కాంగ్రెస్ ప్రజలకు మంచి చేయకపోవడం వల్లే ఓడిపోతోంది
x
కేంద్ర హోంమంత్రి అమిత్ షా

కాంగ్రెస్ ప్రజలకు మంచి చేయకపోవడం వల్లే ఓడిపోతోంది

రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా


ప్రజలకు మంచి చేసే ప్రతిపనిని వ్యతిరేకిస్తే ఓట్లు ఎలా పడతాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాహుల్ గాంధీకి చురకలంటించారు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవడంలో కాంగ్రెస్ మేధావులు సైతం విఫలమయ్యారని, రాహుల్ గాంధీ మేథాశక్తి ఇది అందకపోవడంలో ఆశ్చర్యం లేదన్నారు. అహ్మాదాబాద్ దగ్గరలో జరిగిన బహిరంగ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

‘‘ఇటీవల జరిగిన లోక్ సభలో చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ ఓ ప్రశ్న అడిగారు. ‘ఎందుకు మా పార్టీ పదే పదే ఎన్నికల్లో ఓడిపోతోంది’ అన్నారు. ఈ ప్రశ్న ప్రజలను అడగడానికి బదులు, రాహుల్ గాంధీ నన్ను అడిగారు. రాహుల్ బాబా నేను ఈ రోజు ఇక్కడ ప్రారంభించిన రెండు పనులను మీరు అర్థం చేసుకుంటే మీకు సమాధానం దొరుకుతుంది’’ అని అమిత్ షా అన్నారు.
‘‘జరగబోయే తమిళనాడు, పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కచ్చితంగా ఓడిపోతుంది. కాబట్టి మీరు మరోసారి విసుగు చెందకూడదు’’ అని షా వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. 2029 లోక్ సభ ఎన్నికల్లో మరోసారి నరేంద్ర మోదీ నేతృత్వంలో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని అన్నారు.
‘‘మా విజయానికి ప్రధాన సూత్రం ప్రజలతో మా సూత్రాలు అనుసంధానించడమే. కాంగ్రెస్ మాత్రం రామమందిర నిర్మాణం, సర్జికల్ స్ట్రైక్, ఆర్టికల్ 370 రద్దు, కామన్ సివిల్ కోడ్, త్రిపుల్ తలాక్, అక్రమ బంగ్లాదేశ్ చొరబాటుదారులకు మద్దతు’’ లాంటి అంశాలతో ప్రజలకు దూరమైందని అన్నారు.
‘‘ఇప్పుడు చెప్పు రాహుల్ బాబా.. మీరు ప్రజలు కోరుకునే ప్రతిదానిని మీరు వ్యతిరేకించారు. మరీ మీకు ఓట్లు ఎలా పడతాయి. కానీ రాహుల్ బాబాకు ఈ సులభమైన తర్కం కూడా అర్థం కావడం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ నాయకులకు ఈ విషయం అర్థం చేసుకోలేకపోయారు’’ అని షా పేర్కొన్నారు.
అహ్మదాబాద్ లోని నవీ వన్జార్ లో జరిగిన కార్యక్రమంలో షా పాల్గొని 173 మంది నివాసితులకు భూ యాజమాన్య ధృవీకరణ పత్రాలు(సనద్) అందజేశారు. లబ్ధిదారులు మొదట సబర్మతి నది ఒడ్డున ఉన్న వన్జార్ గ్రామానికి చెందిన వారు. కానీ 1973 లో సంభవించిన వినాశకరమైన వరదల్లో ఇళ్లు, భూములు కోల్పోయారు. వీరికి నవీవన్జార్ లో పునరావాసం పొందారు.
ఈ సందర్భంగా షేలా, సౌత్ బోపాల్, శాంతిపుర, థాల్తేజ్ వంటి కొత్తగా అభివృద్ధి చెందిన ప్రాంతాలలో నివసిస్తున్న దాదాపు 15 లక్షల మంది నివాసితులు ఉత్పత్తి చేసే మురుగునీటిని నిర్వహించడానికి డ్రైనేజీ నెట్ వర్క్ అయిన వెస్ట్రన్ ట్రంక్ లైన్ లను కూడా ప్రారంభించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడూ ఈ 173 మందిని నవీ వంజారకు తరలించారు. కానీ వారికి 50 సంవత్సరాలు గడిచిన తరువాత కూడా వారికి భూమి యాజమాన్య హక్కులు లభించలేదని అన్నారు.
ట్రంక్ లైన్ ప్రాజెక్ట్ గురించి షా మాట్లాడుతూ.. నగరంలో పశ్చిమ ప్రాంతాలలో నివసిస్తున్న దాదాపు 15 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుందని కొన్ని ప్రాంతాల్లో డ్రైనేజీ ఓవర్ ప్లో సమస్యలను కూడా ఈ ప్రాజెక్ట్ లను పరిష్కరిస్తుందని అన్నారు.
‘‘అయినప్పటికి ప్రభుత్వం ఈ పనిని చేపట్టి గడువుకు ముందే పూర్తి చేసింది. రాహుల్ గాంధీ దీనిని అర్థం చేసుకోవాలి. బదులుగా అతను స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) ను డీకోడ్ చేయడానికి ప్రయత్నించాడు. అది ఇతనికి ఇష్టం లేదు’’ అని అమిత్ షా విమర్శలు గుప్పించారు.


Read More
Next Story