మంచు మనోజ్‌కు షాకిచ్చిన హాస్టల్ యాజమాన్యాలు
x

మంచు మనోజ్‌కు షాకిచ్చిన హాస్టల్ యాజమాన్యాలు

మంచు ఫ్యామిలీ మంటలు ఇంకా చల్లారలేదు. ప్రతి రోజూ ఏదో ఒక విషయంపై వారు వార్తల్లో నిలుస్తున్నారు.


మంచు ఫ్యామిలీ మంటలు ఇంకా చల్లారలేదు. ప్రతి రోజూ ఏదో ఒక విషయంపై వారు వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా మరోసారి మంచు కుటుంబం వివాదం కీలకంగా మారింది. తిరుపతిలోని మోహన్ బాబు కాలేజీ హాస్టల్ యాజమాన్యులు మనోజ్‌కు లేఖ రాశారు. తమకు ఎన్నో సమస్యలు ఉన్నట్లు మనోజ్ మాట్లాడుతున్నారని, కానీ తమకు ఎటువంటి సమస్యలు లేవని తెలిపారు. ఒకవేళ ఏమైనా సమస్యలు ఉంటే మోహన్ బాబు, మంచు విష్ణుతో చర్చించి సామరస్యంగా పరిష్కరించుకుంటామని చెప్పారు. మాకు సమస్యలు ఉన్నట్లు, వాటిని మీకు చెప్పుకున్నట్లు మీరు మాట్లాడుతున్నారని, అంత అవసరం లేదన్న తరహాలో హాస్టర్ యాజమన్యులు తమ లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖ ప్రస్తుతం వైరల్ అవుతోంది. విద్యార్థులకు తన పూర్తి మద్దతు ఇస్తానని, విద్యార్థులకు న్యాయం జరిగేలా చూస్తానన్న మనోజ్‌కు ఇది పెద్ద షాక్ తగిలినట్లయింది.

‘‘మోహన్ బాబు స్థాపించిన విద్యాసంస్థల వల్లే ఈ ప్రాంతంలో భూములు అభివృద్ధి చెందాయి. పండగ రోజు మీరు విశ్వవిద్యాలయాల గేటును తన్నటం చూసి ఆశ్చర్యపోయాం. ఎంతో మందికి ఉద్యోగాలను అందించిన విశ్వవిద్యాలయం ఇది. మనోజ్ మీ స్వార్థం కోసం మా బతుకులతో ఆడుకోకండి. మమ్మల్ని రోడ్డున పడేయకండి. మీకు, మీ కుటుంబసభ్యులకు సమస్యలు ఉంటే మీరు పరిష్కరించుకోవాలి. మా సమస్యలను మీకు చెప్పుకున్నట్లు మీడియాలో ప్రచారం చేయడం సరికాదు. మనోజ్ చెప్పింది పచ్చి అబద్దం. అత్యంత దారుణం’’ అంటూ ఏ రంగంపేట, సాయినాథ్ పరైవేట్ హాస్టల్స్ యాజమాన్యం తన లేఖలో తెలిపింది. ఈ లేఖపై తిరుపతిలోని 39 హాస్టల్స్ ప్రతినిధులు సంతకాలు చేశారు.

అయితే కొన్నాళ్లుగా ఎక్కడ మీడియాతో మాట్లాడినా తిరుపతిలోని మోహన్‌బాబు విద్యాసంస్థల్లో విద్యార్థులకు తీవ్ర సమస్యలు ఉన్నాయని మనోజ్ చెప్తున్నారు. తిరుపతి చుట్టుపక్కల ఉన్న హాస్టర్ యాజమానులు విద్యార్థులను దోచుకుంటున్నారని, భారీగా ఫీజులు వసూలు చేస్తున్నారని, తినడానికి వీలులేనంత అద్వానమైన భోజనం పెడుతున్నారని మనోజ్ పలుసార్లు అన్నారు. హాస్టల్స్‌తో యూనివర్సిటీ యాజమన్యం కుమ్మక్కై విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నాయని, ఈ దోపిడీని నిలదీయాలని మనోజ్ అంటున్నారు. కానీ మనోజ్ మాటలన్నీ అబద్ధాలేనని హాస్టళ్ల యాజమాన్యాలు అంటున్నాయి.

Read More
Next Story