Telangana | తెలంగాణకు నిధులివ్వండి, కేంద్రమంత్రికి భట్టి వినతి
తెలంగాణకు సంబంధించిన ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం, అనుమతులు ఇప్పించేందుకు సహకరించాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విన్నవించారు.
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వివిధ ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం, అనుమతులు ఇప్పించేందుకు సహకరించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు కోరారు. సోమవారం ఒడిస్సా రాష్ట్రం కోణార్క్ లో జరుగుతున్న మూడవ జాతీయ మైనింగ్ మంత్రుల సమావేశంలో భాగంగా రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టుల ఆర్థిక అంచనాలు, అనుమతులతో కూడిన లేఖను కిషన్ రెడ్డికి కోణార్క్ లో డిప్యూటీ సీఎం అందజేశారు.
రీజనల్ రింగ్ రోడ్డు
రీజనల్ రింగ్ రోడ్డును 2016వ సంవత్సరంలో కేంద్ర రహదారుల మంత్రిత్వ శాఖ సూత్రప్రాయంగా” ఆమోదించింది. 2022 జులై 3వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజయ సంకల్ప సభలో 350 కిలోమీటర్ల ప్రాంతీయ రింగ్ రోడ్డు నిర్మాణం గురించి ప్రస్తావించారు. ఈ రోడ్డు ప్రాజెక్టు వ్యయం రూ.34,367.62 కోట్లుగా ప్రతిపాదించారు. ఉత్తర, దక్షిణ కారిడార్లకు కేంద్రం నిధులిస్తామని ప్రకటించినా ఇప్పటికీ ఇవ్వలేదు.భూమి సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం 50శాతం ఖర్చును భరించడానికి సిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
రేడియల్ రోడ్ల అభివృద్ధి : హైదరాబాద్ మెట్రో కారిడార్‌లోని 10 కొత్త గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్ల అభివృద్ధి ద్వారా నగర విస్తరణకు ప్రణాళిక రూపొందించారు. ఈ రోడ్ల నిర్మాణానికి రూ.45,000 కోట్లు ఇవ్వాలని కోరారు.
మెట్రో రైల్ ఫేజ్-2 : హైదరాబాద్ మెట్రో ఫేజ్-2కు సంబంధించి మొత్తం 76.4 కిలోమీటర్ల మేర కొత్త కారిడార్లను అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు.దీని ప్రాజెక్టు వ్యయం రూ.24,269 కోట్లుగా నిర్ణయించారు.
మూసీ నది తీరాభివృద్ధి : మూసీ నదికి పునరుజ్జీవన ప్రాజెక్టు, బాపు ఘాట్ వద్ద గాంధీ సరోవర్ అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలని ప్రతిపాదించారు.దీని ప్రాజెక్టు వ్యయం రూ.14,100 కోట్లు కావాలని కోరారు.
గోదావరి-మూసీ నదుల అనుసంధానం:గోదావరి నుంచి 5 టీఎంసీ నీటిని మళ్లించి మూసీ నదిని శుద్ధి చేయడం.దీని ప్రాజెక్టు వ్యయం రూ.7,440 కోట్లు.హైదరాబాద్ నగరానికి 7,444 కి.మీ పొడవునా సీవరేజ్ మాస్టర్ ప్లాన్ రూపొందించారు. రాష్ట్రంలోని రెండో అతిపెద్ద నగరం వరంగల్ కోసం సమగ్ర డ్రైనేజీ ప్రణాళిక.దీని ప్రాజెక్టు వ్యయం రూ. 4,170 కోట్లు కేటాయించాలని కోరారు. బందర్ పోర్ట్ నుంచి హైదరాబాదు డ్రై పోర్టుకు గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణ ప్రాజెక్టు వ్యయం రూ.17,000 కోట్లు.తెలంగాణలోని గోదావరి వ్యాలీ బొగ్గు బ్లాక్‌లను సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్‌కు కేటాయించాలని మల్లు భట్టి విక్రమార్క అభ్యర్థించారు.సెమీకండక్టర్ తయారీ కోసం హైదరాబాదు అనుకూలమైన కేంద్రంగా అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టాలని కోరారు.
Respected Union Minister Shri @kishanreddybjp Garu,
— Bhatti Vikramarka Mallu (@Bhatti_Mallu) January 20, 2025
I am writing to request the Central Government’s support for several key projects in Telangana that are crucial to the state’s progress. The projects include:
- Regional Ring Road: ₹34,367.62 Cr
- Radial Roads: ₹45,000 Cr
-… pic.twitter.com/9mULzBHcDt
Next Story