మత మార్పిడి నివారణకు VHP ‘‘ధర్మరక్షకులు’’
x

మత మార్పిడి నివారణకు VHP ‘‘ధర్మరక్షకులు’’

హిందూ మత పరిరక్షణకు వీహెచ్‌పీ (Vishwa Hindu Parishad) ప్రణాళిక ఏమిటి? ధర్మరక్షులకు అప్పగించిన బాధ్యలేమిటి? ‘ఘర్ వాపసీ’ (Ghar Wapsi) సత్ఫలితాలిచ్చిందా?


మహా కుంభమేళా ముగింపు దశకు చేరుకుంటున్న నేపథ్యంలో విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) మరో లక్ష్యంతో జనాల్లోకి వెళ్లబోతుంది. దేశవ్యాప్తంగా మత మార్పిడులను అడ్డుకునేందుకు భారీ ఉద్యమ ప్రారంభానికి సిద్ధమవుతోంది.

వీహెచ్‌పీ నేతలు ఇప్పటికే మత మార్పిడులు అధికంగా ఉన్న రాష్ట్రాలను గుర్తించారు. కేరళ, తమిళనాడు, తెలంగాణ, జార్ఖండ్, పంజాబ్ రాష్ట్రాల్లో దాదాపు 400 జిల్లాలు ఆ జాబితాలో ఉన్నాయని వారు చెబుతున్నారు. తాము చేపట్టిన ‘ఘర్ వాప్సీ’ కార్యక్రమంలో భాగంగా 2024 జూలై నుంచి డిసెంబర్ వరకు దాదాపు 19వేల మందిని తిరిగి హిందూ మతం స్వీకరించేలా చేశామని పేర్కొన్నారు.

ధర్మ రక్షకుల నియామకం..

మత మార్పిడులను అడ్డుకునేందుకు ప్రత్యేకంగా వీహెచ్‌పీ "ధర్మ రక్షకులు"(Dharma Rakshaks) పేరిట స్వచ్ఛంద సేవకులను నియమించుకుంటోంది. సాధారణంగా వీహెచ్‌పీతో జతకట్టిన చాలా మంది విభిన్న రంగాల్లో, భిన్న వృత్తులో కొనసాగుతున్నారు. అయితే ఈ ధర్మ రక్షకులు కేవలం మత మార్పిడులను అడ్డుకోవడానికి కృషి చేస్తారు. వీరికి ఇతర సంస్థాగత బాధ్యతలు ఉండవు. కొన్ని రాష్ట్రాల్లో వీరు ప్రభుత్వానికి, చట్టానికి మధ్య వారధిగా కూడా పనిచేస్తారు. తద్వారా మత మార్పిడులను నిలిపివేయడానికి అవసరమైన చర్యలు తీసుకునే వీలుంటుంది," అని వీహెచ్‌పీ జాతీయ అధికార ప్రతినిధి వినోద్ బన్సాల్ తెలిపారు.

కార్యాచరణ ప్రణాళిక..

"ప్రస్తుతం 400లకుపైగా ధర్మ రక్షకులు వివిధ రాష్ట్రాల్లో పనిచేస్తున్నారు. ఇంకా ఎక్కువ మంది సేవకులు అవసరం. మత మార్పిడులను అడ్డుకోవడమే కాకుండా, హిందూ మతంలోకి తీసుకురావడం మా బాధ్యత. హిందూ మతంలో తిరిగి చేరిన వారికి వివిధ జీవనోపాధులను కల్పించేందుకు వీహెచ్‌పీ శిక్షణ కూడా ఇస్తోంది," అని బన్సాల్ తెలిపారు. 2024 జులై నుంచి డిసెంబర్ మధ్య 19వేల మందిని తిరిగి హిందూ మతంలోకి తీసుకురావడమే కాకుండా, 66వేల మందిని మతం మార్చుకోకుండా అడ్డుకున్నట్లు తెలిపారు.

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో చట్టాలు..

అసోం, ఉత్తరప్రదేశ్, హర్యానా, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ వంటి బీజేపీ పాలిత రాష్ట్రాలు ఇప్పటికే మత మార్పిడులను అడ్డుకునేందుకు కఠిన చట్టాలు అమలు చేస్తున్నాయి. మహారాష్ట్ర, రాజస్థాన్ కూడా త్వరలో ఇలాంటి చట్టాలను అమలు చేసే అవకాశముందని సమాచారం.

హిందుత్వ వర్గాల సంతృప్తి కోసమే..

దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున మత మార్పిడులు జరుగుతున్నట్లు విశ్వసనీయమైన గణాంకాలు లేవని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయపడుతున్నారు. "వ్యక్తిగతంగా మత మార్పిడులు జరుగుతున్నాయనే విషయం నిజమే. కానీ అవి ఒక ప్రాంతాన్నే మార్చేసే స్థాయిలో జరగడం లేదు. మత మార్పిడులు పెద్ద ఎత్తున జరుగుతున్నాయనే ఆధారాలను చూపించే గణాంకాలు లేవు. సెన్సస్ కూడా ఇంకా నిర్వహించలేదు. ఈ మత మార్పిడి వ్యతిరేక చట్టాలు పూర్తిగా హిందుత్వ వర్గాలను సంతృప్తిపరిచే రాజకీయ కదలికలు మాత్రమే. మత మార్పిడులు భారీగా జరుగుతున్నాయని భయాన్ని సోషల్ మీడియాలో పెంచుతున్నారు. ప్రమాణాల ఆధారంగా ప్రభుత్వం తగిన నిర్ణయాలు తీసుకోవాలి," అని మహారాజా సయాజిరావు యూనివర్సిటీ ఆఫ్ బరోడా ప్రొఫెసర్ అమిత్ ధోళాకియా అభిప్రాయపడ్డారు.

Read More
Next Story