Telugu States| ధనిక సీఎం చంద్రబాబు, అత్యధిక కేసులున్న సీఎం రేవంత్
ఏడీఆర్ విడుదల చేసిన రిపోర్టులో తెలుగు రాష్ట్రాల సీఎంలు రికార్డు సాధించారు.ధనిక సీఎంగా చంద్రబాబు, అత్యధిక కేసులున్న సీఎంగా రేవంత్ రెడ్డి నిలిచారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భారతదేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా అవతరించారు. అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు దేశంలోనే అత్యంత సంపన్న ముఖ్యమంత్రిగా రూ.931 కోట్ల ఆస్తులను ప్రకటించారు.
చంద్రబాబు నాయుడు తర్వాత అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ ఆస్తులు మొత్తం రూ.332 కోట్లు కాగా, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రూ.51 కోట్ల ఆస్తులతో మూడో స్థానంలో ఉన్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేవలం రూ.15 లక్షల విలువైన ఆస్తులతో అతి తక్కువ సంపన్నురాలిగా నిలిచారు. జమ్మూ కాశ్మీర్‌కు చెందిన ఒమర్ అబ్దుల్లా రూ.55 లక్షలు, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కోటి ఆస్తులను ప్రకటించారు.ధనిక సీఎం అయిన చంద్రబాబు నాయుడుకు రూ.10 కోట్ల అప్పులు ఉన్నాయి.
అత్యధిక కేసులున్న సీఎంగా రేవంత్ రెడ్డి
దేశంలోనే అత్యధిక పోలీసు కేసులున్న సీఎంగా ఏ రేవంత్ రెడ్డి ముందున్నారు. రేవంత్ రెడ్డి 89 పోలీసు కేసులతో అగ్రస్థానంలో ఉండగా, తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్‌పై 47, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై 32 కేసులు ఉన్నాయి.
Next Story