ఆ రాష్ట్రంలో రాహుల్ పర్యటన, కాంగ్రెస్ కు కొత్త శక్తినిచ్చిందా?
x

ఆ రాష్ట్రంలో రాహుల్ పర్యటన, కాంగ్రెస్ కు కొత్త శక్తినిచ్చిందా?

ఎన్నికల సమయంలో మాత్రమే కాంగ్రెస్ అగ్రనాయకత్వం గుజరాత్ లో పర్యటించేది. అయితే గత రెండున్నర దశాబ్దాల నుంచి అక్కడ పార్టీ అధికారంలో లేదు.


(దమయంతి ధర్)

గుజరాత్ కాంగ్రెస్ పార్టీలో చాలా మార్పు వచ్చింది. ఇటీవల పార్టీ ఎంపీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ రాష్ట్రంలో పర్యటించారు. ఆయనకు పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. సడన్ గా పర్యటించి ఆయన కార్యకర్తలను ఆశ్చర్యం, ఆనందంలో ముంచెత్తారు.

బజరంగ్ దళ్ దాడి
ఎన్నికల సమయంలో మాత్రమే ఈ పశ్చిమ రాష్ట్రాన్ని సందర్శించే రాయ్‌బరేలీ ఎంపీ, అహ్మదాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో బీజేపీ, బజరంగ్ దళ్ సభ్యులతో కాంగ్రెస్ కార్యకర్తలు ఘర్షణ పడి అరెస్ట్ అయ్యారు. వీరిని పరామర్శించడానికి రాహుల్ గాంధీ గుజరాత్ కు వచ్చారు. లోక్ సభ లో రాహుల్ గాంధీ హిందువులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తరుణంలో జూలై 2న, అహ్మాదాబాద్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై భజరంగ్ దళ్, విహెచ్ పీ, బీజేపీ సభ్యులు దాడి చేశారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలతో ఘర్షణలకు దిగారు.
పోరాట స్ఫూర్తి..
ఈ ఘర్షణ జరిగిన దాదాపు రెండు వారాల తర్వాత, రాహుల్ జరిపిన ఆకస్మిక పర్యటన రాష్ట్ర కాంగ్రెస్‌లో ఒక రకమైన విశ్వాసాన్ని నింపింది. గుజరాత్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (జిపిసిసి) అధ్యక్షుడు శక్తిసిన్హ్ గోహిల్, ది ఫెడరల్‌తో మాట్లాడుతూ, “లోక్‌సభ ఎన్నికలతో పాటు ఏకకాలంలో ఉప ఎన్నికలు జరిగిన నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మేము ఓడిపోయినప్పటికీ, మా కార్యకర్తల్లో పోరాడే శక్తి మిగిలే ఉంది. ఆ స్ఫూర్తిని మరోసారి రాహుల్ గాంధీ వచ్చి గుర్తు చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో గుజరాత్ లోని ఒక లోక్ సభ స్థానాన్ని మాత్రమే కాంగ్రెస్ గెలుచుకుంది.
“స్థానిక నాయకులు కూడా ఇక్కడ ఒక్కస్థానాన్ని కూడా గెలవలేదని అనుకునేవారు. కానీ బనస్కాతం ఎంపీ స్థానం గెలవడంతో పార్టీ ఆలోచన మారింది. దాంతో ఇన్నాళ్లు మాపై నిర్లక్ష్యం గా ఉన్న కేంద్ర నాయకత్వం ఆలోచనలో మార్పు వచ్చింది. ”అని గోహిల్ అన్నారు.
కాంగ్రెస్ నైతికత..
