‘కిరాయి అయినా కరెక్ట్‌గా కడతారా?’
x

‘కిరాయి అయినా కరెక్ట్‌గా కడతారా?’

అంగన్‌వాడీ, ఆశా వర్కర్లకు జీతాలు పెంచకపోవడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. జీతాలు పెంచడానికి గతిలేదు కానీ కోటీశ్వరులను చేస్తారా? అంటూ చురకలంటించారు.


మహిళలకు ఆర్టీసీ అద్దె బస్సులు ఇస్తామన్న కాంగ్రెస్ హీమీపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చురకలంటించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా మహిళలకు అన్యాయమే చేస్తున్నాయన్నారు. ప్రతి మహిళలకు నెలనెల రూ.2500 ఇస్తామని ఇచ్చిన హామీని రేవంత్ సర్కార్ మరిచిందని, దానిని అమలు చేసే వారకు తాము ప్రభుత్వాన్ని వెంటాడుతామని అన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామంటున్న ప్రభుత్వం అంగన్‌వాడీ, ఆశా వర్కర్లకు జీతాలు పెంచకపోవడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. జీతాలు పెంచడానికి గతిలేదు కానీ కోటీశ్వరులను చేస్తారా? అంటూ చురకలంటించారు. అంతేకాకుండా కోటీశ్వరులను ఎలా చేస్తారు అన్న అంశంపై ప్రభుత్వం ఇప్పటి వరకు నిర్ధిష్టమైన ప్రణాళిలను బహిర్గతం చేయలేదని , ప్రణాళికలు సిద్ధం చేసుంటే వాటిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు మహిళా సంఘాల ద్వారా కిరాయికి తీసుకుంటున్న బస్సులకు ఆర్టీసీ సకాలంలో కిరాయి కడుతుందో లేదో కూడా తెలిదని, ఈ విషయంలో కాంగ్రెస్ క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు కవిత.

మహిళా రిజర్వేషన్ ఇప్పటి వరకు అమలు కాలేదని, దాని వల్ల మహిళలు రాజకీయంగా తీవ్రంగా నష్టపోతున్నారన్నారు కవిత. మహిళా రిజర్వేషన్‌ను జనగణనతో ముడిపెట్టి కేంద్రం కావాలనే జాప్యం చేస్తుందన్నారామే. కేంద్ర బడ్జెట్‌లో జన గణనకు ఎందుకు నిధులు కేటాయించలేదని కవిత ప్రశ్నించారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో కవిత పాల్గొన్నారు. ఈ సందర్బంగానే మహిళలకు జరుగుతున్న అన్యాయాన్ని ఆమె లేవనెత్తారు. ప్రతి అంశంలో మహిళలకు అన్యాయం చేస్తున్నారంటూ రాష్ట్రంలోని కాంగ్రెస్, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఎండగట్టారు కవిత.

ఇప్పటికయినా కేంద్రం జనగణను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని, దాంతో పాటు మహిళా రిజర్వేషన్‌ను కూడా అమలు చేయాలని కోరారు. అప్పుడే రానున్న బీహఆర్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా నేతలకు అవకాశాలు లభిస్తాయని, మహిళలు మరింతమంది ఎమ్మెల్యేలు అవుతారని కవిత వివరించారు. మహిళా రిజర్వేషన్ అమలు ఆలస్యం కావడం వల్లే హర్యానా, ఢిల్లీ, మహారాష్ట్ర ఎన్నికల్లో మహిళా నేతలకు సరైన అవకాశాలు దక్కలేదన్నారు కవిత. పదేళ్లు అధికాంలో ఉన్న కేసీఆర్.. మహిళా కేంద్రీకృత పాలన చేశారని వెల్లడించారు కవిత. ఆయన మహిళల కోసం అనేక పథకాలు అమలు చేశారని, కార్యక్రమాలు చేపట్టారని గుర్తు చేశారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను తీసేసే దుర్మార్గపు ప్రభుత్వం ప్రస్తుతం రాష్ట్రంలో ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా, పురుషుల సమానత్వపు బొమ్మలు కేరళ ప్రభుత్వ పాఠ్యపుస్తకాల్లో ప్రచురిస్తున్నట్లే తెలంగాణలో కూడా చేయాలని కోరారు.

‘‘సమాజం ఎదగాలన్నా.. రాష్ట్రం ఎదగాలన్న మహళల పాత్ర చాలా కీలకం. వారు గణనీయమైన పాత్ర పోషిస్తారు. ప్రపంచవ్యాప్తంగా మహిళలకు సమాన హక్కులు, గౌరవం, నిర్ణయాధికారం రావాలి. అప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుంది. చిట్యాల ఐలమ్మ, రాణి రుద్రమదేవి లాంటి తెలంగాణ గడ్డపై పుట్టారు. ఇది మనకు చాలా గర్వకారణం. మహిళలకు కులమతాలు లేవు. మహిళలది ఒకే కులం. మహిళలు ఐక్యంగా ఉండి హక్కులను సాధించుకోవాలి. ఇళ్లలో మహిళలు ద్వితీయ శ్రేణు పౌరులుగా ఉంటారన్న వాదన వీగిపోవాలి. అమెరికాలో 40మంది మహిళలు ఉద్యోగాలు చేస్తుంటే మనదేశంలో మాత్రం 17శాతం మహిళలు మాత్రమే ఉద్యోగస్తులుగా ఉన్నారు. దేశంలోని 50శాతం మంది మహిళలు ఉద్యోగాలు చేస్తే భారత దేశ జీడీపీని అనతికాలంలోనే రూ.5లక్షల కోట్లకు చేర్చగలుగుతాం. కానీ మన దేశంలో ఉద్యోగాలు చేయడానికి మహిళలకు సరైన సౌకర్యాలు ఉన్నాయా అన్నది కూడా ఆలోచించాలి. భూగర్భగనులలో పనిచేయడం దగ్గర నుంచి అంతరిక్షంలోకి వెళ్లే వరకు మహిళలు ఎదిగారు. అయినా ఇప్పటికీ అనేక అవాంతరాలు, సవాళ్లు మహిళల ముందు ఉన్నాయి. వాటిని అధిగమించాలి’’ అని కవిత కోరారు.

Read More
Next Story