కుల గణనకు 75 ప్రశ్నలు అవసరమా..? : సీపీఐ నారాయణ
x

కుల గణనకు 75 ప్రశ్నలు అవసరమా..? : సీపీఐ నారాయణ

ప్రధాని మోదీని ఉద్దేశించి సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత రాజకీయాల్లోకి మోదీ దుష్ట సంస్కృతిని తీసుకొచ్చారన్నారు.


ప్రధాని మోదీని ఉద్దేశించి సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత రాజకీయాల్లోకి మోదీ దుష్ట సంస్కృతిని తీసుకొచ్చారన్నారు. ప్రస్తుతం మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికలపైనే మోదీ ఫోకస్ అంతా ఉందని, బీజేపీ ఎంతగానో కోరకుంటున్న జమిలీ ఎన్నికల వ్యూహంలో ఈ రెండు రాష్ట్రాలు అత్యంత కీలక పాత్ర పోషించనున్నాయని నారాయణ వివరించారు. ఒకవేళ ఈ రెండు రాష్ట్రాల్లో గనుగ బీజేపీ విజయం సాధిస్తే మోదీ నెక్స్ట్ టార్గెట్ జమిలీ ఎన్నికలను పూర్తిగా అమలు చేయడమే అవుతుందని జోస్యం చెప్పారు. జమిలీ ఎన్నికలు అనేవి ఫెడరల్ వ్యవస్థకు విరుద్ధమని వెల్లడించారు. ఇటువంటి వాటిని తీసుకురావాలని మోదీ తెగ తాపత్రయపడుతున్నారని అన్నారు. జమిలీ ఎన్నికల వల్ల ఎటువంటి మేలు ఉండదని అన్నారు.

జమిలీ ఎన్నికలకు తామెప్పుడూ విరుద్ధమేనని అన్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో కాకపోయినా ఝార్ఖండ్ ఎన్నికల్లో అయినా బీజేపీ ఓడించడానికి అహర్నిశలు శ్రమిస్తామని అన్నారు. మహారాష్ట్రలో కూటమిలో భాగంగా కేవలం ఒక్క స్థానం నుంచే పోటీలోకి దిగుతున్నామని చెప్పారు. ఝార్ఖండ్‌లో మాత్రం అలా కాదని, ఒంటరిగా అన్ని స్థానాల నుంచి ఎన్నికల రణరంగంలో తలపడనున్నామని తెలిపారు. ఒకవేళ మోదీ అనుకున్నట్లే అన్నీ జరిగితే దేశంలో పాలన గాడితప్పుదుందని అభిప్రాయపడ్డారు. అందుకు ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్‌ను ఉదహరించారు. వైఎస్ జగన్ 12 సంవత్సరాలుగా బెయిల్‌పై ఉంటున్నారని, కోర్టులకు కూడా వెళ్లడం లేదని, ఇదంతా కూడా మోదీ, అమిత్ షాల సహకారంతోనే జరుగుతోందని ఆయన ఆరోపించారు.

ఈ సందర్భంగా నారాయణ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కుల గణనపై కూడా స్పందించారు. కుల గణన మంచి ఆలోచన అని అన్నారు. దీని ద్వారా సమాజంలో రాజకీయంగా, ఆర్థికంగా వెనకబడిన వారిని ప్రోత్సహించొచ్చని అన్నారు. అదే సమయంలో కుల గణనకు అధికారులు 75 ప్రశ్నలు అడగడం అవసరమా అని ప్రశ్నించారు. ఒక్క యాప్‌ను రూపొందిస్తే ఎవరి ఫామ్ వాళ్లే రూపొందిస్తారని వివరించారు. అదే సందర్భంగా ప్రజల వ్యక్తిగత ఆస్తులు, అప్పులు, బ్యాంకు లావాదేవీలతో ప్రభుత్వానికి పనేంటని నిలదీశారు. వివాదాలకు తావు లేకుండా కుల గణనను పూర్తి చేయాలని సూచించారు.

Read More
Next Story