Mee Ticket | టికెట్ ఏదైనా యాప్ ఒక్కటే ‘మీ టికెట్’
x

Mee Ticket | టికెట్ ఏదైనా యాప్ ఒక్కటే ‘మీ టికెట్’

తెలంగాణ ప్రజలకు శుభవార్త.టికెట్ ఏదైనా ‘మీ టికెట్ ’ యాప్ ఒక్కటీ మీ దగ్గరుంటే చాలు.ఆర్టీసీ, మెట్రో టికెట్లు,ఆలయాల దర్శనం ఎంట్రీ టికెట్లు పొందవచ్చు.


తెలంగాణ రాష్ట్రంలో టికెట్ ఏదైనా యాప్ ఒక్కటే...‘మీ టికెట్’యాప్ అందుబాటులోకి వచ్చింది. తెలంగాణ డిపార్ట్ మెంట్ ఆఫ్ ఎలక్ర్టానిక్స్ సర్వీసెస్ డెలివరీ రూపొందించిన ఈ ‘మీ టికెట్’ యాప్ ను ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు గురువారం సచివాలయంలో లాంఛనంగా ప్రారంభించారు.(citizens of Telangana)

- ఆర్టీసీ, మెట్రో టికెట్లు, (RTC or Metro tickets) తెలంగాణలోని అన్ని ప్రముఖ దేవాలయాల్లో దర్శనం(entry to prominent temples), ఇతర సేవలకు సంబంధించిన టికెట్లు,పార్కులు,ఇతర పర్యాటక స్థలాల్లో క్యూలైన్లలో నిరీక్షించాల్సిన అవసరం లేకుండా ఎంట్రీ టికెట్లను ఒకే ఒక్క క్లిక్ తో మీసేవ రూపొందించిన టికెట్ యాప్ లో బుక్ చేసుకోవచ్చు.

ప్రజలకు సుపరిపాలన అందించేందుకు...

‘‘ప్రజలకు సుపరిపాలన అందించాలన్నదే సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం లక్ష్యం. టెక్నాలజీ సాయంతో పౌర సేవలను ప్రజల ముంగిటకు చేరవేస్తున్నాం. ఈ ప్రక్రియలో సంబంధిత నిపుణులను భాగస్వామ్యం చేస్తున్నాం. అన్ని రకాల టికెట్ బుకింగ్స్ ను ఒకే ప్లాట్ ఫాంపైకి తెచ్చేందుకు వీలుగా ఈ యాప్ ను రూపొందించాం. రాబోయే రోజుల్లో ఇలాంటి తరహా యాప్ లను మరిన్ని అందుబాటులోకి తీసుకొస్తాం’’ అని మంత్రి శ్రీ వివరించారు.

ఈ యాప్ లో ఏమున్నాయంటే...

‘ఈ యాప్ లో తెలంగాణలోని 15 ప్రముఖ దేవాలయాలు, 129 పార్కులు, 54 బోటింగ్ ప్రదేశాలు, జూ, మెట్రో, ఆర్టీసీ, మ్యూజియాలు, ప్లే అండ్ ఎంటర్ టైన్ మెంట్ జోన్స్ కు సంబంధించిన టికెట్లను తీసుకోవచ్చు. జీహెచ్ఎంసీ పరిధిలోని కమ్యూనిటీ హాళ్లు, జిమ్ లు, స్పోర్ట్ కాంప్లెక్స్ లను బుకింగ్ చేసుకోవచ్చు. మీరు ఎంచుకున్న లొకేషన్ కు సమీప ప్రాంతాల్లో చూడదగిన ప్రదేశాలుంటే.. ఆ సమాచారం కూడా యాప్ లో ఆటోమేటిక్ గా కనిపిస్తుంది.

- ఈ యాప్ ను చాలా సులువుగా వినియోగించుకోవచ్చు. యూపీఐ ద్వారా చెల్లింపులు చేయొచ్చు. ఇతర ప్లాట్ ఫాంల మాదిరిగా ఈ యాప్ లో అదనంగా ఎలాంటి ఛార్జీలను వసూలు చేయమని మీ సేవ కమిషనర్ రవి కిరణ్ చెప్పారు.

Read More
Next Story