సామాజికవేత్త, రాజకీయ విశ్లేషకుడు గౌతమ్ సా కూడా మాట్లాడుతూ.. రాహుల్ పర్యటన గుజరాత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు చాలా ఉత్సాహాన్ని ఇస్తుందని అంగీకరించారు. 2017 రాష్ట్ర ఎన్నికల నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల నైతికత చాలా తక్కువగా ఉందని సాహ్ అన్నారు.
“కాంగ్రెస్ 2017 నుంచి ఒకదాని తర్వాత ఒకటి ఎన్నికల్లో ఓడిపోతోంది, స్థానిక, పౌర, పాల సహకార ఎన్నికలలో దాని బలమైన స్థానాలను కూడా కోల్పోయింది. 2022 రాష్ట్ర ఎన్నికల ఓటమితో ఇంకా నైరాశ్యంలోకి కూరుకుపోయింది. ఎందుకంటే పార్టీ 182 సీట్లలో కేవలం 17 మాత్రమే గెలుచుకుంది.
ఇది గుజరాత్‌లో కాంగ్రెస్ అత్యంత చెత్త పనితీరుగా చెప్పవచ్చు. ఆ తర్వాత శాసనసభలో కాంగ్రెస్‌కు అధికారికంగా ప్రతిపక్ష హోదా నిరాకరించింది. ఇది గుజరాత్ ఎన్నికల రాజకీయ చరిత్రలో ఆ పార్టీ పొందిన అత్యల్ప స్థాయి అని ఆయన అన్నారు.
జోడో యాత్ర..
2022 రాష్ట్ర ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర గుజరాత్ గుండా వెళ్లకూడదని నిర్ణయించారు. ఈ నిర్ణయంతో పార్టీ కార్యకర్తల్లో నైరాశ్యం అలుముకుందని సాహ్ అంటున్నారు. "కార్మికులకు నైతిక స్థైర్యం అవసరమైన సమయంలో, వారు నాయకత్వం లేకుండా ఒంటరిగా మిగిలిపోయారు. అదే సమయంలో ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు బీజేపీలోకి ఫిరాయిస్తూనే ఉన్నారు. నాలుగు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఫిరాయించిన నేతల చేతిలోనే ఓడిపోయింది. పార్టీ ఫిరాయింపుల వల్ల మధ్య శ్రేణి నాయకత్వ కాంక్ష ఉన్న వారి మధ్య కుమ్ములాటలు ప్రారంభం అయ్యాయి. దీంతో అట్టడుగు స్థాయి కార్యకర్తలు దిక్కులేని స్థితిలో ఉన్నారు” అని రాజకీయ విశ్లేషకుడు అభిప్రాయపడ్డాడు.
“అయితే, లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ పనితీరు మెరుగుపడింది. 26 లోక్‌సభ స్థానాలను క్లీన్ స్వీప్ చేసే బీజేపీ దశాబ్దాల నాటి ట్రెండ్‌కు బనస్కాంత నియోజకవర్గంలోని ఏకైక విజయం బ్రేక్ వేసింది. రాష్ట్రంలోని 160 అసెంబ్లీ సెగ్మెంట్లలో బీజేపీ ఆధిక్యంలో ఉన్నప్పటికీ, 40కి పైగా సెగ్మెంట్లలో దాని ఓట్ల శాతం తగ్గింది, ముఖ్యంగా 2022 వరకు కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో ఈసారి పార్టీనే ఆధిక్యం సంపాదించింది.
ఫిరాయింపులను ఎదుర్కోవడం
ఈసారి లోక్‌సభ ఎన్నికల వాతావరణం భిన్నంగా ఉందని గోహిల్ కూడా భావించాడు. అంతేకాకుండా, లోక్‌సభలో పార్టీకి కీలక నేతగా మాత్రమే కాకుండా, లోక్‌సభలో ఉన్న రాహుల్, బిజెపిలోకి ఫిరాయించే నాయకుల సమస్యను మొదటిసారి ప్రస్తావించారని గోహిల్ ఎత్తి చూపారు. పార్టీకి విధేయత చూపిన నేతలకు ప్రియాంక గాంధీ, తాను అండగా ఉంటానని ఆయన నేతలకు చెప్పారు.
