SLBC టన్నెల్‌లో మూడు రోజుల్లోగా సహాయ పనులు పూర్తి చేస్తాం
x

SLBC టన్నెల్‌లో మూడు రోజుల్లోగా సహాయ పనులు పూర్తి చేస్తాం

ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో సహాయ చర్యలను మూడురోజుల్లోగా పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ ప్రకటించారు.టన్నెల్ పనులను మరో మూడు నెలల్లో ప్రారంభిస్తామన్నారు.


శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్ఎల్ బీసీ) టన్నెల్ కూలిన ప్రాంతంలో దేశంలోనీ వివిధ విభాగాల నిష్ణాతులతో రెండు మూడు రోజుల్లో సహాయక చర్యలు పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మూడు నెలల్లో తిరిగి సోరంగ నిర్మాణ పనులు ప్రారంభించనున్నట్లు మంత్రి ప్రకటించారు.ఎస్‌ఎల్‌బీసీ క్యాంప్ కార్యాలయం వద్ద మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఈ విషయాలు వెల్లడించారు.


రైల్వే ప్లాస్మా కటింగ్ నిపుణులు
గురువారం ఉదయం దక్షిణ మధ్య రైల్వేకు చెందిన ప్లాస్మా కటింగ్ నిష్ణాతుల బృందాన్నిరప్పించి సహాయ చర్యలు వేగవంతం చేశామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.రెండు మూడు నెలల్లో ఎస్ఎల్బీసీ సొరంగ పనులను ప్రారంభించాలనేదే తన దృఢ సంకల్పం అని మంత్రి పేర్కొన్నారు. ఎస్.ఎల్.బి.సి టన్నెల్ ప్రమాద ఘటనలో టన్నెల్ లో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకు వచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం మార్గాన్వేషణను ముమ్మరం చేసినట్లు రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. టన్నెల్ లో ఉన్న నీటిని భారీ పంపులతో బయటికి పంపడం, బురదను తొలగించడం ద్వారా డీబీఎం ముందుభాగం వరకు చెరుకోనున్నట్లు తెలిపారు. డిబిఎం చివరి భాగాలను గ్యాస్ కట్టర్లు, ప్లాస్మా కట్టర్లతో తొలగించనున్నట్లు మంత్రి వివరించారు.

నిపుణుల సమన్వయంతో సహాయ పనులు వేగిరం
ఆర్మీ ,నేవీ,ఎన్డీఆర్ఎఫ్, ఎస్ డి ఆర్ ఎఫ్,బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్, ర్యాట్ మైనర్స్, దక్షిణ మధ్య రైల్వే ప్లాస్మా కట్టర్స్, రాబిన్సన్ మైనింగ్ ప్రతినిధులు, మెగా, నవయుగ, కంపెనీల బృందాలు నిరంతరం సమన్వయంతో సహాయక చర్యలు చేపడుతున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. టిబియం మిషన్, శిథిలాలను, బురదను సొరంగంలో ప్రమాద స్థలం నుంచి బయటికి తేవడం జరుగుతుందన్నారు.

వేగంగా బురదనీరు తొలగింపు
ప్రమాదం జరిగినప్పటి నుంచి రాష్ట్ర మంత్రులు నిరంతరం సహాయక చర్యలపై సమీక్షలు నిర్వహిస్తూ సహాయక కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. సహాయక చర్యలకు ఆటంకంగా మారిన బురద నీటిని తొలగించే ప్రక్రియలో మరింత స్పీడ్ పెంచామన్నారు. దేశంలోని మైనింగ్ ప్రమాదాల్లో నిష్ణాతులైన వారి సేవలను వినియోగించుకుంటూ, వారి సలహాలు సూచనలు తీసుకుంటూ సహాయక చర్యలు చేపడుతున్నట్లు వివరించారు.



Read More
Next Story