UNICEF Appreciates Collector | కలెక్టర్ పమేలాకు యునిసెఫ్ అభినందన
కరీంనగర్ లో పారిశుద్ధ్య కార్మికులకు 100 శాతం బీమా, ఆరోగ్య కార్డుల పంపిణీ లాంటి వినూత్న కార్యక్రమాలు చేపట్టిన కలెక్టర్ పమేలా సత్పతికి యునిసెఫ్ అభినందించింది.
తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలో కలెక్టరు పమేలా సత్పతి చేపడుతున్న వినూత్న కార్యక్రమాలను యునిసెఫ్ అభినందించింది.పారిశుద్ధ్య కార్మికులకు వంద శాతం బీమా సౌకర్యం కల్పించడంతోపాటు వారికి ఆరోగ్య కార్డులను కలెక్టర్ అందించారు. పారిశుద్ధ్య కార్మికులకు రక్షణ పరికరాలను అందించారు.
- కరీంనగర్ జిల్లాలో పారిశుద్ధ్య పనుల రక్షణ, భద్రత, గౌరవం కోసం ప్రత్యేక శ్రద్ధతో వినూత్న కార్యక్రమాలను ప్రారంభించినందుకు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతిని యునిసెఫ్ అభినందించింది.
- ఈ మేరకు యునిసెఫ్ కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతికి లేఖ రాసింది.మూడు రాష్ట్రాల ఫీల్డ్ ఆఫీస్ చీఫ్ జెలాలెం బర్‌హాను టాఫెస్సీ సంతకంతో కూడిన లేఖను శుక్రవారం కరీంనగర్ క్యాంపు కార్యాలయంలో సంస్థ స్టేట్ వాష్ స్పెషలిస్ట్ వెంకటేష్ కలెక్టర్‌కు అందజేశారు.
పారిశుద్ధ్య కార్మికులను సన్మానించి, సత్కరిస్తూ కలెక్టర్ ప్రోత్సహిస్తున్నారని యునిసెఫ్ లేఖలో పేర్కొంది.పారిశుద్ధ్య కార్మికులకు వివిధ సౌకర్యాలు కల్పించడంతో పాటు కంటి పరీక్షలు, ఆపరేషన్లు, దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్స వంటి వైద్య సహాయం కూడా అందించారు.
పారిశుద్ధ్య కార్మికుల రక్షణ కోసం...
పారిశుద్ధ్య కార్మికులకు 100శాతం బీమా కవరేజీని అందించారు. ఆరోగ్య తనిఖీ ఆరోగ్య కార్డ్‌లను పంపిణీ చేశారు.సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించారు.కంటి పరీక్షలు, శస్త్రచికిత్సలు, దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్సతో సహా అవసరమైన సౌకర్యాలను అందించారు.
ఎన్నెన్నో కార్యక్రమాలు
- పోషణ్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ జిల్లాను పోషకాహార లోపం లేని జిల్లాగా తీర్చిదిద్దేందుకు కలెక్టర్ పమేలా సత్పతి చర్యలు చేపట్టారు. పోషణ లోపంతో ఉన్న పిల్లలను గుర్తించి వారికి మునగ, కరివేపాకు, నిమ్మ వంటి ఆహారాన్ని అందించనున్నారు.
-బాల్యవివాహాలు చేస్తే కుటుంబ సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టరు అధికారులను ఆదేశించారు. బాల్య వివాహ్ ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా బాల్య వివాహాల నివారణకు కలెక్టర్ చర్యలు చేపట్టారు.
- కరీంనగర్ జిల్లాల్లో వినూత్న కార్యక్రమాలు చేపట్టారు, విద్యార్థులకు బూట్లు, సాక్సులు అందించారు.జిల్లాలో మూతపడిన సైన్స్ మ్యూజియాన్ని కలెక్టర్ తెరిపించారు.
- మహిళలు, శిశువుల ఆరోగ్య సంరక్షణ కోసం కలెక్టర్ పమేలా సత్పతి చర్యలు తీసుకున్నారు.
UNICEF Praises Karimnagar @Collector_KNR#UNICEF has lauded Karimnagar District Collector @PamelaSatpathy Satpathy, IAS, through a letter handed over today by UNICEF State WASH Specialist Venkatesh.
— Jacob Ross (@JacobBhoompag) December 27, 2024
The District Collector, who has initiated several special programs in the… pic.twitter.com/q1pzwmRGmp
Next Story