
ఉత్తర తెలంగాణలో బీజేపీ ఎందుకు బలం పుంజుకుంటోంది?
ప్రజలు కమలదళాన్నే ప్రత్యామ్నాయంగా చూసే అవకాశం ఉందా?
తెలంగాణలో బీజేపీ క్రమంగా బలపడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో పార్టీ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. మొన్న మూడు స్థానాలకు జరిగిన శాసనమండలి ఎన్నికల్లో మూడు స్థానాలకు రెండు గెలుచుకుని తన సత్తా చూపించింది.
రెండు ఉపాధ్యాయ నియోజకవర్గాలు, ఒక గ్రాడ్యూయేట్ నియోజక వర్గానికి ఫిబ్రవరి 27 ఓటింగ్ జరగగా, మార్చి 7 లెక్కింపు చేపట్టారు. మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్- కరీంనగర్- గ్రాడ్యూయేట్ల నియోజకవర్గం నుంచి బీజేపీ చెందిన సీహెచ్ అంజిరెడ్డి ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుచుకోగా, మాల్కా కొమురయ్య మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్- కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి గెలుపొందారు.
వరంగల్- ఖమ్మం- నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గంలోని మూడో స్థానాన్ని స్వతంత్య్ర అభ్యర్థి పింగిలి శ్రీపాల్ రెడ్డి గెలుచుకున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం చేసిన కాంగ్రెస్ పార్టీ గ్రాడ్యూయేట్ నియోజకవర్గంలో అభ్యర్థిని నిలబెట్టిన కాంగ్రెస్ ఓడిపోవడం పై కాషాయ పార్టీ సంతోషంగా ఉంది.
ఉత్తర తెలంగాణలో బలీయమైన శక్తి..
ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ లో బీజేపీకి ముగ్గురు లోక్ సభ ఎంపీలు, ఏడుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు ఉన్నారు. ఒకప్పుడు ఈ ప్రాంతం నక్సల్స్ ఉద్యమానికి కంచుకోటగా ఉండేది.
ఇప్పుడు ఇక్కడ కాషాయపార్టీ బలీయమైన శక్తిగా ఎదిగింది. అయితే ఆ పార్టీకి ఇక్కడ సంస్థాగత ఉనికి అనుకున్నంత స్థాయిలో లేదు. కానీ ప్రజలు మాత్రం బీజేపీని చాలాకాలంగా ఆదరిస్తున్నారు.
2014 నుంచి ఈ ప్రాంతంలో కమలం పార్టీ ప్రజాదరణ పొందుతోంది. ఇక్కడ పార్టీ సంస్థాగత బలం పెరగకుండా పార్టీ బలం పెరగడానికి కారణం హిందూత్వం ఎదుర్కొంటున్న సమస్యలే. ఈ ప్రాంతం నుంచి ఇంతకుముందు 1998, 1999 లో కరీంనగర్ నుంచి సీహెచ్ విద్యాసాగర్ రావు మాత్రమే గెలిచారు. మరే పార్టీ అభ్యర్థి ఇక్కడ విజయం సాధించలేదు.
ఉత్తర తెలంగాణ ప్రాంతానికి మహారాష్ట్రతో సరిహద్దులు ఉన్నాయి. గిరిజన గూడెలు, బొగ్గు గనులు, నీరుపారుదల సౌకర్యాలు కలిగిన చక్కటి వ్యవసాయ భూములతో ఆర్థికంగా పరిపుష్టంగా ఉంది. మున్నురూ కాపు, పద్మశాలి, గోల్డ్ స్మిత్ వంటి వెనకబడిన కులాలు అధికంగా ఉన్నాయి.
1970-90 దశకంలో నక్సల్స్ గ్రూపులు ఇక్కడ వ్యవసాయ, బీడీ కార్మికుల ఉద్యమాలను నిర్వహించాయి. సింగరేణీ బొగ్గు బెల్ట్ కూడా మిలిటెంట్ ట్రేడ్ యూనియన్ ఉద్యమాలకు కేంద్రంగా మారింది.
