘ది ఫెడరల్’ తో అన్నారు.
ఇళ్లు కోల్పోతున్నారు...
‘‘కొన్ని రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం అహ్మాదాబాద్ నుంచి 1200 నుంచి 1500 మందిని బంగ్లాదేశీయులుగా గుర్తించి తీసుకెళ్లింది. ఆ తరువాత వారిలో 90 శాతం మంది భారతీయులని తేలడంతో వారిని విడుదల చేసింది.’’ అని యాగ్నిక్ ఫెడరల్ తో అన్నారు.
‘‘కూల్చివేతల కార్యక్రమంలో భాగంగా బంగ్లాదేశ్ జాతీయులు కానీ వారి ఇళ్లను కూడా అధికారులు కూల్చివేస్తున్నారు. దర్యాప్తులో ఎవరైనా అక్రమ బంగ్లాదేశ్ వలసదారులు ఉన్నారని నిర్ధారిస్తే అప్పుడు చట్ట ప్రకారం చర్య తీసుకోవచ్చు’’ అని ఆయన అన్నారు.
గుజరాత్ పోలీసులు భారతీయ పౌరుడిగా గుర్తించి, రెండు రోజుల నిర్భంధం తరువాత ఏప్రిల్ 30న విడుదలైన 300 మందిలో ముప్పై రెండేళ్ల మాజిద్ ఒకరు. తన కుటుంబం ఎక్కడ ఉందో తెలియక అతను కూల్చివేసిన ఇంటికే తిరిగి వచ్చాడు.
పరిహారం ఎవరూ ఇస్తారు?
‘‘ ఎటువంటి నోటీస్ లేకుండా కూల్చివేసిన మా ఇంటికి ఎవరూ పరిహారం ఇస్తారు’’? అని మాజిద్ అడిగాడు. ‘‘మేము నిద్రపోతున్నప్పుడూ పోలీసులు వచ్చి పురుషులు అంతా స్వచ్ఛందంగా బయటకు రావాలని కోరారు. లేకపోతే అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు.
నేను బయటకు వచ్చినప్పుడూ ఒక పోలీస్ సిబ్బంది నన్ను ఇతర పురుషుల వెనక వరుసలో నిలబడతామని అడిగారు’’ అని అతను గుర్తు చేసుకున్నాడు.
‘‘అక్కడ ఉన్న 1200 ఇళ్లను వెతికారు. మేము గంటల తరబడి నిలబడి ఉన్నాము. తరువాత పోలీసులు రెండు వైపులా తాళ్లు పట్టుకుని క్యూలో నడవమని బలవంతం చేశారు.
మొదట మేము షాహిబాగ్ కు తరువాత గైక్వాడ్ హావేలికి వెళ్లాము. మళ్లీ షాహిబాగ్ కు నడిచి వెళ్లమని బలవంతం చేశారు’’ అని చెప్పారు.
అన్ని కోల్పోయాము..
‘‘మరుసటి రోజు వాళ్లు మమ్మల్ని రెయిన్ బాసెరా( వీధి బిచ్చగాళ్ల కోసం ఉద్దేశించిన రాత్రి ఇల్లు) లో బస చేశాము’’ అని మాజిద్ చెప్పారు. ‘‘నేను చేయని తప్పుకు పోలీసులు నన్ను అరెస్ట్ చేసి ప్రజలు నవ్వుతుంటే నేరస్తుడిలా ఊరేగించడం అవమానకరంగా ఉంది. నన్ను ఫొటోలు తీశారు’’ అని పేర్కొన్నారు.
నేను మధ్యప్రదేశ్ నుంచి వచ్చానని, 30 సంవత్సరాల క్రితం ఉద్యోగాల కోసం గుజరాత్ కు వచ్చామని నేను చెబుతూనే ఉన్నాను. కానీ ఎవరూ నా మాట వినలేదు.
ఇప్పుడు వారు నన్ను విడుదల చేశారు. కానీ నా ఇల్లు కూల్చివేయబడింది. విద్యుత్, నీటి కనెక్షన్ తొలగించారు. నా కుటుంబం, నేను చేసిన తప్పు ఏంటీ? అని ఆయన ప్రశ్నించారు.
విడిపోయిన ముస్లిం కుటుంబాలు..
బాధిత ముస్లిం నివాసితులు తమ ఇళ్లను, గౌరవాన్ని కోల్పోవడమే కాదు.. కుటుంబాలు కూడా ఛిన్నాభిన్నమైమయ్యాయి. మొదట్లో మహిళలను ఇంటి లోపలే ఉండమని కోరారు. కానీ ఏప్రిల్ 29న అహ్మాదాబాద్ మహిళా పోలీసులు మహిళలు, శిశువులను అదుపులోకి తీసుకున్నారు.
ముఖ్యంగా శీతాకాలంలో వీధి నివాసులు, యాచకులకు ఆశ్రయం కల్పించడానికి గుజరాత్ ప్రభుత్వం నిర్మించిన రెయిన్ బాసెరా నైట్ షెల్టర్లలో ఈ పురుషులను ఉంచారు.
