నీట్-యూజీ పేపర్ లీక్‌లో కేసులో మరో ఇద్దరి అరెస్ట్
x

సోమవారం భోపాల్‌లో NEET-UG పరీక్ష 2024లో జరిగిన అవకతవకలు, నర్సింగ్ కాలేజీ కుంభకోణానికి వ్యతిరేకంగా నిర్వహించిన ప్రదర్శనలో నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (NSUI) కార్యకర్తలను చెదరగొట్టడానికి వాటర్ ఫిరంగులను ఉపయోగించిన పోలీసులు.

నీట్-యూజీ పేపర్ లీక్‌లో కేసులో మరో ఇద్దరి అరెస్ట్

నీట్-యూజీ పేపర్ లీక్‌లో కేసులో సీబీఐ మరో ఇద్దరి అరెస్టు చేసింది. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ సూచన మేరకు సీబీఐ రంగంలోకి దిగిన విషయం తెలిసిందే.


నీట్-యూజీ పేపర్ లీక్ కేసులో మరో ఇద్దరు వ్యక్తులను సీబీఐ అరెస్టు చేసింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రశ్నపత్రాలను జార్ఖండ్‌లోని హజారీబాగ్‌లో ఓ గదిలో భద్రపరిచింది. ఈ గదిలోంచి వీరు ప్రశ్నపత్రాన్ని దొంగిలించారు. ఈ ఇద్దరి అరెస్టుతో ఇప్పటివరకు అరెస్టయిన వారి సంఖ్య 14కు చేరుకుంది.

జంషెడ్‌పూర్‌ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజీ 2017 బ్యాచ్‌కు చెందిన సివిల్ ఇంజనీర్ పంకజ్ కుమార్ అలియాస్ ఆదిత్య, మరో వ్యక్తి బొకారో నివాసి కుమార్‌ను పాట్నాలో అరెస్టు చేశారు.

మెడికల్ ప్రవేశ పరీక్షలో జరిగిన అవకతవకలపై విచారణ జరుపుతున్న సీబీఐ ఇప్పటికే ఆరు ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేసింది. బీహార్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్ పేపర్ లీకేజీకి సంబంధించినది కాగా, అభ్యర్థులను నమ్మించి మోసం చేసినందుకు గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్రలలో ఐదు కేసులు నమోదయ్యాయి.

ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలలో MBBS, BDS, ఆయుష్, ఇతర సంబంధిత కోర్సులలో ప్రవేశాల కోసం NTA ద్వారా NEET-UG నిర్వహిస్తారు. ఈ ఏడాది మే 5న మొత్తం 4,750 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. 23 లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు.

కొన్ని లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ముడిపడి ఉన్న విషయం కావడంతో కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ సూచన మేరకు సీబీఐ రంగంలోకి దిగిన విషయం తెలిసిందే.

Read More
Next Story