KTR | ‘కేంద్ర బడ్జెట్‌ నిరాశే మిగిల్చింది’
x

KTR | ‘కేంద్ర బడ్జెట్‌ నిరాశే మిగిల్చింది’

వచ్చే ఆర్థిక సంవత్సరం (2025-2026)కు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై మిశ్రమ స్పందన వస్తోంది.


వచ్చే ఆర్థిక సంవత్సరం (2025-2026)కు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై మిశ్రమ స్పందన వస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్రం మొండి చెయ్యే చూపిందని, ఆంధ్రప్రదేశ్‌కు కంటితుడుపు చర్యగా 22,981కోట్లు మాత్రమే విడుదల చేసినట్లు కేంద్రం తెలిపింది. ఇది మొత్తం బడ్జెట్ అయిన రూ.50.65లక్షల కోట్లలో 0.45శాతం మాత్రమే కావడం గమనార్హం. ఇదిలా ఉంటే మరోవైపు ఆర్థికవేత్తలు కూడా ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్ చేసి పెదవి విరుస్తున్నారు. ఇందులో కొత్తగా ఏమీ లేదని, ఎప్పటిలానే ఉందని అంటున్నారు. మధ్యతరగతి వాడిని పేదవాడిగా మర్చు ప్రయత్నాన్ని నిర్మలమ్మ చాలా అందంగా, గొప్ప పనిలా చెప్పిందని కొందరు విశ్లేషకులు వ్యంగ్యాస్త్రాలు కూడా సంధిస్తున్నారు. అందుకు ఇన్‌కమ్ ట్యాక్స్‌ సవరణ కారణమని చెప్తున్నారు.

నెలసరి జీతాల వారికి రూ.12 లక్షల వరకు సున్నా పన్ను విధించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. దాంతో పాటుగా మరో రూ.75వేలను స్టాండర్డ్ డిడక్షన్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అంతకన్నా ఆదాయం పెరిగితేనే పన్ను వేయనున్నట్లు తెలిపారు. దీనిని మధ్యతరగతిని ఆదుకోవడం కోసమే తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంగా నిర్మలమ్మ వెల్లడించారు. ఈ నిర్ణయంపై కొందరు రాజకీయ నాయకులు, ప్రజలు ఎనలేని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కానీ కొందరు ఆర్దికవేత్తలు మాత్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం రూ.12లక్షల వరకు సున్నా వడ్డీ అని చెప్తున్నా.. అసలు సున్నా వడ్డి ఇస్తున్నది కేవలం రూ.4 లక్షల వరకు ఆదాయానికేనని వివరిస్తున్నారు.

కేంద్రం చెప్పినట్లు రూ.12లక్షల వార్షిక ఆదాయం వరకు సున్నా వడ్డీ. అయితే ఇందులోనే రీబేట్ అంశాలు కూడా కలిసి ఉంటాయి. అంటే ఉద్యోగికి వాళ్ల సంస్థ ఇస్తున్న శాలరీలో.. రెంట్ అలవెన్స్, ట్రావెలింగ్ అలవెన్స్ వంటివి మరికొన్ని కూడా కలిసి ఉంటాయి. వాటన్నింటిని కలుపుకుని ఏడాది మీ ఆదాయం రూ.12లక్షల లోపు ఉంటే.. వడ్డీ ఏమీ ఉండదు. అలా కాకుండా మీకు వస్తున్న జీతంలో ప్రతి నెలా కొంత అని ఏడాది ఒక లక్ష రూపాయల చొప్పున సేవింగ్స్ చేసినా సరే.. మీకు ట్యాక్స్ స్లాబ్ మారిపోతుంది. పన్ను పడిపోతుందని పలువురు విశ్లేషకులు వివరిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. కేంద్రం బడ్జెట్‌పై మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాస్తంత ఘాటుగానే స్పందించారు. తెలంగాణకు కేంద్ర బడ్జెట్ తీవ్ర నిరాశే మిగిల్చిందని అన్నారు. ‘‘తెలంగాణకు కేంద్ర బడ్జెట్‌లో మళ్లీ ఏమాత్రం ప్రయోజనం లభించలేదు. ఈ బడ్జెట్‌పై భారీ ఆశలు పెట్టుకున్న రాష్ట్ర ప్రజలకు ఇది తీవ్ర నిరాశను మిగిల్చింది. దేశవ్యాప్తంగా సమతుల్యంగా నిధులు కేటాయించాల్సిన కేంద్రం, బడ్జెట్ దృష్టిని ఢిల్లీ, బీహార్ ఎన్నికల వైపే మళ్లించినట్టు కనిపిస్తోంది. తెలంగాణకు తప్పనిసరి ఆర్థిక పంపిణీలు, కేంద్ర సహాయ నిధులు తప్ప ప్రత్యేకంగా ఏ సహాయమూ రాలేదు. 2014 ఏపీ విభజన చట్టంలో పేర్కొన్న గిరిజన విశ్వవిద్యాలయానికి నిధుల కేటాయింపుపై కూడా కేంద్ర ప్రభుత్వం మౌనంగా ఉంది. 8+8 మళ్లీ శూన్యంగా మారడం దురదృష్టకరం. కాంగ్రెస్ నుంచి 8 మంది, బీజేపీ నుంచి 8 మంది ఎంపీలను గెలిపించినా, ఒక్క ప్రత్యేక ప్రాజెక్ట్ అయినా, ఏదైనా ముఖ్యమైన డిమాండ్ అయినా సాధించలేకపోయారు. అలా అయితే వారిని ఎన్నుకోవడం వల్ల ప్రయోజనం ఏమిటి?’’ అని ప్రశ్నించారు.

Read More
Next Story