బంగ్లాదేశ్‌లో అశాంతి: భారత్‌కు ఎందుకు ఆందోళనకరం?
x

బంగ్లాదేశ్‌లో అశాంతి: భారత్‌కు ఎందుకు ఆందోళనకరం?

సిలిగురి కారిడార్ మరింత సున్నితంగా మారే అవకాశం ఉందన్న ‘ది ఫెడరల్’ ఎడిటర్ ఎడిటర్-ఇన్-చీఫ్ ఎస్. శ్రీనివాసన్ ..


Click the Play button to hear this message in audio format

బంగ్లాదేశ్‌(Bangladesh)లో మళ్లీ రాజకీయ అశాంతి పెరుగుతోంది. తాజా వీధి నిరసనలు, హింసాత్మక ఘటనలు 2024 మధ్యలో మొదలైన రాజకీయ కలకలానికి కొనసాగింపేనని ది ఫెడరల్ ఎడిటర్-ఇన్-చీఫ్ ఎస్. శ్రీనివాసన్ చెప్పారు. Talking Sense with Srini కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఈ పరిణామాలను వేరుగా చూడకూడదని స్పష్టం చేశారు.

"బంగ్లాదేశ్‌లో ఏమి జరిగిందో అర్థం చేసుకోవడానికి మనం కొంచెం వెనక్కి వెళ్లాలి" అని శ్రీనివాసన్ అన్నారు. 2024లో ఆందోళనలు జరిగిన తర్వాత చివరికి షేక్ హసీనా దేశం విడిచి భారతదేశంలో ఆశ్రయం పొందవలసి వచ్చింది. "ఆ నిరసనలు ఆకస్మికంగా జరిగాయా? లేదా ఉద్దేశపూర్వకంగా జరిగాయా? అనేది ఇప్పటికీ అస్పష్టంగా ఉంది, కానీ అవి బంగ్లాదేశ్ రాజకీయాలను పూర్తిగా మార్చాయి. ఫిబ్రవరి 2026లో ఎన్నికలు నిర్వహించే బాధ్యతను నెతినేసుకున్న ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం దేశంలో ఆందోళన పరిస్థితిని అదుపులోకి తేవడానికి చాలా కష్టపడింది.’’ అని చెప్పారు.

విద్యార్థి నేత ఒస్మాన్ హాది హత్య తాజా అశాంతికి కారణమైందని శ్రీనివాసన్ చెప్పారు. ఈ ఘటనపై అంతర్జాతీయ స్పందన అసాధారణమని పేర్కొంటూ.. బయటి శక్తుల పాత్రపై అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రధాన పార్టీలైన Awami League, BNPలను పక్కన పెట్టే ‘మైనస్–టూ’ విధానం అమలవుతే Jamaat-e-Islami లాభపడే అవకాశం ఉందని హెచ్చరించారు.

ఈ పరిణామాలు భారత్ భద్రతపై ప్రత్యక్ష ప్రభావం చూపుతాయని చెప్పారు. పాకిస్తాన్‌(Pakistan)తో బంగ్లాదేశ్ సంబంధాలు, చైనా(China) మౌన ప్రభావం భారత్‌కు ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. ముఖ్యంగా సిలిగురి కారిడార్ మరింత సున్నితంగా మారుతుందని హెచ్చరించారు. మతపరమైన హింస పరిస్థితిని ప్రమాదకరంగా మార్చుతుందని శ్రీనివాసన్ చెప్పారు. బంగ్లాదేశ్ అంతర్గత వ్యవహారాలను గౌరవిస్తూనే, జాతీయ భద్రతకు సంబంధించిన ఎర్ర గీతలు దాటితే భారత్ స్పందించాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

Read More
Next Story