నకిలీ యూనివర్శిటీతో వైద్య విద్య సర్టిఫికెట్లు జారీ చేసిన కేటుగాళ్లు
x

నకిలీ యూనివర్శిటీతో వైద్య విద్య సర్టిఫికెట్లు జారీ చేసిన కేటుగాళ్లు

కేటుగాళ్లు రోజురోజుకీ తెలివిమీరుతున్నారు. తాజాగా గుజరాత్ లోని సూరత్ పట్టణంలోని ఓ ముఠా నకిలీ యూనివర్శిటీ పెట్టి వైద్యవిద్య సర్టిఫికెట్లు..


పలువురు కేటుగాళ్లకు నకిలీ వైద్య విద్య పట్టా సర్టిఫికెట్లు అందజేస్తున్న గుజరాత్ కు చెందిన ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఈ ముఠా ఇప్పటి వరకూ 14 మందికి వైద్య విద్య పట్టాలు విక్రయించినట్లు తెలింది. వారిని సైతం పోలీసులు అరెస్ట్ చేశారు.

వివరాలు.. గుజరాత్ లోని సూరత్ కు చెందిన సతీష్ గుజరాతీ కొంతమందితో ముఠా తయారు చేసుకుని దేశ వ్యాప్తంగా నకిలీ వైద్య విద్య సర్టిఫికెట్లు అందజేస్తోంది. ఈ ముఠాకు రూ. 70 వేలు అందజేస్తే చాలు వారిపేరుతో వైద్య విద్య అభ్యసించినట్లు సర్టిఫికెట్లు ఇస్తోంది. వీరి వద్ద దాదాపు 1200 నకిలీ డిగ్రీల డేటాబేస్ ఉన్నట్లు జాతీయ మీడియా పేర్కొంది.

ముఠా అందించే డిగ్రీలు గుజరాత్‌లోని “బోర్డ్ ఆఫ్ ఎలక్ట్రో హోమియోపతిక్ మెడిసిన్” (BEHM) ద్వారా జారీ చేస్తున్నారు. ఈ ముఠా వద్ద అభ్యర్థుల నుంచి వచ్చిన వందలాది దరఖాస్తులు, సర్టిఫికెట్లు, స్టాంపులను పోలీసులు గుర్తించారు. ముగ్గురు నకిలీ వైద్యులపై అల్లోపతి మెడిసిన్‌ ప్రాక్టీస్‌పై ఫిర్యాదులు అందడంతో పోలీసులు విచారణ ప్రారంభించారు.
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో ఉన్న ముఠా స్థావరాలపై దేవాదాయ శాఖ అధికారులతో కలిసి పోలీసులు దాడులు ప్రారంభించారు. అయితే పోలీసులు విచారణ ప్రారంభించినప్పుడు నిందితులు తెలివి తేటలతో బీహెచ్ఈఎం జారీ చేసినట్లు ఉన్న కొన్ని డిగ్రీ సర్టిఫికెట్లు ప్రదర్శించారు. కానీ తరువాత గుజరాత్ ప్రభుత్వం నుంచి అందించిన సమాచారం ప్రకారం అవి నకిలీవని తేల్చారు.
కుంభకోణం మూలాలు
భారతదేశంలో ఎలక్ట్రో-హోమియోపతికి సంబంధించి ఎలాంటి నిబంధనలు లేవని ప్రధాన నిందితుడు గుర్తించాడని, కోర్సులో డిగ్రీలు అందించడానికి బోర్డును ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాడని పోలీసులు తెలిపారు. అతను ఐదుగురు వ్యక్తులను నియమించుకుని, ఎలక్ట్రో-హోమియోపతి మందులను ఎలా సూచించాలో వారికి శిక్షణ ఇచ్చాడు. వారు 3 సంవత్సరాల కంటే తక్కువ వ్యవధిలో కోర్సును పూర్తి చేశారు.
ఎలక్ట్రో-హోమియోపతి పట్ల ప్రజలు పెద్దగా ఆదరించరని తెలుసుకున్న ముఠా, వారు గుజరాత్‌లోని ఆయుష్ మంత్రిత్వ శాఖ పేరుతో పట్టాలను అందించడం ప్రారంభించారు. BEHMకి రాష్ట్ర ప్రభుత్వంతో టైఅప్ ఉందని అందరిని నమ్మించారు. వారు డిగ్రీకి ₹70,000 వసూలు చేశారు. ఎటువంటి సమస్య లేకుండా ఈ సర్టిఫికేట్‌తో అల్లోపతి, హోమియోపతి, వైద్య విద్య అభ్యసించవచ్చని అభ్యర్థులకు నచ్చజెప్పారు.
ముఠా చెల్లింపు అందుకున్న 15 రోజులలోపు సర్టిఫికేట్‌లను జారీ చేసింది. ఒక సంవత్సరం తర్వాత అదనంగా ₹ 5,000 నుంచి ₹ 15,000 చెల్లించి వాటిని పునరుద్ధరించాలని నకిలీ వైద్యులకు చెప్పారు. రెన్యూవల్ ఫీజు చెల్లించని వారిని ముఠా బెదిరించినట్లు పోలీసులు తెలిపారు.



Read More
Next Story