అలాగే ఇక్కడ విశ్వవిద్యాలయాలు మార్క్సిస్ట్ ఉద్యమాలకు, రాడికల్ సిద్దాంతాలను కేంద్రంగా ఉండి, ఆ పార్టీల విద్యార్థి విభాగాల ఆధీనంలోనే ఉన్నాయి. గద్దర్ విప్లవగీతాలతో పట్టణాలు, పల్లెలు మారుమోగాయి.
మార్పు ప్రారంభం..
అయితే గత మూడు దశాబ్దాలలో ఇక్కడ అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు ఇక్కడ పాత శక్తుల జాడ కూడా కనిపించడం లేదు. బీజేపీ పాలనలో ఉన్న మహారాష్ట్ర, ముంబైకి ఇక్కడ నుంచి వలసలు ఉన్నాయి.
దాంతో ఇక్కడ యువత హిందూత్వం వైపు ఆకర్షితులయ్యారు. అలాగే ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆరాధన కూడా తోడవడంతో క్రమంగా గ్రామాలకు పాకింది. తెలంగాణ మేధో వేదిక అధ్యక్షుడు డాక్టర్ బీ. కేశవులు ప్రకారం.. పార్టీ నుంచి పెద్ద ప్రయత్నం లేకుండా బీజేపీ ప్రభావం క్రమంగా కనిపిస్తోంది.
‘‘బీఆర్ఎస్ పట్ల భ్రమలు, కాంగ్రెస్ పార్టీ పాత తరహా నాయకత్వం ఓటర్లను, మరీ ముఖ్యంగా యువతను ప్రత్యామ్నాయా శక్తి కోసం వెతక వలసి వచ్చింది. మతపరంగా సున్నితమైన ప్రాంతాలు ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో ముస్లిం వ్యతిరేక ప్రసంగాలు చేయడం ద్వారా బీజేపీ ప్రజలలో భావోద్వేగాలను కలిగించగలిగింది’’ అని నిజామాబాద్ కు చెందిన మానసిక వైద్యుడు కేశవులు ‘ది ఫెడరల్’ తో చెప్పారు.
ఓబీసీ ఫ్యాక్టర్..
ఓబీసీ కార్యకర్త అయిన మానసిక వైద్యుడు మాట్లాడుతూ .. అనేక కారణాల వల్ల ఓబీసీలు కూడా బీజేపీపై వైపు ఆకర్షితులవుతున్నారని అంగీకరించారు. బండి సంజయ్ (కేంద్ర హోంశాఖ సహాయమంత్రి), ధర్మపురి అర్వింద్(నిజామాబాద్ ఎంపీ), ఈటల రాజేందర్(మల్కాజ్ గిరి ఎంపీ) లను భవిష్యత్ నాయకులుగా ప్రమోట్ చేయడంతో బీజేపీ లో ఓబీసీలో ప్రాధాన్యం ఉందని ఆ వర్గం నాయకులు అభిప్రాయపడుతున్నారు.
ఓబీసీలో పెద్ద కులమైన మున్నూరు కాపులు బండి సంజయ్ లేదా ధర్మపురి అర్వింద్ భవిష్యత్ లో ముఖ్యమంత్రులు అయ్యే అవకాశం ఉందని నమ్ముతున్నారని, ఇది కాంగ్రెస్, బీఆర్ఎస్ లో ఊహించలేమని డాక్టర్ అభిప్రాయపడ్డారు.
మరో బలమైన సామాజిక వర్గం అయిన ముదిరాజ్, తమ నాయకుడు ఈటల రాజేందర్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి అవుతారని భావిస్తున్నారు.
‘‘పద్మశాలి, స్వర్ణకారులు వంటి ఇతర ఓబీసీ కులాలు, పవిత్ర జంజనం ధరించి హిందూత్వ రాజకీయాల వైపు సానుకూలంగా ఉంటాయి. ధనిక ఓబీసీలు అగ్రకులాలతో నిండి ఉన్న బీఆర్ఎస్, కాంగ్రెస్ తో కాకుండా బీజేపీలోనే తమకు సముచిత స్థలం లభిస్తుందని చూస్తున్నారు. ’’ అని డాక్టర్ నాయకుడు అభిప్రాయపడుతున్నారు.
వామపక్ష పార్టీల అనైక్యత..
తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ కన్నెగంటి రవి మాట్లాడుతూ.. విప్లవ వామపక్ష పార్టీల మధ్య అనైక్యత, కొత్త ఆర్థిక పారిశ్రామిక విధానాల వల్ల ఉత్తర తెలంగాణలో బీజేపీ ఆవిర్భావానికి పునాది వేసిందని అన్నారు.
‘‘భూమిలేని రైతులు, బీడీ కార్మికులు, గిరిజనుల కోసం విప్లవాత్మక వామపక్ష దళాలు ఐక్య ఉద్యమాలు నిర్వహించినంత కాలం బీజేపీకి ఈ ప్రాంతంలో అసలు చోటు లేదు. కానీ 1990 దశకంలో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టడం ఈ ప్రాంతం రాజకీయ ప్రాముఖ్యతను మొత్తం మార్చివేసింది’’ అని రవి అన్నారు.
అనేక ప్రభుత్వ రంగ యూనిట్లు మూసివేశారని, విద్యను ప్రయివేట్ పరంగా చేయడంతో లక్షలాది పాఠశాలలు కొత్తగా వచ్చాయని అన్నారు.
‘‘ఇక్కడ అనేక అణచివేత విధానాలు అమలు చేశారు. నకిలీ ఎన్ కౌంటర్లను ప్రొత్సహించారు. ఈ పరిణామాలు ట్రేడ్ యూనియన్లు, విద్యార్థుల ఉద్యమాలను చంపేశాయి.
మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. నక్సల్స్ ఉద్యమాల సమయంలో గ్రామాల నుంచి పారిపోయిన భూస్వాములు స్వదేశానికి తిరిగి వచ్చి బీఆర్ఎస్ చేరారు. ఈ భూస్వాములు అంతా ఇప్పుడూ మూడుసార్లు అధికారంలో ఉన్న బీజేపీకి చూస్తున్నారు’’ అని రవి అన్నారు.
మేల్కొన్న హిందూభావాలు..
తెలంగాణ ప్రాంతం నిజాం పాలనలో క్రూరమైన అణచివేతకు గురైంది. వీరంతా హిందువూలే కావడంతో ఈ భావాలు ఇంకా నిద్రాణమైన ఉన్నాయని ఆర్ఎస్ఎస్ ప్రచారక్ పి.వేణుగోపాల్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
అతని అభిప్రాయం ప్రకారం హిందూ సంస్కృతి గురించి అవగాహన వ్యాప్తి బీఆర్ఎస్ వైఫల్యం, రాహుల్ గాంధీ నాయకత్వ లేమీ, మైనారిటీ రాజకీయాలు, వామపక్ష ఉద్యమం వంటి అంశాలలతో ఇది తెరపైకి వస్తోంది. ఉత్తర తెలంగాణలో బీజేపీ వృద్దికి ఇదే కారణం కావచ్చు.
‘‘ముస్లిం రాడికల్ గ్రూపులు చేస్తున్న ఆకృత్యాలు ఈ ప్రాంతంలో హిందువులను ఏకం చేయడానికి కారణం అవుతున్నాయి. నిర్మల్, భైంసాలో ముస్లిం గ్రూపులు పాల్పడిన అరాచకాలు తెలంగాణలోని హిందూ సమాజాన్ని ఏకం చేయడంలో కీలక పాత్ర పోషించాయి’’ అని ఆయన అన్నారు.
మహారాష్ట్ర రాజకీయాలు..
ఆర్ఎస్ఎస్ విభాగం ఏకలవ్య ఫౌండేషన్ వ్యవస్థాపక సభ్యుడు అయిన వేణుగోపాల్ రెడ్డి.. ఈ ప్రాంతంలో మహారాష్ట్ర రాజకీయ ప్రభావాన్ని తోసిపుచ్చలేదు. ‘‘మహారాష్ట్ర తో సన్నిహిత సంబంధాలు ఉన్న నిజామాబాద్, ఆదిలాబాద్, జిల్లాలు లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు అనుకూలంగా ఉన్నాయి’’ అని ఆయన అన్నారు. ఇక్కడ ప్రజలు బీజేపీని ప్రత్నామ్నాయంగా చూస్తున్నారని అన్నారు.
Next Story