
Telangana Tourism | విమానాశ్రయంలో తెలంగాణ పర్యాటక సమాచార కేంద్రం
హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తెలంగాణ పర్యాటక సమాచార కేంద్రాన్ని గురువారం పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు.
దేశీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకట్టుకునేందుకు తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ సరికొత్త ఆవిష్కరణలు శ్రీకారం చుడుతుందని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు.శంషాబాద్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో తెలంగాణ తెలంగాణ పర్యాటక సమాచార కేంద్రాన్ని మంత్రి జూపల్లి ప్రారంభించారు.
- ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పర్యాటక శాఖ చేపడుతున్న సంస్కరణలో భాగంగా పర్యాటకులకు మెరుగైన సేవలందించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామన్నారు. రాష్ట్రంలోని ప్రసిద్ధి చెందిన వారసత్వ ప్రదేశాలు, సుసంపన్నమైన సాంస్కృతిక వైవిధ్యం, అబ్బురపరిచే ప్రకృతి దృశ్యాలను సందర్శించేందుకు వచ్చే దేశీయ, విదేశీయ సందర్శకుల కోసం రాష్ట్రంలోని పర్యాటక ప్రదేశాలు, హరిత హోటల్స్, టూర్ ప్యాకేజీలు, రిజర్వేషన్, వెళ్లే మార్గాలు వంటి సమాచారాన్ని అందించేందుకు ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని మంత్రి చెప్పారు.కొత్త పర్యాటక పాలసీకి రూపకల్పన చేసిన ప్రభుత్వం ఈ కేంద్రాన్ని ఆరంభించింది.