ఆ కూటమి ఔరంగజేబు ఫ్యాన్ క్లబ్: హోంమంత్రి అమిత్ షా
ప్రతిపక్ష ఇండి కూటమి ఔరంగజేబు ఫ్యాన్ క్లబ్ అని హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. నకిలీ శివసేన అధినేత, బాల్ ఠాక్రే వారసత్వాన్ని పొందలేరని ఘాటుగా విమర్శలు..
ప్రతిపక్షాల INDI కూటమి "ఔరంగజేబ్ ఫ్యాన్ క్లబ్"గా మారిందని, ఈ కూటమి దేశాన్ని నడపలేదని హోంమంత్రి అమిత్ షా అన్నారు. మోదీని ప్రధాని చేయడం అంటే ‘దేశాన్ని సుసంపన్న చేయడమే’ అని పేర్కొన్నారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా యూనిఫాం సివిల్ కోడ్ అమల్లోకి వస్తుందని, ఓట్ల కోసం ఉద్ధవ్ ఠాక్రే కాంగ్రెస్ ఓటు బ్యాంకును కౌగిలించుకున్నారని ఆరోపించారు. రత్నగిరి - సింధు దుర్గ్ నియోజకవర్గంలో కేంద్ర మంత్రి రాణే కోస్తా తరఫున ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఉద్దవ్ ఠాక్రే లక్ష్యంగా విమర్శలు గుప్పించారు.
నకిలీ శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే తన తండ్రి బాల్ ఠాక్రే వారసత్వాన్ని కొనసాగించలేరని, శివసేన ముమ్మాటికి ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే, నారాయణ్ రాణే, రాజ్ థాకరేలకు చెందినదని హోంమంత్రి అమిత్ షా అన్నారు. దేశంలో ఎండలు పెరిగినప్పుడు థాయిలాండ్ విహార యాత్రలకు వెళ్లేవారు దేశాన్ని నడపలేరని, రాహూల్ గాంధీని ఉద్దేశించి షా విమర్శించారు.
"నక్లి" (నకిలీ) శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే తన ప్రసంగాలలో స్వాతంత్ర్య సమరయోధుడు హిందుత్వ సిద్ధాంతకర్త సావర్కర్ గురించి ప్రస్తావించగలరా అని షా ప్రశ్నించారు. "సావర్కర్ పేరు చెప్పుకోవడానికి సిగ్గుపడితే శివసేన చీఫ్‌గా మీరు ఎందుకు చెప్పుకుంటున్నారు. ఎందుకంటే మీరు నడిపేది నకిలీ శివసేన, అసలు శివసేన ఏక్‌నాథ్ షిండేతో ఉంది" అని బిజెపి మాజీ చీఫ్ వ్యాఖ్యానించారు.
2022 జూన్‌లో ఠాక్రే నాయకత్వంపై తిరుగుబాటు చేసిన షిండే, బీజేపీతో చేతులు కలిపి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ షిండే వర్గాన్ని నిజమైన శివసేనగా గుర్తించారు. "మీరు (ఉద్ధవ్) బాలాసాహెబ్ (శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాకరే) వారసత్వాన్ని ఈ విధంగా పొందలేరు. మీరు అతని కుమారుడే కావచ్చు, కానీ అతని వారసత్వం నారాయణ్ రాణే, ఏకనాథ్ షిండే, రాజ్ థాకరేలకు ఉంది. మీరు అతని వారసత్వాన్ని విడిచిపెట్టారు" అని షా విమర్శించారు.
ఉద్ధవ్‌తో విభేదించి 2005లో రాణే శివసేనను విడిచిపెట్టాడు. తరువాత కొంతకాలం కాంగ్రెస్ లో ఉన్న రాణే.. తరువాత బీజేపీలో చేరారు. రాజ్ ఠాక్రే 2006లో శివసేన నుంచి నిష్క్రమించి మహారాష్ట్ర నవనిర్మాణ సేన అనే సొంత పార్టీని ప్రారంభించారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో రాజ్ బీజేపీకి మద్దతు పలికారు.
2019లో ముఖ్యమంత్రి పదవి కోసం ఉద్ధవ్ ఠాక్రే ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకించిన ఎన్సీపీ, కాంగ్రెస్ కాళ్లపై పడ్డారని కూడా షా ఆరోపించారు. అధికారం కోసం రాహుల్ గాంధీ, శరద్ పవార్‌ల ముందు లొంగిపోయే వారు మహారాష్ట్ర గర్వాన్ని కాపాడలేరు' అని బీజేపీ ఆయన అన్నారు
కాంగ్రెస్- శరద్ పవార్ రామ మందిర సమస్యను విడిచిపెట్టారని, మరోవైపు ప్రధాని మోదీ సుప్రీంకోర్టులో "కేసు గెలిచి" ఐదేళ్లలోపు 'భూమి పూజ', రామ మందిరానికి ప్రతిష్ట చేశారని కేంద్ర మంత్రి అన్నారు.
