Maharashtra | సర్పంచ్ హత్యపై జల్ సమాధి నిరసన
x

Maharashtra | సర్పంచ్ హత్యపై 'జల్ సమాధి' నిరసన

‘‘దేశ్‌ముఖ్‌ హత్యతో రాష్ట్రంలో శాంతిభద్రతాలు క్షీణించాయి. ఫడ్నవీస్‌కు ముఖ్యమంత్రిగా కొనసాగే నైతిక హక్కు లేదు.’’- కాంగ్రెస్ అధికార ప్రతినిధి అతుల్ లోంధే


మసాజోగ్ గ్రామ సర్పంచ్ సంతోష్ దేశ్‌ముఖ్‌ (Santosh Deshmukh) హత్య మహారాష్ట్ర (Maharashtra)లో రాజకీయ దుమారం రేపుతోంది. సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌(Devendra Fadnavis)ను బాధ్యుడిని చేస్తూ ఆయనకు ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత లేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. కాగా హత్య కేసులో మరికొంతమంది నిందితులను అరెస్టు చేయకపోవడాన్ని నిరసిస్తూ బుధవారం మసాజోగ్ గ్రామస్థులు 'జల్ సమాధి' నిర్వహించారు. గ్రామంలోని సరస్సులోకి వెళ్లి నడుము లోతు నీటిలో నిలబడి నిరసన తెలిపారు.

కిడ్నాప్ ఆపై హత్య..

విండ్‌మిల్ కంపెనీ నుంచి డబ్బు డిమాండ్ చేయడాన్ని వ్యతిరేకించిన సంతోష్ దేశ్‌ముఖ్‌ను డిసెంబర్ 9న కొందరు కిడ్నాప్ చేసి హతమార్చారు. ఈ హత్యకు సంబంధించి ఇప్పటికే పోలీసులు ముగ్గురిని (ప్రతీక్ ఘ్లే, జయరామ్ ఛటే, మహేష్ కేదార్) అరెస్టు చేశారు. మరో ముగ్గురు (సుదర్శన్ ఘూలే, సుధీర్ సాంగ్లే మరియు కృష్ణ అంధలే) పరారీలో ఉన్నారు. వారం రోజుల క్రితమే నేరం జరిగినా.. పోలీసులు ఇంకా కొంతమంది నిందితులను ఎందుకు పట్టుకోలేదని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

లొంగిపోయిన మంత్రి సహచరుడు ..

ఈ కేసులో సహనిందితుడిగా ఉన్న మహారాష్ట్ర ఎన్‌సీపీ (NCP) మంత్రి ధనంజయ్(Dhananjay) ముండే సన్నిహితుడు వాల్మిక్ కరాద్ మంగళవారం పూణెలోని క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (సీఐడీ) కార్యాలయంలో లొంగిపోయాడు. అతడిని బీడ్ జిల్లాలోని కేజ్ కోర్టుకు తరలించారు.

న్యాయం చేస్తామని సీఎం..

హత్యకు గురైన దేశ్‌ముఖ్‌ కుటుంబానికి అండగా ఉంటామని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఇప్పటికే చెప్పారు. గూండాగిరిని సహించబోమని స్పష్టం చేశారు. దేశ్‌ముఖ్‌ హత్య కేసులో ఎవరిని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు.

సీఎంను టార్గెట్ చేసిన ప్రతిపక్షాలు..

దేశ్‌ముఖ్‌ హత్యతో రాష్ట్రంలో శాంతిభద్రతాలు క్షీణించాయని, ఫడ్నవీస్‌కు ముఖ్యమంత్రిగా కొనసాగే నైతిక హక్కు లేదని కాంగ్రెస్ (Congress) అధికార ప్రతినిధి అతుల్ లోంధే విమర్శించారు. ముండేను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని ఎన్సీపీ (ఎస్పీ) ఎమ్మెల్యే జితేంద్ర అవద్ డిమాండ్ చేశారు.

Read More
Next Story