Actor Mohan Babu | మోహన్ బాబు  స్పందించకుంటే  అరెస్ట్ చేస్తాం : సీపీ
x

Actor Mohan Babu | మోహన్ బాబు స్పందించకుంటే అరెస్ట్ చేస్తాం : సీపీ

మోహన్ బాబుపై మూడు కేసులు నమోదు చేశామని రాచకొండ పోలీసు కమిషనర్ సుధీర్ బాబు చెప్పారు.ఈ కేసుల్లో నోటీసులపై స్పందించ కుంటే అరెస్ట్ చేస్తామని సీపీ పేర్కొన్నారు.


సినీనటుడు మోహన్ బాబుపై రాచకొండ పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు.జర్నలిస్టుపై దాడి కేసులో హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో బెయిలు కోసం మోహన్ బాబు కోర్టును ఆశ్రయించగా కోర్టు బెయిలు ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ కేసుల్లో మోహన్ బాబును అరెస్టు చేయడంలో జాప్యం లేదని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు స్పష్టం చేశారు. ఆయనపై నమోదు చేసిన మూడు కేసుల్లో ప్రస్తుతం విచారణ కొనసాగుతోందని, ఈ కేసులో తదుపరి ఎలా వెళ్లాలనే దానిపై చట్టపరమైన మార్గాలను అన్వేషిస్తున్నామని సీపీ చెప్పారు.

- మోహన్‌బాబును విచారించేందుకు మెడికల్‌ సర్టిఫికెట్‌ కావాలని, ఇప్పటికే నోటీసులు జారీ చేశామని సీపీ తెలిపారు. మోహన్ బాబు డిసెంబర్ 24 వరకు సమయం కోరారని సీపీ తెలిపారు.కోర్టు కూడా డిసెంబరు 24 వరకు సమయమిచ్చిందని చెప్పారు.
- మంచు విష్ణు, మంచు మనోజ్ ల నుంచి ఇప్పటికే బాండ్ పేపర్లు తీసుకున్నామని, వారు శాంతిభద్రతలకు విఘాతం కలిగించరని హామీ ఇచ్చారని సీపీ తెలిపారు. డిసెంబర్ 24వతేదీ లోపు తాము జారీ చేసిన నోటీసులకు మోహన్ బాబు స్పందించకపోతే, అరెస్ట్ చేస్తామని సుధీర్ బాబు వివరించారు.

అంతర్రాష్ట్ర డ్రగ్‌ పెడ్లింగ్ రాకెట్ గుట్టు రట్టు
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని నీముచ్ నుంచి హైదరాబాద్ నగరానికి 1.2 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ ను రవాణ చేస్తుండగా ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. 53.5 కిలోల గసగసాల గడ్డి,నిషిద్ధమందును హైదరాబాద్ లో విక్రయించేందుకు తీసుకువస్తుండగా పట్టుకున్నామని రాచకొండ సీపీ సుధీర్ బాబు చెప్పారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశామని సీపీ వివరించారు.


Read More
Next Story