World Economy Forum | పెట్టుబడుల కోసం ఏపీ, తెలంగాణ సీఎంల ఆరాటం
x

World Economy Forum | పెట్టుబడుల కోసం ఏపీ, తెలంగాణ సీఎంల ఆరాటం

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో పెట్టుబడులు పెట్టేలా ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబునాయడు తమ తమ బృందాలతో దావోస్ లో ప్రయత్నాలు ప్రారంభించారు.


తెలంగాణ ముఖ్యమంత్రి ఎ రేవంత్‌రెడ్డి సారథ్యంలో తెలంగాణ రైజింగ్‌ ప్రతినిధి బృందం సోమవారం ఉదయం స్విట్జర్లాండ్​ లోని జ్యురిచ్​ విమానాశ్రయానికి చేరుకుంది. దావోస్ లో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ వార్షిక సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన ముఖ్యమంత్రి బృందానికి జ్యురిచ్ ఎయిర్ పోర్ట్ లో ప్రవాస తెలంగాణవాసులు ఘన స్వాగతం పలికారు.

- సీఎం రేవంత్ రెడ్డి వెంట రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో పాటు పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు ఉన్నారు.
- దావోస్ పర్యటనకు వచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు సారధ్యంలోని ప్రతినిధి బృందం కూడా అదే సమయంలో జ్యురిచ్ విమానాశ్రయానికి చేరుకుంది. జ్యురిచ్ ఎయిర్ పోర్టులో తెలుగు రాష్ట్రాల సీఎంలు, మంత్రులందరూ కాసేపు కలిసి ముచ్చటించుకున్నారు. రెండు రాష్ట్రాల బృందాలు ఫొటోలు దిగారు.

పెట్టుబడులు లక్ష్యంగా చర్చలు
దావోస్ సదస్సు తొలి రోజున పలువురు పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమవుతారు.అంతర్జాతీయ పెట్టుబడుల్కు గమ్య స్థానంగా తెలంగాణను ప్రపంచానికి పరిచయం చేసే నిర్దిష్టమైన భవిష్యత్తు ప్రణాళికతో దావోస్ పర్యటనపై రాష్ట్ర ప్రతినిధి బృందం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇందులో భాగంగానే భారీ పెట్టుబడుల లక్ష్యంతో పలు ప్రపంచ దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ బృందం చర్చలు జరుపుతోంది.దావోస్ సదస్సు మొదటి రోజున తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశం అయ్యారు. తెలంగాణను అంతర్జాతీయ పెట్టుబడి గమ్యస్థానంగా ప్రదర్శించడంపై రాష్ట్ర ప్రతినిధి బృందం దృష్టి సారించింది.



ఇద్దరు సీఎంల భేటీ

దావోస్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు స్విట్జర్లాండ్ లోని జ్యురిచ్ విమానాశ్రయానికి చేరుకున్న రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబునాయుడు, ఎ రేవంత్ రెడ్డిలు భేటీ అయ్యారు. రెండు రాష్ట్రాల్లో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, పెట్టుబడులపై ఇద్దరు సీఎంలు మాట్లాడుకున్నారు.



Read More
Next Story