US | అమెరికాలో తెలుగు ముఠా: తెలుగు వ్యాపారులే టార్గెట్
అమెరికాలో మనోళ్ల తీరిది. డల్లాస్‌లో కొంతమంది తెలుగు యువకులు జట్టుగా ఏర్పడి తెలుగు వ్యాపారులను బెదిరించి దోచుకోవడం మొదలెట్టారు.
అగ్రరాజ్యంలో కొంతమంది తెలుగువాళ్ల (Telugu Youth) వల్ల పరువుపోతోంది. అమెరికా(America)కు వెళ్లిన తెలుగు యువకులు ఓ ముఠాగా ఏర్పడి డల్లాస్(Dallas)లో బెదిరింపులకు పాల్పడుతున్నారు. అక్కడి తెలుగు వ్యాపారులను టార్గెట్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. తూకాల్లో తేడాలున్నాయని అధికారులకు ఫిర్యాదు చేయకుండా ఉండాలంటే లక్ష డాలర్లు ఇవ్వాలని బ్లాక్‌మెయిల్ (Blackmailing) చేస్తున్నారు. గత కొన్ని రోజుల నుంచి వీరి వ్యవహార శైలి కాస్త తేడాతో ఉండడంతో కొందరు వ్యాపారులు వీరిని నిలదీశారు. లోపాలు ఉంటే అధికారులకు ఫిర్యాదు చేయాలనిగానీ డబ్బులు డిమాండ్ చేయడం ఏంటని గట్టిగా ప్రశ్నించారు. ముఠా గురించి పోలీసులకు కూడా ఫిర్యాదుచేసినట్లు సమాచారం. రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన వీడియోలు నెట్టింట్లో ప్రస్తుతం వైరలవుతున్నాయి. అయితే వీరి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఏ జిల్లాకు చెందిన వారు, అమెరికాకు ఎప్పుడు వెళ్లారన్న విషయాలు పోలీసుల విచారణలో తెలిసే అవకాశం ఉంది.