జరంగే మరాఠా కోటా దీక్షతో ముంబయివాసులకు రవాణ కష్టాలు
x

జరంగే మరాఠా కోటా దీక్షతో ముంబయివాసులకు రవాణ కష్టాలు

పోలీసులకు సెలవులు రద్దు..


Click the Play button to hear this message in audio format

OBC కింద తమ సామాజిక వర్గానికి 10 శాతం రిజర్వేషన్లు(Reservations) కల్పించాలని మరాఠా(Maratha) కోటా ఉద్యమ నాయకుడు మనోజ్ జరంగే (Jarange) ముంబై(Mumbai)లోని ఆజాద్ మైదాన్‌లో నిరవధిక నిరాహార దీక్ష(Hunger strike) చేస్తు్న్న విషయం తెలిసిందే. దీక్షలో భాగంగా రెండో రోజు (ఆగస్టు 30) ఉదయం 9.45 గంటల ప్రాంతంలో దీక్ష వేదికకు చేరుకున్న 43 ఏళ్ల జరంగేకు ఆయన మద్దతుదారులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. తొలిరోజు (ఆగస్టు 29) జల్నా జిల్లాలోని తన గ్రామం అంతర్వాలి సారథి నుంచి పాదయాత్రగా వచ్చిన జరంగేకు.. ముంబై వాషి వద్ద మద్దతుదారులు ఆయనకు స్వాగతం పలికిన విషయం తెలిసిందే.


రవాణా సేవలకు తీవ్ర అంతరాయం..

జరంగేకు మద్దతు తెలిపిపేందుకు ముంబైలోని వివిధ ప్రాంతాల నుంచి మద్దతుదారులు భారీగా తరలివచ్చారు. మెయిన్, హార్బర్ రూట్లలో లోకల్ ట్రయిన్ సర్వీసుల్లో వచ్చని వారు జరంగేకు మద్దతుగా నినాదాలు చేస్తూ ప్రయాణించారు. దీంతో కంపార్టుమెంట్లలో గందరగోళం నెలకొంది. ఈ పరిస్థితిని అంచనా వేసిన రైల్వే అధికారులు శుక్రవారం (ఆగస్టు 29) మధ్యాహ్నమే ప్రయాణికులకు ఒక సూచన చేశారు. అవసరమైతే తప్ప CSMT స్టేషన్‌ వైపుగా ప్రయాణించవచ్చని పేర్కొంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రోడ్డు, మహర్షి కార్వే మార్గ్, మెరైన్ డ్రైవ్, కల్బాదేవి రోడ్డుతో సహా ఆర్టీరియల్ రోడ్లలో ట్రాఫిక్ జామ్ అయ్యింది. బృహన్ ముంబై ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్‌పోర్ట్ (బెస్ట్) బస్సులను చివరి నిముషంలో దారి మళ్లించాల్సి వచ్చింది.


పోలీసులకు సెలవులు రద్దు..

ఒకవైపు గణేష్ ఉత్సవాలు, మరోవైపు జరంగే నిరాహార దీక్షతో జనం పడుతున్న ఇబ్బందుల దృష్ట్యా ముంబై పోలీసులకు సెలవులు రద్దు చేశారు. నగరంలో శాంతిభద్రతలను కాపాడటానికి వీలైనంత త్వరగా విధుల్లో చేరాలని సిబ్బందిని కోరామని ఒక పోలీసు ఉన్నతాధికారి చెప్పారు. CSMT, ఆజాద్ మైదాన్ వద్ద సుమారు 2వేలమంది సిబ్బందిని మోహరించారు.

Read More
Next Story