మహిళ మృతి... వివాదంలో తాటికొండ రాజయ్య
x

మహిళ మృతి... వివాదంలో తాటికొండ రాజయ్య

స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మరో వివాదంలో ఇరుక్కున్నారు. ఓ మహిళ మృతి కేసులో ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.


స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మరో వివాదంలో ఇరుక్కున్నారు. ఓ మహిళ మృతి కేసులో ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. శనివారం రాత్రి ఆయన ప్రయాణిస్తున్న కారు ఢీకొని స్వప్న అనే మహిళ మరణించింది. కాజీపేట మండలం మడికొండలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మడికొండ ఎస్సీ కాలనీకి చెందిన కలకోట స్వప్న (40) అనే మహిళ.. వారు నివసించే ఏరియాలోనే శనివారం రాత్రి డివైడర్ మధ్య నుంచి రోడ్డు దాటుతోంది. అదే సమయంలో హైదరాబాద్ నుంచి వస్తున్న రాజయ్య కారు ఆమెని ఢీకొట్టింది. గాల్లోకి ఎగిరిపడిన స్వప్న అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.

అయితే ప్రమాదసమయంలో తాటికొండ రాజయ్య కారులోనే ఉన్నారు. యాక్సిడెంట్ అయిన వెంటనే రాజయ్య కారు దిగి స్వప్నని పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన కారుని కాజీపేట బాపూజీనగర్ లో వదిలేసి రాజయ్య వెళ్లిపోయారు. ఘటనకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఒకరి చావుకి కారణమై.. కనీసం మానవత్వం లేకుండా రాజయ్య అక్కడినుండి పారిపోయాడంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే రాజయ్యని శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

కాగా, ప్రమాద సమయంలో కారుని డ్రైవర్ నడుపుతున్నాడా? లేక రాజయ్య నడుపుతున్నాడా అనే విషయం తెలియరాలేదు. ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతురాలికి భర్త, కుమారుడు ఉన్నారు. స్వప్న మరణంతో వాయఱి కుటుంబంలో విషాదం నెలకొంది. తగిన న్యాయం చేయాలంటూ కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రెస్...

తాటికొండ రాజయ్య ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వంలో తొలి డిప్యూటీ సీఎంగా, ఆరోగ్య శాఖామంత్రిగా పదవులు చేపట్టారు తాటికొండ రాజయ్య. కానీ శాఖాపరమైన అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణల కారణంగా కేసీఆర్ ఆయనకి మంత్రిపదవులు తొలగించారు. 2018 లో మరోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కానీ ఈసారి ఆయనపై సొంత పార్టీ మహిళా సర్పంచ్ నవ్య లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. అంతేకాదు, ఆయన ఆడవారితో తప్పుగా ప్రవర్తించారని కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఈ వివాదాల నేపథ్యంలో 2023 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఆయనకి టికెట్ ఇవ్వలేదు. కనీసం ఎంపీ టికెట్ అయినా ఇస్తారేమో అని ఆశిస్తే అది కూడా దక్కలేదు. దీంతో కేసీఆర్ ని తిట్టి రేవంత్ రెడ్డిని కలిశారు. అయితే పార్లమెంటు ఎన్నికల ముందు కడియం శ్రీహరి, బీఆర్ఎస్ ఎంపీ టికెట్ తీసుకున్న కడియం కావ్య కాంగ్రెస్ లోకి జంప్ అయ్యారు. ఈ క్రమంలో యూటర్న్ తీసుకుని మళ్ళీ కేసీఆర్ తో జోడీ కట్టారు రాజయ్య. బీఆర్ఎస్ పార్లమెంటు టికెట్ అయితే దక్కలేదు కానీ ఆ పార్టీ అభ్యర్థికే ప్రచారం చేశారు. ప్రస్తుతం ఆయన బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నారు.

Read More
Next Story