తూర్పు అహ్మాదాబాద్ లోని వంద సంవత్సరాల పురాతన చారిత్రాత్మక భవనం గైక్వాడ్ హవేలిలో ఈ మహిళలను ఉంచారు. ఇక్కడ క్రైమ్ బ్రాంచ్ ప్రధాన కార్యాలయం కూడా ఉంది. టీనేజర్లను ప్రభుత్వ అనాథశ్రమాలు, రెస్క్యూ హోమ్ లకు పంపారు. అయితే పసిబిడ్డలను వారి తల్లులతో ఉండటానికి అనుమతించారు.
భయపడ్డాను.. అవమానించాను..
‘‘నిర్భంధంలో ఉన్న వ్యక్తుల సంఖ్య లేదా విడుదల చేయబడిన వారి సంఖ్య మాకు తెలియదు. విడుదలైన వారిలో చాలామంది తమ కుటుంబాలను ఎక్కడ ఉంచారో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మేమంతా తీవ్రంగా అవమానించబడ్డాము.
గత రెండు రోజులు పీడకలలు చూశాము. 2002 తరువాత మేము చూసిన అత్యంత చెత్త రోజులలో ఈ రెండు రోజులు ఒకటి’’ అని చందోలా సరస్సు ప్రాంతంలో నివసించే 59 ఏళ్ల దిలావర్, బిహార్ లోని మోతీవారికి చెందిన కుటుంబం అని ఫెడరల్ తో అన్నారు.
దిలావర్ చిన్నతనంలో తన తల్లిదండ్రులతో గుజరాత్ కు వచ్చాడు. 1970 లలో మెరుగైన జీవితం కోసం వారు గుజరాత్ కు మారారు. చందోలా సరస్సు మురికివాడలోని చాలామందిలాగే ఈ కుటుంబం కూడా గుజరాత్ ను తమ ఆవాసంగా మార్చుకున్నారు.
‘‘గత కొన్ని సంవత్సరాలుగా మేము చాలాసార్లు పోలీసుల తనిఖీని ఎదుర్కోవాల్సి వచ్చింది. మహ్మమ్మారి సమయంలో పోలీసులు మా అందరిని చుట్టుముట్టి కరోనా వైరస్ వ్యాప్తికి మమ్మల్ని నిందించారు. కానీ ఇప్పుడూ మాకు జరుగుతున్నంత చెడ్డది ఏదీ లేదు’’ అని 2002 అల్లర్ల నుంచి బయటపడిన దిలావర్ అన్నారు.
50 ఏళ్ల నుంచి ఇక్కడే ఉంటున్నాను..
‘‘ 50 ఏళ్ల నుంచి ఇక్కడే నివసిస్తున్న భారతీయ ముస్లింల ఇళ్లను 50 కి పైగా జేసీబీలు, డంపర్లతో కూల్చివేశారు. ’’ అని ముజాహీద్ నఫీస్ ఆ రాత్రి జరిగిన వాటిని గుర్తు చేసుకున్నారు.
‘‘చందోలా సరస్సు మురికివాడ 1970 లలో ఏర్పడింది. ఆసమయంలో అహ్మాదాబాద్ వస్త్ర పరిశ్రమ వేగంగా అభివృద్ది చెందింది. ఈ కుటుంబాలలో కొన్ని 1970 లలో వస్త్ర మిల్లు కార్మికులుగా పనిచేయడానికి ఇక్కడికి వలస వచ్చాయి. అప్పటి నుంచి ఇక్కడ నివసిస్తున్నాము.
ఈ కుటుంబాలలో ఎక్కువ భాగం మధ్యప్రదేశ్, బీహార్, ఉత్తర ప్రదేశ్ నుంచి వలస వచ్చాయి.’’ అని గుజరాత్ లో ఉన్న మైనారిటీ హక్కుల సంస్థ మైనారిటీ కో ఆర్ఢినేషన్ కమిటీ కన్వీనర్ నఫీస్ అన్నారు.
‘‘చందోలా సరస్సులో లేదా సూరత్, రాజ్ కోట్, కచ్, వడోదరలో కూల్చివేయబడిన ప్రాంతాలలో బెంగాల్ నుంచి వచ్చిన ప్రజలు మాత్రమే కాదు. బీహార్, రాజస్థాన్, యూపీ, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన భారతీయ పౌరులు, వలస కార్మికులు ఉన్నారు.
వీరిలో చాలామందికి వారి ఇళ్లు కూల్చివేయబడే ముందు వారి పత్రాలను తమతో తీసుకెళ్లడానికి సమయం దొరకలేదు. మేము వారి స్వగ్రామాలకు ఫోన్లు చేస్తున్నాము. పత్రాలను తీసుకోవడానికి బంధువులను పిలుస్తున్నారు. బీహార్, ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన 32 మంది నివాసితులను విడుదల చేసాము’’ అని న్యాయవాదీ షంషాద్ పఠాన్ ది ఫెడరల్ తో అన్నారు.
సుప్రీంకోర్టు మార్గదర్శకాల పోలీసులు నిందితుల ఊరేగింపు నిషేధం, అయినప్పటికీ గుజరాత్ పోలీసులు వారిని చుట్టుముట్టి డ్రోన్ కెమెరాలతో వారిని చిత్రీకరిస్తూ దాదాపు 6 కిలోమీటర్లు నగరం చుట్టు తిరిగేలా చేశారు’’ అని పఠాన్ అన్నారు.
Read More
Next Story