ట్రిపుల్ తలాక్, ముస్లిం పర్సనల్ లా, ఆర్టికల్ 370కి తాను మద్దతిస్తానో లేదో ఉద్ధవ్ చెప్పాలి, నరేంద్ర మోదీ మూడవసారి గెలిచిన తర్వాత దేశవ్యాప్తంగా యూనిఫాం సివిల్ కోడ్ అమలులోకి వస్తుందని చెప్పారు. సాయంత్రం పశ్చిమ మహారాష్ట్రలోని సాంగ్లీలో బీజేపీ అభ్యర్థి సంజయ్ కాకా పాటిల్ కోసం జరిగిన ర్యాలీలో షా మళ్లీ ఉద్ధవ్ ఠాక్రేను టార్గెట్ చేశారు.
పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్‌ఐ)ని నిషేధించాలా, పౌరసత్వ (సవరణ) చట్టాన్ని అమలు చేయాలా, అయోధ్యలో రామమందిర నిర్మాణం, ట్రిపుల్ తలాక్‌పై నిషేధం మంచి పరిణామాలా కాదా అని నకిలీ సేన చీఫ్ చెప్పాలని హోంమంత్రి అన్నారు. "కానీ గతంలో కాంగ్రెస్- ఎన్‌సిపికి మద్దతు ఇచ్చిన తన కొత్త ఓటు బ్యాంకు కారణంగా అతను దీనిపై మాట్లాడడు. ఈ ఓటు బ్యాంకు పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా మాట్లాడదు లేదా కాశ్మీర్‌లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయదు" అని కేంద్ర మంత్రి అన్నారు. ఇటాలియన్ మూలాలు కదిలేలా ఈవీఎం బటన్ నొక్కాలని ప్రజలను కోరారు.
2024 ఎన్నికలు "జిహాద్‌కు ఓటు వేయమని చెప్పేవారికి - వికాస్‌కు ఓటు వేయడానికి" మధ్య జరిగుతున్న పోరు అని షా వ్యాఖ్యానించారు. ఇది రాహుల్ గాంధీ "చైనీస్ హామీ" (నమ్మదగని వాగ్దానాలు) "మోదీ భారత హామీల మధ్య పోరాటం" అని అన్నారు. ఇండి కూటమి నుంచి ప్రధాని అభ్యర్థి ఎవరూ? శరద్ పవార్? మమతా బెనర్జీ, ఉద్దవ్ ఠాక్రే, ఎంకే స్టాలిన్ అవుతారా అంటూ ప్రశ్నించారు. ఒక జోకర్ నాయకుడు అందరికి ప్రధానమంత్రి పదవి వస్తుందని చెప్పాడు. అంటే ఎలా ఇస్తారని వ్యంగ్యంగా అన్నారు. అవినీతి ఆరోపణలు లేని మోదీతో, ఈ అవినీతి సామ్రాట్టులు పోటీపడలేరని చురకలు అంటించారు.
పవార్, ఉద్ధవ్ ఠాక్రే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ రామ మందిర శంకుస్థాపనకు హాజరు కాలేదని, అలాంటి నాయకులకు మద్దతిస్తారా అని ప్రజలను ప్రశ్నించారు. 2014కు ముందు భారత్‌లో పాక్‌కు చెందిన ఉగ్రవాదులు స్వేచ్ఛగా తిరుగేవారని, అయితే ఉరీ, పుల్వామాలో ఉగ్రదాడులు జరిగినప్పుడు ఇక్కడ మన్మోహన్ సింగ్ ఉన్నాడని పాక్ అనుకుందని, మోదీ తనదైన వ్యూహంతో ఉగ్రవాద క్యాంపులను వాళ్ల దేశంలో ఏరి వేశారని హోంమంత్రి అన్నారు.
మహారాష్ట్రలో చక్కెర మిల్లుల సంఖ్య 202 నుంచి 100కి ఎందుకు పడిపోయిందని, కేవలం మూడు జిల్లా సహకార బ్యాంకులు మాత్రమే సొంతంగా పనిచేస్తున్నాయని, మిగిలిన వాటికి నిర్వాహకులను నియమించారని ఇలా ఎందుకు జరిగిందో శరద్ పవార్ చెప్పాలని షా ప్రశ్నించారు.
Next Story