
అమిత్ చావ్డా
‘గోవు’ ను రాజ్యమాతగా ప్రకటించాలని గుజరాత్ అసెంబ్లీలో చర్చ
డిమాండ్ ను లేవనెత్తిన కాంగ్రెస్ ఎమ్మెల్యే
హిందువులు పరమపవిత్రంగా పూజించే ఆవును రక్షించడానికి అసెంబ్లీలో ప్రత్యేక బిల్లు తీసుకురావాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. గుజరాత్ అసెంబ్లీలో ప్రతిపక్ష కాంగ్రెస్ కు చెందిన చావ్డా మాట్లాడుతూ.. గోవును రక్షించడానికి వెంటనే ఆవును ‘రాజ్యమాత’ లేదా ‘రాష్ట్ర తల్లిగా’ గుర్తించే బిల్లును తీసుకురావాలని కోరారు.
గోవుల పెంపకం నియంత్రణ కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుపై రాష్ట్ర అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకుడు ఈ విధంగా మాట్లాడారు.
బీజేపీ ఎమ్మెల్యే డీకే స్వామి మాట్లాడుతూ.. హిందూ సంస్కృతిలో ఆవును తల్లిగా భావిస్తారని అన్నారు. స్పీకర్ శంకర్ చౌదరి, డిప్యూటీ స్పీకర్ జేతాభాయ్ భర్వాడ్ లకు రీడింగ్ గ్లాసెస్ అవసరం లేదని, ఎందుకంటే వారు క్రమం తప్పకుండా ఆవుపాలు తాగుతారని ఆయన అన్నారు.
‘‘మా స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ప్రతి రోజు ఆవు పాలు తాగుతారు. కాబట్టి వారికి ఇప్పటికే కళ్లద్దాలు లేవు. మేము ఆవులను నమ్ముతాము. గేదెలను కాదు. మాకు గేదెలు కూడా అవసరం ఉన్నప్పటికీ అది ఒక ప్రత్యేక విషయం. పవిత్రమైన ఆవు మా తల్లి. అది భూమికి చిహ్నం.’’ అని గుజరాత్ బోవిన్ బ్రీడింగ్(నియంత్రణ) బిల్లుకు మద్దతు ఇస్తూ స్వామి అన్నారు.
బిల్లును ప్రవేశపెట్టిన వ్యవసాయ మంత్రి రాఘవ్ జీ పటేల్ మాట్లాడుతూ... ‘‘ఆవు ఆశీర్వాదల’’ కారణంగా ఇటీవల ఆరోగ్య సమస్యల నుంచి కోలుకుంటున్నారని బీజేపీ ఎమ్మెల్యే అన్నారు.
గుజరాత్ లో పెద్ద ఎత్తున ‘గౌచర్’ లేదా మేత భూములను భూములను పారిశ్రామికవేత్తలకు ఇవ్వడం వల్ల ఆవుల పెంపకానికి ఇబ్బందిగా మారిందని కాంగ్రెస్ కు చెందిన అమిత్ చావ్డా అన్నారు.
‘‘హిందూ సంస్కృతిలో ఆవును తల్లిగా భావిస్తారు. అందుకే మనం శుభం సందర్భాలలో ఆవును ప్రార్థిస్తాము. కానీ ప్రభుత్వం గౌచర్(మేత భూమి) గా ఉపయోగించిన దాదాపు 103 కోట్ల చదరపు మీటర్ల భూమిని పారిశ్రామిక సంస్థలకు అమ్మకం లేదా లీజు ద్వారా అప్పగించినందున ఆవుల పెంపకందారులు ఇప్పుడు బాధపడుతున్నారు.’’ అని ప్రతిపక్ష నాయకుడు ఆరోపించారు.
రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో పంచుకున్న గణాంకాల ప్రకారం దాదాపు 2800 గ్రామాలకు నియమించబడిన మేత భూమి లేదని చావ్డా అన్నారు. ‘‘ఈ గ్రామాల్లోని ఆవుల పరిస్థితి గురించి మనమందరం ఆందోళన చెందాలి. గౌచర్ల భూమిని కోల్పోయిన తరువాత, మన గోవులకు నగర రోడ్లపై ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలను తినడం తప్ప వేరే మార్గం లేదు’’ అని ఆయన అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం గోవధకు వ్యతిరేకంగా చట్టాలను రూపొందించినప్పటికీ, మాంసం ఎగుమతి ద్వారా కూడా ఆదాయం సంపాదిస్తున్నారని కాంగ్రెస్ నాయకుడు అన్నారు. ప్రభుత్వం గో సంరక్షణ కేంద్రాలకు మరిన్ని గ్రాంట్లు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
‘‘ఆవును మన రాజ్యమాతగా ప్రకటించడానికి ఒక బిల్లును తీసుకురావాలని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. దీనికి సంబంధించి మేము ఇప్పటికే స్పీకర్ కు ప్రైవేట్ మెంబర్ బిల్లును సమర్పించాము.
కానీ ప్రభుత్వం ఒక బిల్లును తీసుకురావాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ఆవులకు సరైన ఆహారం, ఆశ్రయం చికిత్స లభించేలా చూసుకోవాలి’’ అని ఆయన అన్నారు. ఈ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించారు.
బడ్జెట్ సమావేశాల చివరి రోజున గుజరాత్ భూ రెవెన్యూ(సవరణ) బిల్లు, గుజరాత్ మత్స్య బిల్లు అనే రెండు బిల్లులు కూడా ఏకగ్రీవంగా ఆమోదించారు.
Next Story