వడోదర వీధుల్లో వీర విహారం చేస్తున్న మొసళ్లు
x

వడోదర వీధుల్లో వీర విహారం చేస్తున్న మొసళ్లు

భారీ వర్షాలతో పశ్చిమ భారతం వణుకుతోంది. ముఖ్యంగా గుజరాత్ లోని వడోదర నగరం లో వరదలు ముంచెత్తుతున్నాయి. దీనితో నగరం పక్కనే ఉన్న విశ్వామిత్ర నదీలో నుంచి మొసళ్లు..


గుజరాత్‌లోని వడోదరలో ఆగస్టు 27 నుంచి 29 మధ్య కురిసిన అతి భారీ వర్షాల తో వరదలు పొంగిపొర్లి నివాస ప్రాంతాలను ముంచెత్తాయి. ఈ వరదల్లో 24 మొసళ్లు బయటకు రావడంతో వాటిని అటవీశాఖ అధికారులు వాటిని సురక్షితంగా బంధించినట్లు తెలిపారు. నగరం పక్కన ప్రవహిస్తున్న విశ్వామిత్ర నదీ నీటి మట్టం పెరగడంతో మొసళ్లు ఇళ్లల్లోకి వచ్చినట్లు అధికారులు వెల్లడిస్తున్నారు.

ఈ నదిలో 440 మొసళ్లు ఉన్నాయని, వీటిలో చాలా వరకు అజ్వా డ్యామ్ నుంచి నీటిని విడుదల చేయడం వల్ల వరదలు వచ్చినప్పుడు నివాస ప్రాంతాలకు వెళ్లిపోయాయని వడోదర రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్ కరణ్‌సిన్హ్ రాజ్‌పుత్ తెలిపారు.
ఈ మూడు రోజుల్లో 24 మొసళ్లతో పాటు అనే చిన్న పాములు, నాగుపాములు, దాదాపు 40 కిలోల బరువున్న ఐదు పెద్ద తాబేళ్లు, ఒక పందికొక్కుతో సహా మరో 75 జంతువులను కూడా రక్షించామని అధికారులు ప్రకటించారు. ఇవన్నీ కూడా విశ్వామిత్ర నదికి సమీపంలో చాలా నివాస ప్రాంతాలలో దొరికాయని ఆయన చెప్పారు.
"మేము రక్షించిన అతి చిన్న మొసలి రెండు అడుగుల పొడవు ఉండగా, పెద్దది 14 అడుగులు ఉంది. నది ఒడ్డున ఉన్న కామ్‌నాథ్ నగర్ ఇవి పట్టుబడ్దాయి. ఈ భారీ మొసలి గురించి స్థానికులు మమ్మల్ని అప్రమత్తం చేశారు. 11 అడుగుల పొడవున్న మరో రెండు మొసళ్లు గురువారం రక్షించాం" అని రాజ్‌పుత్ తెలియజేశాడు.
ఏదేమైనా, ఈ ప్రాంతంలో, రాష్ట్రంలోని చాలా ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తున్న మొసళ్లు- మానవుల మధ్య సంఘర్షణ దాడులు మాత్రం చోటు చేసుకోలేదని అటవీ అధికారులు వెల్లడించారు.
"సాధారణంగా, మొసళ్ళు మనుషులపై దాడి చేయవు. నదిలో, అవి చేపలు, జంతువుల కళేబరాలతో జీవిస్తాయి. కుక్కలు, పందులు లేదా మరేదైనా చిన్న జంతువును కూడా చంపి తింటాయి. అలాంటి ఒక ఎన్‌కౌంటర్ వీడియో ఇటీవల వైరల్ అయింది," RFO చెప్పారు. విశ్వామిత్ర నది నీటిమట్టం గణనీయంగా పడిపోయినందున రక్షించిన మొసళ్లు, ఇతర సరీసృపాలను అందులో వదులుతామని తెలిపారు.
Read More
Next Story