తెలంగాణలో రుతుపవనాలకు బ్రేక్, జూన్ 24నుంచి విస్తారంగా వర్షాలు
ఈ ఏడాది ముందస్తుగా వచ్చిన రుతుపవనాలు క్రమేణా మందగించాయి.అప్పుడప్పుడు రుతువపనాలకు బ్రేక్ ఏర్పడుతుంది.జూన్ 24 నుంచి వర్షాలు కురవనున్నట్లు ఐఎండీ కేంద్రం తెలిపింది.
తెలంగాణ రైతులకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ కె నాగరత్న శుభవార్త వెల్లడించారు. పదిరోజుల ముందే తెలంగాణలోకి ప్రవేశించిన రుతుపవనాలు వాతావరణ మార్పుల వల్ల మందగించాయి. దీంతో తెలంగాణలో పలు చోట్ల వర్షాలు ఆశించినంతగా కురవలేదు.
- మందకొడిగా సాగుతున్న రుతుపవనాలతో రైతులు వివిధ పంటల విత్తనాలు చల్లి వర్షాలు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో జూన్ 24 వతేదీనుంచి నాలగైదు రోజులపాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ డైరెక్టర్ నాగరత్న తెలిపారు.
రుతువనాలకు బ్రేక్ వస్తుంటుంది...
గతంలో కంటే ఈ ఏడాది ముందస్తుగా రుతుపవనాలు ప్రారంభం అయినా కొంత విరామం వచ్చిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టరు కె నాగరత్న ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. రుతుపవనాలు మందకొడిగా సాగుతున్నా, జూన్ 24 వతేదీ నాటికి చురుకుగా కదులుతూ విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఆమె తెలిపారు. జూన్ 24వతేదీ నుంచి నాలుగైదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఆమెపేర్కొన్నారు.
తెలంగాణలో సాధారణ వర్షపాతం
ఇప్పటివరకు తెలంగాణలో 8 శాతం వర్షాలు కురిశాయని, అది సాధారణమేనని చెప్పారు.ప్రస్థుతం రుతువపనాల ప్రభావం వల్ల తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో అప్పుడప్పుడు ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. రుతుపవనాల ప్రభావం వల్ల తెలంగాణ రాష్ట్రంలోని ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కూడా కురిశాయి ఆమె తెలిపారు.ఆదిలాబాద్, నిర్మల్, కామారెడ్డి, నాగర్ కర్నూల్,నల్గొండ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీవర్షాలు కురిశాయని నాగరత్న వివరించారు.
అక్కడక్కడా ఓ మోస్తరు వర్షాలు
తెలంగాణ రాష్ట్రంలో గురువారం నుంచి కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వరాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు చెప్పారు. ఉరుములు,మెరుపులు,ఈదురు గాలులు వీచే అవకాశముందని ఐఎండీ అధికారులు తెలిపారు. గాలి వేగం గంటకు 30నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ గురువారం విడుదల చేసిన వెదర్ బులెటిన్ లో తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల,కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిలాల్లో అకకడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణకేంద్రం అధికారులు తెలిపారు.
తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు
ఈ నెల 21వతేదీన తెలంగాణలని ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హనమకొండ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. మూడవ రోజు 22వతేదీన ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిలా ల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షాల సందర్భంగా ఉరుములు, మెరుపులు ఈదురు గాలులు వీస్తాయని బేగంపేట ఐఎండీ కేంద్రం అధికారులు వివరిచారు.
Next Story