
పులుల దినోత్సవ వేళ పులుల సంరక్షకులకు ‘టైగర్’ అవార్డులు
అడవుల్లో పులుల సంతతి పెంచేందుకు అటవీ అధికారుల విశేష కృషి
గ్లోబల్ టైగర్ డే 2025లో భాగంగా పులుల పరిరక్షణ కోసం విశేష కృషి చేసిన అటవీశాఖ అధికారులకు టైగర్ డే (Tiger Day Awards) అవార్డులను అందజేశారు.టైగర్ ట్రాకింగ్, అగ్గి నుంచి అడవుల రక్షణ, పులుల ఆవాసాల మెరుగుదలకు సమర్ధంగా పనిచేసిన ఉత్తమ బీట్ ఆఫీసర్లు, సెక్షన్ ఆఫీసర్లు, బేస్‌క్యాంప్ వాచర్లకు ప్రశంసా పత్రాలు, నగదు అవార్డులను అందజేశారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌కు చెందిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎండీ.ఖాదర్ పాషా నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ నుంచి వైల్డ్‌లైఫ్ హాబిటాట్ మేనేజ్‌మెంట్ విభాగంలో విశిష్ఠ జాతీయ అవార్డును అందుకున్నారు. ఫారెస్ట్ రేంజి ఆఫీసర్లు కె ఈశ్వర్, ఎన్ వీరేష్ లు పులుల వేటను సమర్ధంగా నిరోధించి అవార్డులు పొందారు. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పి కిరణ్ కుమార్, ఎన్ రమేష్, జి అనుషా, మండ్లీ బయ్యన్నలకు అవార్డులను ప్రదానం చేశారు.
పులుల దినోత్సవ వేళ ‘ధృవ’ దత్తత
రూ.3లక్షల చెక్కు ప్రదానం