అహ్మదాబాద్‌లోని జమాల్‌పూర్ ఖాదియా ఎమ్మెల్యే ఇమ్రాన్ ఖేదావాలా కూడా రాహుల్ గాంధీ.. గుజరాత్‌లో ఆకస్మిక పర్యటన పార్టీ కార్యకర్తలపై ఒక విధమైన శాశ్వత నమ్మాకాన్ని కలిగించారని చెప్పారు. ఇంతకుముందు ఎన్నికలకు ముందు మాత్రమే ఇలాంటి పర్యటనలు ఉండేవని, కార్యకర్తలు ఈ పర్యటనలకే అలవాటుపడ్డారని అన్నారు.
అలాగే, ఖేదావాలా మాట్లాడుతూ, “మేము 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గట్టిగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నాము. మరెవరూ పార్టీ వదిలి వెళ్లడం లేదు. రాహుల్ గాంధీ మమ్మల్ని కలిశారు. మనల్ని మనం బలోపేతం చేసుకోవాలని, ఇంకెవరినీ విడిచిపెట్టబోమని హామీ ఇచ్చారు. గుజరాత్ వ్యవహారాలపై రాహుల్ ఎప్పటికప్పుడు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు.
సౌరాష్ట్రకు చెందిన ఒక కాంగ్రెస్ నాయకుడు మాట్లాడుతూ.. " ఒక ఆకస్మిక పర్యటన సరిపోదు, కానీ సీనియర్ నాయకత్వాన్ని ట్రాక్‌లో ఉంచడానికి క్రమం తప్పకుండా పరస్పర చర్యలు అవసరం" అని సూచించారు. "గుజరాత్‌లో, బిజెపికి విశ్వసనీయమైన ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ తనను తాను నిర్మించుకోవాలి" అని కాంగ్రెస్ నాయకుడు అన్నారు.
ఉద్వేగభరితమైన ప్రసంగం
ఉద్రిక్త వాతావరణం, ఘర్షణల మధ్య రాహుల్ అహ్మదాబాద్ చేరుకున్నాడు. ఆయనకి భారీ ఆదరణ లభించింది. ఊహించని సమావేశంలో, రాజీవ్ గాంధీ భవన్ మొదటి అంతస్తులో GPCC అధ్యక్షుడి కార్యాలయం కిటికీ నుంచి రాహుల్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నప్పుడు పార్టీ ప్రధాన కార్యాలయానికి దారితీసే వీధిలో కాంగ్రెస్ కార్యకర్తలు, మద్దతుదారులు గుమిగూడారు.
' దారో మత్, దారో మత్' (ఇతరులను భయపెట్టవద్దు, మిమ్మల్ని మీరు భయపెట్టుకోవద్దు) అని రాహుల్ హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. మా కార్యాలయాన్ని బద్దలు కొట్టినట్లుగా కాంగ్రెస్ వారి ప్రభుత్వాన్ని బద్దలు కొడుతుంది...’’ అని రాహుల్ తన ఆవేశపూరిత ప్రసంగంలో పేర్కొన్నారు.
రాష్ట్రంలో తన రెండు రోజుల పర్యటనలో, రాహుల్ గుజరాత్‌లో పరిపాలనాపరమైన లోపాల ఫలితంగా జరిగిన మూడు విషాదాల బాధితులను కూడా కలుసుకున్నారు - 2022 అక్టోబర్‌లో మోర్బీ వంతెన కూలి 135 మంది మరణించారు. వీరిలో ఎక్కువగా చిన్న పిల్లలే ఉన్నారు. జనవరి 2024లో వడోదరలో హర్నీ సరస్సులో పడవ బోల్తా పడి 12 మంది పిల్లలో సహ 14 మంది మరణించారు. రాజ్‌కోట్ లో TRP గేమింగ్ జోన్ అగ్నిప్రమాదంలో 30 మంది పిల్లలతో సహ కొంతమంది యువకులు మరణించారు. ఈ బాధిత కుటుంబాలను రాహుల్ గాంధీ మరణించారు.
Read More
Next Story