నాగపంచమి సందర్భంగా నాగుపాములను ఏం చేశారో తెలుసా?
x
మంత్రగాళ్లు కోరలు పీకేసి బుట్టలో బంధించిన పాము

నాగపంచమి సందర్భంగా నాగుపాములను ఏం చేశారో తెలుసా?

నాగపంచమి సందర్భంగా పాములు ఆడించే మంత్రగాళ్లు అత్యంత క్రూరంగా వ్యవహరించారు...


హైదరాబాద్ నగరంలో నాగపంచమి పండుగ సందర్భంగా మంగళవారం కొందరు మంత్రగాళ్లు పాములను బుట్టల్లో బంధించి వీధుల్లో ఆడిస్తుండగా ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీ తెలంగాణ అటవీశాఖ అధికారుల బృందాలు దాడులు చేసి ఏడు నాగుపాములను సంరక్షించారు.

- నగరంలోని ఎల్ బి నగర్, చాంద్రాయణగుట్ట ప్రాంతాల్లో ఏడు నాగు పాములను స్వాధీనం చేసుకొని వాటిని నగర శివార్లలోని బౌరంపేట స్నేక్ రెస్క్యూ, రిహాబిలిటేషన్ సెంటర్‌కు తరలించామని తెలంగాణ అటవీశాఖ వన్యప్రాణి విభాగం సీనియర్ అధికారి ఎ శంకరన్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.




నాగుపాముల కోరలు పీకారు...

పాములను ఆడించే మంత్రగాళ్లు నాగుపాములను పట్టుకొని బుట్టల్లో బంధించి వాటికి పదిరోజుల నుంచి ఆహారం, నీరు అందించక పోవడంతో ఆ పాములు అనారోగ్యం బారిన పడ్డాయని, పోషకాహారం లేక అలమటిస్తున్నాయని తెలంగాణ ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీ ప్రధాన కార్యదర్శి అవినాష్ విశ్వనాథన్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ఏడు నాగు పాముల కోరలు కూడా పీకేశారని ఆయన తెలిపారు.నాగుపాములు కాటేయకుండా మంత్రగాళ్లు అత్యంత క్రూరంగా నాగుపాముల కోరలు పీకేశారని చెప్పారు.



నాగుపాములకు చికిత్స

కోరలు పీకేసి పదిరోజులుగా నాగుపాములకు ఆహారం, నీరు ఇవ్వకుండా గాలి సోకని బుట్టలు, కంటైనర్లలో ఉంచారని ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ వాలంటీర్లు చెప్పారు. నాగపంచమి సందర్భంగా పాముల మంత్రగాళ్లు కోరలు పీకేసిన పాములను ఆడిస్తూ భక్తుల నుంచి డబ్బులు వసూలు చేస్తుండగా తాము పట్టుకున్నామని వాలంటీర్లు పేర్కొన్నారు. పాములకు బౌరంపేట పునరావాస కేంద్రంలో పశువైద్యాధికారులతో చికిత్స చేపించి, పాముల ఆరోగ్యం మెరుగు పడ్డాక వాటిని అడవుల్లో వదిలివేస్తామని ఎ శంకరన్ వివరించారు.



Read More
Next Story