
అందుబాటులోకి వచ్చిన UPI పిన్‌ఫ్రీ సర్వీస్..
ఇకపై ముఖం లేదా వేలిముద్ర ఆధారంగా నగదు చెల్లింపు..
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) సేవలను మరింత సరళీకరించారు. ఇప్పటివరకు పిన్ ఆధారంగా చెల్లింపులు జరిగేవి. ఇకపై ముఖ ఆధారిత లేదా వేలిముద్ర ఆధారంగా క్యాష్ పేమెంట్ చేయొచ్చు. అక్టోబర్ 8 నుంచి ఈ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది.
ముంబైలో జరిగిన గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్టివల్ సందర్భంగా ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టారు. ఈ మార్పు లక్షలాది మందికి ప్రయోజనం చేకూర్చనుంది. కొంతమంది సీనియర్ సిటిజన్లు, గ్రామీణులు, నిరక్షరాస్యులు పాస్‌వర్డ్ లేదా పిన్ మరిచిపోతుంటారు. ఈ సమస్యను అధిగమించేందుకు సాంకేతికను అప్‌గ్రేడ్ చేశారు. ఆధార్-లింక్డ్ బయోమెట్రిక్ డేటా ఆధారంగా పనిచేసే ఈ వ్యవస్థ వల్ల డబ్బు లావాదేవీల్లో దుర్వినియోగం జరిగే అవకాశాలు తక్కువ అని సైబర్ భద్రతా నిపుణులు చెబుతున్నారు.
Next Story