గాంధీ భవన్‌లో యూత్ కాంగ్రెస్ నేతల బాహాబాహీ
గాంధీభవన్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గాంధీభవన్‌లో నిర్వహించిన యూత్ కాంగ్రెస్ సమావేశం రసాభాసగా మారింది.
గాంధీభవన్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గాంధీభవన్‌లో నిర్వహించిన యూత్ కాంగ్రెస్ సమావేశం రసాభాసగా మారింది. యూత్ కాంగ్రెస్ నేతలంతా రెండు వర్గాలుగా విడిపోయారు. యూత్ కాంగ్రెస్‌లో పదవులు పెట్టిన చిచ్చుకారంగాణే ఈ వర్గాలు ఏర్పడ్డాయి. ఈ రెండు పక్షాలు.. బుధవారం గాంధీభవన్‌లో సమావేశం అయ్యాయి. కాగా వారి మధ్య వాగ్వాదం మొదలైంది. అది కాస్తా మరింత పెరిగి వివాదంగా అవతరించింది. ఈ క్రమంలో రెండు పక్షాలు తీవ్ర ఆగ్రహానికి గురికావడంతో వారు ఒకరిపై ఒకరు బలప్రయోగం చేసుకున్నారు. వారంతా బాహాబాహీ అయ్యారు. పార్టీలో పదవుల కోసమే ఈ తన్నులాట జరిగింది. ఇతర పార్టీల నుంచి వచ్చి కాంగ్రెస్‌లో చేరిన వారికి పదవులు ఇవ్వడంతో కాంగ్రెస్ పార్టీలోనే చాలా కాలంగా ఉన్న కొత్తగూడెం కాంగ్రెస్ నేతలకు చిర్రెత్తుకు వచ్చింది. తమకు ఇవ్వాల్సిన పదవులను నిన్నకాక మొన్న పార్టీలోకి వచ్చిన వారికి ఎలా ఇస్తారని పార్టీ పెద్దలను నిలదీశారు. ఈ క్రమంలోనే ఇరువర్గాలు సమావేశం కావడానికి నిశ్చయించుకున్నాయి. అనుకున్న ప్రకారం బుధవారం గాంధీభవన్‌లో సమావేశమయ్యాయి.
ఈ క్రమంలోనే వారి మధ్య మాటామాటా పెరిగింది. ఒకరికి వ్యతిరేకంగా మరొకరు నినాదాలు చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఇరు పక్షాల యూత్ కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్రహావేశాలకు లోనయ్యారు. అంతే ప్రత్యర్థి పక్షం నేతలపై కలబడ్డారు. దీంతో అక్కడ హైటెన్షన్ నెలకొంది. కాగా ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలు ఏమైనా ఉంటే సామరస్యంగా పరిష్కరించుకోవాలి కానీ.. ఇలా కలబడం వల్ల ఏ సమస్యా పరిష్కారం కాదని హితవు పలుకుతున్నారు. ఇటీవల నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యలయంపై దాడి విషయంలో కూడా యూత్ కాంగ్రెస్ నేతలు తీరుపై సీనియర్ నేతలు అసంతృప్తి, అసహనం వ్యక్తం చేశారు. వారిని తీరును తప్పుబట్టారు.