
గుజరాత్ ఘర్షణలో కాలిపోతున్న వాహానాలు
గుజరాత్ మత ఘర్షణలు, 50 మంది అరెస్ట్
ఐ లవ్ మహమ్మద్ అంటూ పోస్ట్ చేసిన ముస్లింలు, ఐ లవ్ మహాదేవ్ అంటూ హిందూ యువకుల కామెంట్లు, తమకు అలవాటైన రీతిలో రాళ్లు రువ్వి, ఘర్షణకు పాల్పడ్డ మరో వర్గం
గుజరాత్ లోని గాంధీనగర్ లో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్ పై ఇరువర్గాలు వాదించుకుని ఘర్షణలకు దిగాయి. ఈ ఆన్ లైన్ వ్యాఖ్యల కారణంగా బుధరవారం రాత్రి జరిగిన ఘర్షణలో గాంధీనగర్ లోని దేహ్ గామ్ లోని బహియాల్ గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు.
ఘర్షణలు హింసాత్మకంగా మారాయి. హింసాత్మక గొడవలకు ప్రసిద్ధిగాంచిన మరో వర్గం వారు రాళ్లు రువ్వడం, దుకాణాలు లూటీ చేయడం, కార్లకు నిప్పు పెట్టడం వంటి చర్యలకు దిగాయి. అలాగే గ్రామంలోని ఒక గర్భా వేదికపై కూడా రాళ్లు రువ్వారు.
గ్రామంలోని కొంతమంది గ్రామస్థులు సోషల్ మీడియాలో ‘ఐ లవ్ మమహ్మద్’’ అని పోస్ట్ చేసి వివాదాన్ని ప్రారంభించింది. దీనికి ప్రతిస్పందనగా హిందూ యువకులు ‘ఐ లవ్ మహాదేవ్’ అని పోస్ట్ చేశాడు. అయితే మా వర్గం దేవుడికి కించపరిచాడని, అనవసర కామెంట్ చేశారని మరోవర్గం తమకు అలవాటైన రీతిలో ఘర్షణలకు దిగింది.
ముస్లిం యువకులు పక్కన ఉన్న హిందూ వ్యక్తి దుకాణంలోకి వెళ్లి వస్తువులు బయటకు విసిరి, వాటికి నిప్పటించారు. రెండు వర్గాలు రాళ్లు రువ్వడం, వాహానాల దహనానికి పాల్పడటంతో గాంధీ నగర్ పోలీస్ లు రంగంలోకి దిగారు.
శాంతి పరిస్థితులు..
శాంతి భద్రతలను కాపాడటానికి గ్రామం అంతటా పోలీస్ బలగాలను మోహరించారు. పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్నందున శాంతిని పునరుద్దరించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారు.
ఇప్పటి వరకు పోలీసులు 50 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఘర్షణలో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు. అయితే అనేక మంది గాయపడ్డారు. దాడులపై దర్యాప్తు జరుగుతోంది. ఘర్షణలో పాల్గొన్నవారిని పట్టుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రజలు ప్రశాంతంగా ఉండాలని రెచ్చగొట్టే చర్యలకు లొంగవద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
Next Story