ఈ రూట్లలో వెళ్లేవారికి అలర్ట్.. ఈరోజు, రేపు ట్రాఫిక్ ఆంక్షలు
x

ఈ రూట్లలో వెళ్లేవారికి అలర్ట్.. ఈరోజు, రేపు ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్ లో మంగళవారం సాయంత్రం నుండి బుధవారం వరకు ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు పెడుతున్నట్టు సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.


హైదరాబాద్ లో మంగళవారం సాయంత్రం నుండి బుధవారం వరకు ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించనున్నారు. ఈరోజు, రేపు నగరంలో పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు పెడుతున్నట్టు సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. లోక్ సభ ఎన్నికల్లో భాగంగా పీఎం మోదీ మంగళవారం హైదరాబాద్ లో పర్యటించనున్నారు. రాత్రి 8:35 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని.. అక్కడి నుంచి రాజ్ భవన్ కి వెళతారు

ఈ క్రమంలో మంగళవారం రాత్రి 7:50 గంటల నుండి 8:25 వరకు బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి పీఎన్టీ ఫ్లైఓవర్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, మోనప్ప ఐలాండ్, రాజ్ భవన్ వరకు వాహనాలను అనుమతించట్లేదని సీపీ చెప్పారు. అలాగే బుధవారం ఉదయం 8:35 గంటలకు మోదీ రాజ్ భవన్ నుంచి బేగంపేట ఎయిర్పోర్ట్ కి వెళతారు. ఈ సందర్భంగా ఉదయం 8:35 గంటల నుండి 9:10 గంటల వరకు రాజ్ భవన్, మోనప్ప ఐలాండ్ నుంచి బేగంపేట్ విమానాశ్రయం వరకు సాధారణ వాహనాలను అనుమతించమని సీపీ వెల్లడించారు. ఆ రూట్లలో ప్రయాణించేవారు ఆల్టర్నేటివ్ రూట్స్ లో వెళ్లాలని సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి కోరారు.

Read More
Next Story