Harish Rao
x

మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు

Harish Rao | అదానీతో ఒప్పందాల సంగతేంటి..?

అదానీ విరాళాన్ని తిరస్కరించిన సీఎం రేవంత్.. అదానీతో చేసుకున్న ఒప్పందాలపై ఏం ఆలోచన చేశారంటూ మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు.


తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ(Skill University)కి అదానీ గ్రూప్(Adani Group) ఇచ్చిన రూ.100 కోట్ల విరాళాన్ని తిరస్కరిస్తూ సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) తీసుకున్న నిర్ణయంపై మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) స్పందించారు. విరాళాన్ని వెనక్కి ఇస్తూ నిర్ణయం తీసుకోవడం హర్షనీయమని అన్నారు. కానీ ప్రభుత్వం అదానీ చేసుకున్న రూ.12,400 కోట్ల ఒప్పందాల పరిస్థి ఏంటని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు హరీష్ రావు. రూ.100 కోట్లు తిరస్కరించగానే చేసుకున్న ఒప్పందాలని మర్చిపోతారని అనుకున్నారా? అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రేవంత్ రెడ్డి.. అదానీతో చేసుకున్న ఒప్పందాలపై కూడా అతి త్వరగా ఒక నిర్ణయం తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

‘‘యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి ఆదాని ఇచ్చిన 100 కోట్ల నిధులను వెనక్కి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న రేవంత్ రెడ్డి. మరి, రాహుల్ గాంధీ.. అదానీ అవినీతి మీద జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని నినదిస్తున్న సమయంలో దావోస్‌లో మీరు ఆదానితో చేసుకున్న రూ.12,400 కోట్ల ఒప్పందాల సంగతేమిటి? అదానీకి రాష్ట్రంలోని డిస్కంలను అప్పగించి వాటిని ప్రైవేటీకరించేందుకు మీరు చేస్తున్న కుట్రల మాటేమిటి? 20 వేల మెగావాట్ల థర్మల్ ప్లాంట్ పెడతామనే ప్రతిపాదనతో వస్తే మర్యాదపూర్వకంగా కలిసి చాయ్ తాగించి పంపించేసింది గతంలోని కేసీఆర్ ప్రభుత్వం. కానీ కాంగ్రెస్ ద్వంద్వ ప్రమాణాలు పాటించింది. రాహుల్ గాంధీ ఎవరినయియితే అవినీతి పరుడు అన్నారో ఆ వ్యక్తికే గల్లీలోని కాంగ్రెస్ రెడ్ కార్పెట్ పరిచింది. ఢిల్లీలో రాహుల్ వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ఆదానితో రేవంత్ రెడ్డి దోస్తీ చేసి ఒప్పందాలు చేసుకున్నాడు. ఇప్పుడు అదానీ అవినీతి బయటికిరాగానే మాట మార్చారు. తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం అదానీతో చేసుకున్న ఒప్పందాల‌న్నింటినీ ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేస్తున్నాం’’ అని వెల్లడించారు.

విరాళంపై రేవంత్ ఏమన్నారంటే..

‘‘అదానీ నుంచి తెలంగాణ ప్రభుత్వం నిధులు తీసుకుందని కొందరు కొన్ని రోజులుగా తెగ ప్రచారం చేస్తున్నారు. రాజ్యాంగ బద్దంగా దేశంలో ఎవరైనా, ఎక్కడైనా పెట్టుబడులు పెట్టొచ్చు. అదే విధంగా అదానీ నుంచి కూడా చట్టబద్దంగానే పెట్టుబడులను అనుమతిస్తాం. నిబంధనల మేరకే టెండర్లు పిలిచి ప్రాజెక్ట్ ఇస్తున్నాం. దేశంలో ఏ సంస్థలకైనా వ్యాపారం చేసుకునే హక్కు ఉంటుంది. అదానీ, టాటా, అంబానీ.. ఎవరికైనా తెలంగాణలో వ్యాపారం చేసుకునే హక్కు ఉంది. సీఎస్ఆర్ కింద స్కిల్స్ వర్సిటీకి అదానీ గ్రూప్ రూ.100 కోట్లు విరాళం ఇచ్చింది. దీనిని ప్రాజెక్ట్‌ల కోసం సీఎం, మంత్రులకు ఇచ్చినట్లు ప్రచారం చేస్తున్నారు. అనవసర వివాదాల్లోకి రాష్ట్ర ప్రభుత్వాన్ని లాగొద్దని వారిని హెచ్చరిస్తున్నా. తెలంగాణ ప్రభుత్వ ఖాతాల్లోకి ఎవరి నుంచీ డబ్బులు రాలేదు. గొప్ప సంకల్పంతో లక్షలాది మంది నిరుద్యోగులకు సాంకేతిక నైపుణ్యం నేర్చించాలని స్కిల్ యూనివర్సిటీని ప్రారంభించాం. సదుద్దేశంతో ప్రారంభించిన ఈ వర్సిటీని వివాదాల్లోకి లాగొద్దు’’ అని రేవంత్ అన్నారు.

Read More
Next Story