‘‘ఎప్పుడైనా.. ఎక్కడైనా.. ఎలాగైనా.. యుద్దానికి మేము సిద్దం’’
x

‘‘ఎప్పుడైనా.. ఎక్కడైనా.. ఎలాగైనా.. యుద్దానికి మేము సిద్దం’’

అరేబియాలో బ్రహ్మోస్ క్షిపణులతో విన్యాసాలు నిర్వహించిన నేవీ, పాల్గొన్న డిస్ట్రాయర్లు, ఫ్రిగెట్ లు


భారత్ - పాక్ మధ్య ఓ పక్క టెన్షన్ వాతావరణం నెలకొన్న సందర్భంలో భారత నావికదళంలో తన యుద్ధ సన్నద్దతను సమీక్షించుకుంటోంది. అరేబియా సముద్రంలో తన యుద్ద నౌకల నుంచి బహుళ నౌకా విధ్వంసక క్షిపణి ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించింది. సుదూరంగా ఉన్న లక్ష్యాలను, అత్యంత కచ్చితంగా చేధించి తన పోరాట సంసిద్దతను ప్రదర్శించింది.

సముద్రంలో ప్రదర్శనలకు సంబంధించిన వీడియోలను ఎక్స్ లో పోస్ట్ చేసింది. భారత నావికాదళం ఎప్పుడైనా, ఎక్కడైనా ఎలాగైనా దేశ ప్రయోజనాలతో కాపాడేందుకు యుద్దానికి సిద్దంగా ఉందని అందులో ప్రత్యేకంగా పేర్కొంది. నేవీ షేర్ చేసిన ఆన్ లైన్ వీడియోలలో కోల్ కత క్లాస్ డిస్ట్రాయర్లు, నీలగిరి, క్రివాక్ క్లాస్ ఫ్రిగేట్ లతో సహా అనేక ఫ్రంట్ లైన్ యుద్దనౌకల నుంచి బ్రహ్మోస్ యాంటీ షిప్ యాంటీ సర్పేస్ క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించినట్లు చూపించారు.
‘‘సుదూర కచ్చితమైన లక్ష్యాలు, వ్యవస్థలు, సిబ్బంది సంసిద్దతను ధృవీకరించడానికి, ప్రదర్శించడానికి భారత నావికదళ నౌకలు విజయవంతమైన నౌక విధ్వంసక కాల్పులు చేపట్టాయి.
భారత నావికాదళం దేశ సముద్ర ప్రయోజనాలను కాపాడటంతో యుద్దానికి సిద్దంగా, విశ్వసనీయంగా, భవిష్యత్ లో ఎలాంటి స్థితినైనా ఎదుర్కోవడానికి సిద్దంగా ఉంది’’ అని నేవీ పోస్ట్ లో పేర్కొంది. అరేబియా సముద్రంలో భారత క్షిపణి పరీక్షలకు ముందే పాకిస్తాన్ సముద్ర నోటిఫికేషన్ జారీ చేసింది. కానీ ఇప్పటి వరకూ ఎలాంటి క్షిపణీ పరీక్షలు చేయలేదు.

పెరుగుతున్న ఉద్రిక్తతలు
పహల్గామ్ ఉగ్రవాద దాడి తరువాత భారత్ - పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల మధ్య ఈ బలప్రదర్శన జరిగింది. పహల్గామ్ లో కేవలం హిందువులు అన్న కారణంగా 26 మంది పౌరులను ఇస్లామిక్ ఉగ్రవాదులు కాల్చి చంపారు.
ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా సింధు జలాల ఒప్పందంతో సహా పాకిస్తాన్ తో కీలక ఒప్పందాలను భారత్ నిలిపివేసింది. పాకిస్తాన్ జాతీయులను వెంటనే దేశ విడిచి వెళ్లాలని ఆదేశించింది. దేశంలో అక్రమంగా నివాసం ఉంటున్న బంగ్లాదేశీయులను సైతం గురించింది. వారిని వెంటనే వారి సొంత దేశానికి పంపబోతున్నట్లు వెల్లడించింది.
భారత్ తీసుకున్న ఈ చర్య తరువాత పాకిస్తాన్ మంత్రులు రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నారు. భారత్, పాకిస్తాన్ కు సింధు నదీ జలాలను నిలిపివేస్తే అణుదాడులతో పూర్తి స్థాయి యుద్దం చేస్తామని బెదిరిస్తున్నారు. పాకిస్తాన్ కూడా భారత్ తో ఉన్న అన్ని ద్వైపాక్షిక ఒప్పందాలను నిలిపివేసింది.
పాకిస్తాన్, భారత దళాలను రెచ్చగొట్టడానికి నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాలను ఉల్లంఘించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. పాక్ కు ధీటుగా భారత సైన్యం కూడా భీకరంగా కాల్పులు జరుపుతోంది. పహల్గామ్ ఉగ్రదాడిపై భారత ప్రధాని మన్ కీ బాత్ లో మాట్లాడారు. ఉగ్రవాద దాడిపై తరువాత ప్రతి భారతీయుడి రక్తం మరిగిపోతుందని అన్నారు.
‘‘ఉగ్రవాద దాడిలో తమను తాము కోల్పోయిన వారి బాధను ప్రతి ఒక్కరు అనుభవిస్తున్నారు’’ అని ప్రధాని అన్నారు. కాశ్మీర్ లో శాంతి తిరిగి వస్తోందని కానీ జమ్మూకాశ్మీర్ శత్రువులకు ఇది నచ్చలేదని అన్నారు.
పహల్గామ్ ఉగ్రవాద దాడి తరువాత భారత వైమానికదళం కూడా ఆపరేషన్ ఆక్రమణ్ పేరిట విన్యాసాలు నిర్వహించింది. అనేక ప్రాంతాలపై ఏకకాలంలో దాడులు ఎలా చేయాలో రిహార్సల్స్ నిర్వహించింది.
Read More
Next Story