ఆటంకం లేకుండా గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు.. ఎంతమంది హాజరయ్యారంటే..
x

ఆటంకం లేకుండా గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు.. ఎంతమంది హాజరయ్యారంటే..

తెలంగాణ గ్రూప్-1 పరీక్షలు అనుకున్న విధంగానే ఫిక్స్‌డ్ షెడ్యూల్‌కు జరుగుతున్నాయి. పరీక్ష వాయిదా విషయంలో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు కూడా తేల్చి చెప్పేసింది.


తెలంగాణ గ్రూప్-1 పరీక్షలు అనుకున్న విధంగానే ఫిక్స్‌డ్ షెడ్యూల్‌కు జరుగుతున్నాయి. పరీక్ష వాయిదా విషయంలో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు కూడా తేల్చి చెప్పేసింది. పరీక్షల ఫలితాలు వచ్చే లోపు ఈ విషక్ష్ంలో తిది తీర్పు తీసుకోవాలని హైకోర్టును కూడా ఆదేశించింది. పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాటు పూర్తి చేసిన తెలంగాణ ప్రభుత్వం.. ఈరోజు మధ్యాహ్నం 1:30 నిమిషాల వరకు అభ్యర్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించారు అధికారులు. ఇక్కడ కూడా నిమిషం లేట్ రూల్‌ను అమలు చేశారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించకపోవడంతో పలు పరీక్ష కేంద్రాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

నేటి నుంచి అక్టోబర్ 27 వరకు ఈ మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 563 పోస్టులు ఉండగా.. 31, 383 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. ఈ క్రమంలో టీజీపీఎస్సీ.. గ్రూప్-1 అబ్యర్థులకు పలు సూచనలు జారీ చేసింది. రోజుకో హాల్‌టికెట్‌తో అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు రావొద్దని సూచించింది. తొలి రోజు తీసుకొచ్చిన హాల్‌టికెట్‌నే మిగిలిన పరీక్షలకు కూడా తీసుకురావాలని తెలిపింది. ఈ విషయంలో సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయంపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. సుప్రీం నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నట్లు వెల్లడించారు.

సుప్రీం నిర్ణయం హర్షనీయం..

‘‘గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల విషయంలో సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. తెలంగాణ యువతకు మంచి ఉన్నత ఉద్యోగాలు ఇవ్వాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ తపన. ఇందుకు హైకోర్టు, సుప్రీంకోర్టు నిర్ణయాలు కూడా కలిసి వచ్చాయి. అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతో అభ్యర్థులందరూ కూడా సంతోషంగా పరీక్షలు రాయాలి. పూర్తి ఏకాగ్రతతో పరీక్షపైనే ఫోకస్ పెట్టండి. 13 ఏళ్ల తర్వాత అభ్యర్థులకు ఒక మంచి అవకాశం వచ్చింది. దీనిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, ఉన్నత పదవులు అందుకోవాలని ఆకాంక్షిస్తున్నాను’’ అని ఆయన అన్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రంలో కొంత కాలంగా గ్రూప్-1 మెయిన్స్‌కు సంబంధించి జరుగుతున్న నిరసనలు, ఆందోళనలు, అల్లర్లపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కొందరు తమ రాజకీయ లబ్ధి కోసం అభ్యర్థులను రెచ్చగొట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉసిగొల్పారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

మొదటి నుంచి అండగానే ఉన్నాం..

‘‘గ్రూప్-1 అభ్యర్థులకు కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి అండగానే ఉంది. ఇదే విషయాన్ని నేను, మా నేతలు అందరం కూడా చెప్తూనే ఉన్నాం. జీవో 29 వల్ల రిజర్వేషన్ అభ్యర్థులకు ఎటువంటి అన్యాయం జరగదని మరోసారి గుర్తు చేస్తున్నా. నేను బీసీ బిడ్డగా అభ్యర్థులకు భరోసా ఇస్తున్నా. రిజర్వేషన్లు పొందే వారికి అన్యాయం జరగదు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు వారి స్వార్థ రాజకీయాల కోసం వీరిని పావుగా వాడుకుంటుంది. మీరు ఎలాంటి ఆందోళన లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాసి భవిష్యత్తుకు బంగారు బాట వేసుకోవాలి. పరీక్షలు రాస్తున్న ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు’’ అని చెప్పుకొచ్చారాయన.

Read More
Next Story