ట్రంప్ మరో కీలక నిర్ణయం..‘‘ఇకపై మహిళా క్రీడలు కేవలం మహిళలకే’’
x

ట్రంప్ మరో కీలక నిర్ణయం..‘‘ఇకపై మహిళా క్రీడలు కేవలం మహిళలకే’’

నిన్న అక్రమవలసదారుల బహిష్కరణ.. నేడు ట్రాన్స్‌జెండర్లు పాల్గొనే క్రీడల్లో నిబంధనల మార్పు..రోజుకో రూల్ అమలు చేస్తూ అమెరికా అధ్యక్షుడు వార్తలో నిలుస్తున్నారు.


అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ట్రాన్స్‌జెండర్ అథ్లెట్లను (Transgender athletes) మహిళా క్రీడలలో పాల్గొనకుండా నిషేధిం విధించారు. ఈ మేరకు ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. వైట్ హౌస్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో అనేక మంది పిల్లలు, మహిళా అథ్లెట్ల సమక్షంలో ట్రంప్ ఈ ఉత్తర్వులపై సంతకం చేశారు.

బాలికలు, యువతులకు శిక్షణనిచ్చే స్పోర్ట్స్ స్కూళ్లలో ట్రాన్స్‌జెండర్లను అనుమతించొద్దని సూచించారు. ఇకపై వాళ్లతో కలిసి శిక్షణ ఇస్తే స్కూళ్లు విచారణ ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. "పురుషులు తమను తాము మహిళా అథ్లెట్లుగా ప్రకటించుకుని..అమెరికాలో జరిగే క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు కూడా రావ్వొద్దని ట్రంప్ స్పష్టం చేశారు. క్రీడల కోసం ట్రాన్స్‌జెండర్ అథ్లెట్లను అమెరికాకు వచ్చేందుకు అనుమతించవద్దని హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ డైరెక్టర్ క్రిస్టీ నోమ్‌ను ఆదేశించారు. 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌కు ముందు నిబంధనలను మార్చాలని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC)పై ఒత్తిడి తెస్తానని చెప్పారు ట్రంప్.

జన్మతహ: ‘‘మగ లేదా ఆడ’’ మాత్రమేనని, లింగ మార్పిడితో థర్డ్ జెండర్‌కు అవకాశం లేకుండా చేశారు ట్రంప్. మొత్తం మీద ట్రంప్ తాజా ఉత్తర్వులు.. ట్రాన్స్‌జెండర్ హక్కులకు భంగం కలిగించేలా ఉన్నాయి. భవిష్యత్తులోట్రంప్‌కు ట్రాన్స్‌జెండర్ల నుంచి ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో చూడాలి మరి..

Read More
Next Story