గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్... TGSRTC గుడ్ న్యూస్..
x

గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్... TGSRTC గుడ్ న్యూస్..

ఆదివారం గ్రూప్‌-1 ప్రిలిమనరీ పరీక్ష జరగనున్న నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ కీలక ప్రకటన చేసింది. పరీక్ష రాసే అభ్యర్థుల సౌకర్యార్థం TGSRTC ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది.


తెలంగాణలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 9న (ఆదివారం) 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరగనున్న గ్రూప్ 1 పరీక్షకు సర్వం సిద్ధం చేసినట్టు టీజీపీఎస్సీ తెలిపింది. ఓఎంఆర్ పద్ధతిలో నిర్వహించే ఈ -పరీక్ష కోసం అందుకు అనుగుణంగా పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల మంది అభ్యర్థుల కోసం 897 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.

అత్యధికంగా మేడ్చల్ - ముల్కాజిగిరి జిల్లాలోనే 105 కేంద్రాలున్నాయి. ఉదయం 9గంటల నుంచి అభ్య ర్థులను కేంద్రాల్లోకి అనుమతిస్తామని కమిషన్ వెల్లడించింది. పరీక్ష ప్రారంభానికి అరగంట ముందు అంటే ఉదయం 10 గంటల తర్వాత గేట్లు మూసేస్తామని, ఆ తర్వాత అనుమతి ఉండదని స్పష్టం చేసింది. అభ్యర్థులంతా హాల్ టికెట్ పై గత మూడు నెలల్లో తీసుకున్న పాస్ పోర్ట్ ఫొటో అంటించాలని, హాల్ టికెట్ తోపాటు ఒరిజినల్ ఫొటో గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి తీసుకురావాలని తెలిపింది.

అభ్యర్థులంతా బయోమెట్రిక్ తప్పనిసరి ఇవ్వాలని, బయోమెట్రిక్ ఇవ్వని అభ్యర్థుల జవాబు పత్రాలను కౌంట్ చేయమని టీజీపీఎస్సీ పేర్కొంది. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలో అభ్యర్థులు పాటించాల్సిన సూచనలపై ప్రతిరోజూ అభ్యర్థులకు కమిషన్ ఇప్పటికే మెసేజెస్ రూపంలో అలర్ట్ చేస్తోంది. హాల్ టికెట్, ప్రశ్నపత్రంపై ఉన్న సూచనలు పాటించాలని తెలిపింది.

కాగా, పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు జిల్లా అదనపు కలెక్టర్లతో పాటు ఒక పోలీసు ఉన్నతాధికారిని కూడా నోడల్ ఆఫీసర్ గా నియమించినట్లు కమిషన్ వెల్లడించింది. ప్రతి 20 కేంద్రాలకు ఒక రీజినల్ కో ఆర్డినేటర్ను నియమించినట్లు తెలిపింది. బయోమెట్రిక్ పై ఇన్విజిలేటర్లకు ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు తగిన సంఖ్యలో పరికరాలను అందుబాటులో ఉంచినట్లు కమిషన్ చెప్పింది.

అభ్యర్థులకు TGSRTC గుడ్ న్యూస్..

ఆదివారం గ్రూప్‌-1 ప్రిలిమనరీ పరీక్ష జరగనున్న నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ కీలక ప్రకటన చేసింది. పరీక్ష రాసే అభ్యర్థుల సౌకర్యార్థం TGSRTC ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని, రవాణా పరంగా ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్ ద్వారా తెలిపారు.

గ్రూప్‌-1 ప్రిలిమనరీ పరీక్ష రాసే అభ్యర్థుల సౌకర్యార్థం #TGSRTC ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. అభ్యర్థులకు ఆదివారం రవాణాపరంగా అసౌకర్యం కలగకుండా ప్రత్యేక బస్సులను నడుపుతోంది. రాష్ట్రంలోని 897 పరీక్షా కేంద్రాలకు బస్సులను నడపాలని క్షేత్రస్థాయి ఆర్టీసీ అధికారులకు ఇప్పటికే సంస్థ యాజమాన్యం ఆదేశాల్విడం జరిగింది. రాజధాని హైదరాబాద్‌ నుంచి జిల్లాలకు ఈ రోజు సాయంత్రం నుంచే అభ్యర్థుల రద్దీ ఎక్కువగా ఉన్నందున.. ఎంజీబీఎస్‌, జేబీఎస్‌, ఉప్పల్‌, ఎల్బీనగర్‌, ఆరాంఘర్‌ పాయింట్లలో తగు ఏర్పాట్లును సంస్థ చేసింది. ఆయా ట్రాఫిక్‌ జనరేటింగ్‌ పాయింట్లలో ప్రత్యేక అధికారులను నియమించడం జరిగింది. రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులను వారు అందుబాటులో ఉంచుతారు. రాష్ట్రంలోని ప్రధాన బస్‌ స్టేషన్లలో 'May I Help You' కౌంటర్లను సంస్థ ఏర్పాటు చేసింది. అక్కడ పరీక్షా కేంద్రాల సమాచారాన్ని అభ్యర్థులకు ఇవ్వడంతో పాటు ఏ బస్సులో వెళ్లాలో అధికారులు చెప్తారు. రాష్ట్రవ్యాప్తంగా 4.03 లక్షల మంది విద్యార్థులు గ్రూప్-1 ప్రిలిమినరీకి హాజరవుతుండగా.. అందులో గ్రేటర్‌ హైదరాబాద్‌లోనే దాదాపు 1.70 లక్షల మంది రాస్తున్నారు. వారికీ రవాణాపరంగా అసౌకర్యం కలగకుండా రద్దీకి అనుగుణంగా సిటీ బస్సులను అందుబాటులో ఉంచడం జరిగింది. ఆర్టీసీ బస్సుల్లో క్షేమంగా పరీక్షా కేంద్రాలకు వెళ్లి.. ప్రశాంత వాతావరణంలో గ్రూప్‌-1 ప్రిలిమనరీ పరీక్ష రాయాలని కోరుతూ.. అభ్యర్థులకు ఆల్‌ ది బెస్ట్‌!" అంటూ సజ్జనార్ ట్వీట్ చేశారు.

Read More
Next Story